వినమరుగైన

మైదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవిద్య, అజ్ఞానం, కరడుకట్టిన సంప్రదాయవాదం నేపథ్యంలో తన రచనలలో ఆంధ్రదేశాన్ని ఊపిరాడనీయక భయపెట్టినవాడు చలం. సత్యాన్ని ఎదుర్కొనడానికి భయపడిన తమను సహజమైన రీతిలో వ్యాఖ్యానించి వెలివేశారు. సత్యం చెప్పడానికి భయపడని చలం సమాజానే్న వెలివేశాడు. చలం ఒక్కొక్క రచన సమాజం వీపుమీద ఒక్కొక్క కొరడా దెబ్బ. అయితే మైదానం నవల ఒక పిడుగు. గత శతాబ్దపు తొలి దశాబ్దాలలో ఆంధ్రదేశమే కాదు యావద్భారత దేశంలోనూ స్ర్తిల పరిస్థితి అగమ్యగోచరం. సంసారం ఒక ఊబి. స్ర్తి పురుషులమధ్య మైత్రి కాగడా వేసి వెతికినా కనిపించదు. అగాధం లాంటి అసమానత. అంతా అంధకార బంధమే. స్ర్తికి కనీస విద్య లేదు మెదడుకి ఆలోచనలేదు. హృదయానికి స్పందన లేదు. తను నెట్టబడిన పరిస్థితుల్లో ఇమిడిపోయిన యంత్రం. విశ్వాసం కలిగిన కుక్కలాగా భర్త వెంట తిరగడమే పాతివ్రత్యం- లాలన అనే మాట నిషేధం. అంతా పాలనే- యజమానీ బానిస సంబంధం. రాత్రి తలుపులు మూసిన తరువాతే శృంగారం. అలాంటి ఒక స్ర్తి రాజేశ్వరి. ఆమె భర్త ప్లీడరు గారికి తన ఇంట్లో పుస్తకాల బీరువాలాగే ఆమె కూడా ఒక ఆస్తి- ఒక వస్తువు- ఆ చీకటిలోకి ఆ ఉక్కపోతకి మెరుపులా వచ్చాడతను. ఒక్క చూపులోనే ఆమె వీపుని కాల్చివేశాడు. ఒక్క ఆలింగనంతో ఆమెలోని దివ్యత్వాన్ని మేల్కొలిపాడు. ఆమెలోని ఉద్రిక్త జీవన వాంఛల్ని ఒక్క కుదుపు కుదిపాడు. అతనితో జీవితం కోసం ఆమె బాహ్య ప్రపంచ బంధాలన్నింటినీ తెంచుకుని వచ్చింది.
ఇరుకు గదుల్లోంచీ- విశాలమైన మైదానంలోకి - మూసిన తలుపు మధ్యనించీ ఏటివొడ్డుకి- వంట గదిలో నుంచీ ఇసుక తినె్నలమీదికి అమావాస్య చీకటినించీ వెనె్నల వెల్లువల్లోకి- అతనికోసం ఏదైనా చేసే తెగింపుతో అతని సమక్షం కోసం అన్నీ త్యాగం చేసి స్వతంత్ర దేవతకి తన సాంఘిక భద్రతను ఆర్థికపరంగా వచ్చే సుఖ సౌకర్యాలనూ నైవేద్యం పెట్టింది.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- చలం