వినమరుగైన

నారాయణరావు -అడివి బాపిరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవాన్ విశేషాన్ లాతిగృహా తీతి నవల
ఈ ప్రక్రియలో ఎందరో రసజ్ఞులు తమ రచనా క్షేత్రంలో నవ వంగడాలు పండించి రాసులు పోశారు. మన జాతీయ పునరుజ్జీవనం కోసం బహు మార్గాలలో పునాదులు వేసుకునే రోజుల్లో బాపిరాజుగారి లేఖిని నుండి రుూ నారాయణరావు నవల ఆవిర్భవించింది. ఈ నవల నిజానికి సాంఘికమే అయినా ఇది గొప్ప చారిత్రక నవల అనుకోవడంలో న్యాయముందేమో!
ఈ నవలా రచయిత బాపిరాజు గారు మన్మధనామ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ పంచమి 1895 అక్టోబర్ 8వ తేదీన భీమవరానికి సమీపంలో వున్న పల్లెలో కృష్ణయ్య, సుబ్బమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. రాజమండ్రి ఆర్ట్సు కాలేజీలో కూల్డ్రే మహాశయుని శిష్యరికంలో బి.ఏ చదివి మదరాసు లా కాలేజీలో బి.ఎల్ పట్టా పొందారు. కొంతకాలం భీమవరంలో ప్లీడరుగా వున్నారు. ప్రమోద కుమార ఛటర్జీ వద్ద చిత్రలేఖనం అభ్యసించారు. 1935 నుండి 39 వరకు ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాలుగా వుండేవారు. త్రివేణి పత్రికకు సంయుక్త సంపాదకులుగా కొంతకాలం వున్నారు. సినిమా రంగంలో ప్రథమ కళా దర్శకునిగా పనిచేసిన ఆంధ్రుడు. హైదరాబాద్‌లో మీజాన్ దినపత్రికకు సంపాదకులుగా వున్నారు. ఆయన ఆశ్రయం ఎరుగడు. నిగర్వి. నిరాడంబరుడు. రజుడు, అజాతశత్రుడు, అభివృద్ధి కాముకుడు, దేశభక్తి, గురుభక్తి గలవాడు. కళకళలాడే ముఖం, కళలు విరజిమ్మే కళ్లు, బుద్ధి చాతుర్యాన్ని చాటే విశాలమైన ఫాలం, నల్లని చుట్టు, నెమ్మదిగా నర్తించే పెదవులు, చెక్కిళ్లపై ప్రవహించే చిరునవ్వు, ఖద్దరు లాల్చీ, పొందూరు ఖద్దరు ధోవతి ఆయన రూపం.
ఆయన ఎక్కడ వుంటే అక్కడ కళాపీఠం. అక్కడే ఒక సాహిత్య నందనం వెలిసేవి. ఆయన ఉపన్యాసంలో మాటా, పాటా, ఆటా మూడూ పెనవేసుకుని గొప్ప ఆనంద సుధారసాన్నిచ్చేది. వీరు జాతీయోద్యమంలో పాల్గని 1921లో కడలూరు జైలులో ప్రఖ్యాత జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి బందీగా విడుదలైన కారాగారంలో ఒక సంవత్సరం ఖైదు అనుభవించారు. రవీంద్రుడు స్వతః కవిగాని చిత్రలేఖనం ఇత్యాదులు అలవరచుకున్నాడు. కానీ బాపిరాజు స్వతః కవి. చిత్రకారుడు. వీరిని ఆంధ్ర రవీంద్రులనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాయప్రోలు వారు
మీ యమ్మ, యే తార చాయలో నినుగాంచె
పయోషధుల పాలపాయసంబిడి పెంచె
లేకున్న నీశిల్ప కళాభిరుచి రాదు,
కాకున్న నీ స్వాదు కంఠమబ్బగబోదు,
అడివారిచిన్నాడ, అమృత ధారలవాడక
అని మనసులో మాట పలికారు. బాపిరాజుగారు 1952 సెప్టెంబరు 22న మద్రాసులో కీర్తిశేషులైనారు.
వ్యక్తుల జీవితాలను ప్రధానంగా తీసుకుని సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల. నవల చరిత్ర కాకపోయినా సమకాలీన జీవితాన్ని గూర్చి వ్యక్తమయ్యే చారిత్రక సత్యం. 1934 నాటిది రుూ నారాయణరావు నవల. బాపిరాజు గారు ఈ నవలలో ఆంధ్రుల గుణశీలాలు, విజ్ఞానం, అభిరుచులు, సాంఘిక వ్యవస్థలు, గ్రామీణ జీవితాలు, రాజ్యాంగ వ్యవస్థలు, స్థల పురాణాలు, కొంత కొంత విదేశాల విశేషాలు, వివిధ శాస్త్రాలు లోనగు అనేక విషయాలను జొప్పించారు. శిల్పంలో, చిత్రకళలో, సంగీతంలో, నాట్యంలో, సాహిత్యంలో, రాజకీయాల్లో, వైద్యంలో, హస్తసాముద్రికంలో, జ్యోతిషంలో, ఇంకనూ బహు విషయాలలో తనకుగల పాండిత్యాన్ని, పరిజ్ఞానాన్ని రుూ నవలలో చూపించారు. నారాయణరావు నవలలో బాపిరాజుగారు, ఆయన స్నేహితులు పాత్రధారులు. నారాయణరావులోని ఘట్టాలు చాలా భాగం నిజంగా జరిగినవే. ఈ నవల ప్రథమంలో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది. దీనిని పాఠ్యగ్రంథంగా ఆంధ్ర, చెన్నపురి విశ్వవిద్యాలయాలలో నిర్ణయించారు. బాపిరాజుగారి శైలి ఉప్పొంగిపోయిన గోదావరి వంటిది. వేగానికి గాని, ఉత్తేజపర్చడానికి గాని అది అప్రతిమానమైనది. సందర్భానుసారంగా శైలిని కూర్చడంలోనూ, పాత్రానుగుణంగా భాషను వాడడంలోనూ మహాశక్తిపరుడాయన. కథకుగానీ, నవలకుగానీ, నాటికకు గానీ, పాటకు గానీ, చత్రానికిగానీ శోభ తేవడానికి ఏమేమి చేయాలో అవన్నీ ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. ఈ నవలలో జమీందారు ముందుచూపుగల మనిషి. ఒక సామాన్య రైతు కుటుంబం జమీందార్ల కంటె మించి ఆర్థిక స్థోమత వుండడాన్ని గమనించి, ఆ కుటుంబానికి చెందిన చదువుకున్న నారాయణరావును అల్లునిగా వరిస్తాడు. అందుకే ఈ నవలలో ‘శారద’ అన్న శీర్షికలో ‘పెళ్లికొడుకుది నవ మన్మధాకారం.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మారేమండ శ్రీనివాసరావు