వినమరుగైన

నారాయణరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశయాత్రా విశేషాలు అన్న దానిలో అజంతా చిత్రకారులకు కాశీ పట్టణం లాంటిదని, ఉత్తర హిందూదేశ యాత్ర, భారతీయ ప్రాచీన నాగరికత, బృందావనము, ఆంధ్ర మహారాజ్య చిహ్నములు వీటన్నింటిలో తన గుండెలో కళాత్మకంగా పొందుపరచుకున్న చారిత్రక సత్యాలు, ఆంధ్రుల డాంబికాలు అన్న వాటిలో గ్రంథాలయోద్యమాలు మొదలైనవి.
జగన్మోహనరావు అన్న దానిలో జమీందారుల బ్రహ్మ సమాజ స్వీకారాన్ని వ్యంగ్యంగా అభివర్ణించడం, స్నేహపవిత్రత అన్న దానిలో కాళిదాసును గౌరీ శంకర శిఖరంలా, షేక్స్‌పియరును ధవలఘిరిలా పోల్చి చెప్పడం, వేదాంత బోధలో లక్ష్మీ నరసమ్మతో కందార్థాలు శ్రావ్యంగా పాడించి, పిండోత్పత్తి క్రమాన్ని గురుశిష్య సంవాదంగా వినిపించడం, రెండే మార్గాలులో భారత నాట్య విశేషాలు యిలా ఎనె్నన్నో అంశాలు రుూ నవలలో విపులంగా చోటుచేసుకున్నాయి.
ప్రాపంచిక బాధలు బాపిరాజుగారిని ఏమీ చేయలేక అవే కథా వస్తువులుగా ముస్తాబై వచ్చి నవ్వుతూ ఆయన ఎదుట నిలిచేవి. అందుకే కవితా హృదయం వున్న ప్రతి ఒక్కరినీ బాపిరాజు రచనలు చదివిస్తాయి.
కొన్ని వందల పేజీలు వున్నా రుూ నవల ఒక రవ్వ కూడా విసుగు కలిగించదు. చదువుతుంటే ఒక నవల చదువుతున్నట్లు గాక మధురమైన ఒక ప్రణయ కావ్యం చదువుతూ, ఆనాటి సాంఘిక, రాజకీయ పరిస్థితులను పరిచయం చేసుకుంటూ, ఆనాటి శక్తులను దర్శించుకుంటున్న అనుభూతి కలుగుతుంది. నవల చదువుతుంటే అందులోని పాత్రలను చలనచిత్రంగా చూస్తున్నట్లు ప్రతి పాఠకునికి అనుభూతి కలుగుతుంది. ఈనాడు బాపిరాజుగారు లేరు. ఆయన చెప్పినవారూ లేరు. కానీ వారి వర్ణన చదువుతుంటే వారు కళ్ల యెదుట నిలుస్తారు. భావి కాల పరిశోధనలకు రుూ నవల ఆయన అందించిన ఒక ఆణిముత్యం!
‘నీ నవలలు స్మృతిపథాన
నిలుపుకున్న సమయంలో
శరశ్చంద్ర చంద్రబాల
కరకంకణమే మెరసెను
....
చంద్రికా విహార విధుర
శీతల జలమే కురిసెను
కందర్పుని సుమశరముల
కాంతి పుంజమే విరిసెను
ఓహోహో కవిరాజా!
ఓహోహో మధుమూర్తి
స్వీకరింపు పుష్పాంజలి
మందార ప్రసూన హృదయ
మందించే పుష్పాంజలి!

-- సమాప్తం
=================================
* రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

--అడివి బాపిరాజు