వినమరుగైన

వేయ పడగలు- విశ్వనాథ సత్యనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ కూడా దీనికి సంబంధించిన వాదాన్ని ఆయన చెప్పటం తరువాత పండితులనేకులు దానికి ప్రతివాదం చేయటం జరిగింది. ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు విశ్వనాథవారి జీవితంలో ఎన్నో. ఉదాహరణకు గుంటూరు ఏసి కాలేజీలో మత సంబంధమైన అభిప్రాయాలకు రియాక్ట్ అయినందుకు ఉద్యోగము వదులుకోవలసి వచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొకటి రాని దశలో వ్రాయబడినదీ నవల. అందుకే ఈ సంఘటన ప్రభావం ధర్మారావు పాత్రలో కూడా కొంత చోటుచేసుకొన్నది.
ఆ రోజుల్లో ఉత్తర దక్షిణ దేశాల నుండి రకరకాల ధ్యాన సంప్రదాయాలు తెలుగుసీమలోకి ప్రవేశించినవి. ఆ మార్గాలలో సాధన చేసేవాళ్ళు కొందరు తమకు దేవతలు కనిపిస్తున్నారని, రోజూ మాట్లాడుతున్నారని, తాము దేవతాంశలతో పుట్టామని,- ఇవన్నీ భ్రాంతులని, వారికి ఒకవేళ కలిగితే ఆ అనుభవము అసత్యమని విశ్వనాథవారి అభిప్రాయము. ఒక వ్యక్తి కష్టపడి అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తే ఎప్పటికో ఒక దేవత కనిపించి ఆ సాధనకు తగిన వరమిచ్చి వెళ్లిపోతుంది.
అంతేకాని కళ్ళు మూసుకొని నాలుగు రోజులు కూచోగానే రోజూ దేవతలు వచ్చి వీళ్ళతో కబుర్లు చెపుతూ గంటల తరబడి కాలక్షేపం చేయటం అసంభవమని, శాస్త్ర విరుద్ధమని వారి నిశ్చయం. ఈ అంశానే్న శివరావనే పాత్ర ద్వారా 13వ అధ్యాయంలో చెప్పారు. ఆ శివరావు తన ధ్యానంవల్ల అనుభూతులలో తాను కృష్ణుడైనట్లు తాను అవతారమూర్తిని గనుక ఇంక తాను లోకోద్ధరణ చేయబోతున్నట్లు తాను అవతారమన్న అంశాన్ని అందరూ అంగీకరించాలని కోరుతాడు. దాని నిరూపణకు ఆ రోజుల్లో దార్శనికునిగా పేరుగాంచిన దివ్యజ్ఞాన సమాజ యోగి లెడ్‌బీటరుకు వ్రాయిస్తారు. అతడు జవాబు వ్రాస్తూ తన ధ్యానభూమికలలో ఎక్కడా కృష్ణుడు శివరావుగా వచ్చినట్లు కనబడలేదని కనుక తాను అంగీకరించలేనని సమాధానం చెప్పాడు. దానితో శివరావు నిస్పృహ చెందాడు. పార్దివమైన శరీరంలో ఉన్నవారిని అవతారమూర్తులుగా భావించటాన్ని విశ్వనాథవారు ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. వేలూరి శివరామశాస్ర్తీగారి వంటి ఆత్మీయులైన పెద్దలతో కూడా ఈ విషయంలో వారికి అభిప్రాయ భేదాలుండేవి. ఆధ్యాత్మిక విషయాలలో వారికి శంకరాచార్యులు పరమ ప్రమాణం. విమలానంద భారతి, కళ్యాణనంద భారతీస్వామివర్యులు జ్ఞానప్రదాతలు. ఆ మార్గమే ధర్మారావు పాత్రలో చిత్రించారు. మనుజుని మనస్సు కోతివంటిదని శంకరులు చెప్పిన శ్లోకం వారికెంతో నచ్చి 24వ అధ్యాయంలో దానిని ఉదహరించారు.
‘‘సదా మోహాటవ్యాం చరతియువతీ నాం కుచగిరే
నటత్యావా శాఖాస్పటతి ఝడితి స్వైరమభితః
కపాలిన్! భిక్షో! మే హృదయ కపియత్యం తచపలం
దృఢంభక్త్యా బద్ధ్యా శివభవద దీనం కురు విభో!
ఎప్పుడూ మోహారణ్యాలలో తరుణీస్తవ పర్వతాలమీద ఆశలనే కొమ్మలమీద స్వేచ్ఛా విహారం చేసే మనస్సనే కోతిని నీ అధీనం చేసుకో స్వామీ! అనే భావం వారికి ఎంతో ఇష్టమైనది.
ఆంగ్లేయ సాహిత్యాన్ని మించింది లేదని తెలుగులో అసలు సరియైన సాహిత్యమే లేదని విమర్శలు విరివిగా వస్తున్న కాలమది. 17వ అధ్యాయంలో దీనిని గురించి రెండు పాత్రల మధ్య చర్చ జరిపించారు. ఇంగ్లీషులో ఎలిజీ, సెటైరు, ట్రాజెడీ, కామెడీ, బేలడ్, సోనెట్సు మొదలగు ప్రబంధ విశేషాలెన్నో ఉన్నవని, తెలుగులో బూతు కూతలైన ప్రబంధములు తప్ప వేరే ఏమీ లేవని చక్రవర్తి అనే పాత్ర చేసిన విమర్శకు సమాధానం చెపుతూ ధర్మారావు ఇలా అన్నాడు. ‘‘మనకును లక్ష రకముల ప్రబంధములున్నవి. పురాణములు, ఇతిహాసములు, కావ్యములు, కావ్యాలలో ఎన్నో రకాలు, నాటకాలు, అవి పది రకాలు- పదాలు, క్షేత్రయ్య పదముల వంటివి. యక్షగానములు, జంగము కథలు, బొబ్బిలి పాటలు, శతకములు, ఉదాహరణములు, చాటువులు, స్తోత్రములు- ఇవన్నీ కాక వారికి లేని లక్షణ గ్రంథములు- ఇంత విలక్షణమైన సృష్టి ఇతర దేశములలో చూపుడు’’ ఇలా ఉంది సమాధానం.
ఈ విధంగా ఈ నవల ద్వారా భారతీయ విజ్ఞాన భాండారంలోని ఎన్నో మహత్తర విషయాలను ప్రదర్శించారు సాహిత్య విరాడ్మూర్తి విశ్వనాథవారు. అంతమాత్రమే కాదు, కథాకథనంలో, పాత్ర చాలనంలో అద్భుతమైన నైపుణ్యం చూపించారు. అందుకే వేయిపడగలు ఆంధ్ర సాహిత్యంలో ఒక మహాద్భుతమైన నవల. అనితరసాధ్యమైన అపూర్వ సృష్టి.
- సమాప్తం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ప్రసాదరాయ కులపతి