వినమరుగైన

చదువు -కొడవగంటి కుటుంబరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన చదువులకు మనం పెరిగే సమాజానికీ ఏమి సంబంధం లేదా? చదువు ఒక వినియోగ వస్తువా? లేక నూతన మానవుడిని సృజించే సాధనమా?
వీధి బడులు మధ్యకాలాలనాటి చిత్రహింసల శాలల్లాగే ఉన్నాయి. పాఠాలు వల్లె వేయించటమే విద్య నేర్పే పద్ధతయింది. చదువు కొనుక్కునే వస్తువయింది. బెనారస్‌లో ఫీజ్ కట్టను రెండొందలు లేక తన ఉన్నత విద్యకు ఫుల్‌స్టాప్ పెట్టాడు సుందరం. విచిత్రంగా ఈ నవలాకాలానికి 60 ఏళ్ళ తరువాత కూడా ఇదే పరిస్థితి- ఇవే ప్రశ్నలు- జీవితం పెద్దగా మారిందేం లేదు. సంకెళ్లు కొంచెం వదులయినాయి. అంతే! చదువు ఒక పీరియడ్ నవలే అయినా, అందులోంచి అంశాలు నేటికీ రిలవెంట్ కావటం గొప్ప విశేషం!
సుందరం ఈ నవలకు నాయకుడా అంటే, అవును, కాదు అని రెండు సమాధానాలు చెప్పుకోవచ్చు. సుందరాన్ని ఒక వ్యాఖ్యాతగానే చూస్తాము. నేషనల్ జాగ్రఫిక్ ఛానల్‌లో డాక్యుమెంటరీలకు వెనుక ఒక గంభీరస్వరం వినిపిస్తుంటుంది. అట్లాంటి గంభీరస్వరం సుందరం పాత్ర. అతను సాంప్రదాయాల కుటుంబంలోంచి వస్తాడు. జాతీయ ఉద్యమాన్ని ఒరుసుకుంటూ నడుస్తాడు. అయితే ఉద్యమం తీవ్రతలోకి దూకాలని ఎప్పుడు ప్రయత్నించడు. కులవ్యవస్థను చాలాసార్లు విసుక్కుంటాడు. అయితే దాన్ని ఛేదించాలని పెద్దగా ప్రయత్నం చేసినట్లు కనబడదు. సంస్కరణోద్యమాల వెలుగును ఇష్టపడతాడు. అట్లా అని శకుంతలను మళ్లీ పెళ్లిచేసుకోవడానికిగొప్ప సాహసమేమీ చూపడు. తనను తాను మారే జీవితానికి ప్రతినిధి- అని గట్టిగా నమ్ముతాడు. అయితే ఈ మారే జీవితాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లడానికేమీ ప్రయత్నించడు. ఈ క్రొత్త భావజాలాల, కొత్త గుళ్ల దగ్గర, ఒట్టి యాంత్రికుడిగానే సుందరాన్ని కొకు ఉంచదలచాడా? కొకు సుందరాన్ని సమాజ ప్రయోగశాలలో పరికరంగానే తీసుకున్నాడు. రాజకీయ, సాంఘిక, తాత్విక కళా చైతన్యాలు ఒక సగటు యువకుడిని ఎట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయో- అతడు ఎట్లా పరిణామం చెందుతాడో తెలియజెప్పటమే ఆయన ఉద్దేశ్యం! నిజానికి ఈ నవలలో కథానాయకుడు ‘చరిత్ర’. చరిత్ర మనిషి తాత్వికగతిని, సమాజ ఆలోచనా సరళిని ఎట్లా ప్రభావితం చేస్తుందో చెప్పటమే ఈ నవల ఉద్దేశ్యం! ముందు చెప్పినట్లుగా ఈ నవల ఒక సోషల్ హిస్టరీ. ఇందులో సాహిత్యం కన్నా చరిత్ర ఎక్కువ ఉంది. ఒట్టి తారీకుల, దస్తావేజుల చరిత్ర కాదు. రక్తమాంసాల మానవ సమాజ చరిత్ర! రసమయమైన మానవ సాంస్కృతిక చరిత్ర! అన్ని సంబంధాలను ప్రభావితం చేసే ఆర్థిక చరిత్ర. భావజాలాల్నీ, తాత్విక తీవ్రతనీ శాసించే సామాజిక రాజకీయ చరిత్ర.
చదువు విశిష్టత దాని డిసిప్లిన్డ్ ఎకానమీ ఆఫ్ ఎమోషన్స్ అండ్ కారెక్టరైజేషన్స్‌లో ఉంది. అందుకోసం ఆయన ఎంచుకున్న హ్యూమన్ డ్రామా, దాన్ని చెప్పిన సులువైన వచనంలో ఉంది. కుటుంబరావుగారిది నేరేటివ్ ప్రోజ్. శ్రావ్యతకన్నా సరళతకు ఆయన ఇష్టపడతాడు. తనకూ పాఠకుడికీమధ్య డైరెక్ట్ డైలాగ్ తప్ప సాంప్రదాయమైన శైలీపరదాలు ఉండటం ఆయన ఇష్టపడడు. గాఢమైన ఇమాజినేషన్, మిరుమిట్లు గొలిపే రంగులు లేని రచనా శిల్పం ఆయనది. ఆయన రచనలు నలుపు తెలుపులు చిత్రాలు - మానవ చరిత్రకు ఏ ఉద్రేకాలు లేకుండా చెప్పే స్టారీ టెల్లర్ కొకు. అయితే ఒక విజన్, ఒక అవేర్‌నెస్ కథల్లో పొదిగి పాఠకుణ్ణి గొప్ప ఆలోచనలోకి తోసివేసే రచనలు ఆయనవి. ఆ రచనల్లో లాంటిది చదువు.
ఒక సమాజం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న దశను రికార్డు చేసిన నవల చదువు! రచయిత ఒక ఇన్‌సైడర్‌గా ఉండి సమాజ పరిణామాన్ని నవలలో బంధించే ప్రయత్నం ఈ నవల. ఆధునిక మానవులుగా మనం ఎదిగిన తీరును ఆ ప్రాసెస్‌ను వివరించే సోషల్ హిస్టరీ చదువు నవల.
నిస్సందేహంగా మనకున్న కొద్ది గొప్ప నవలలో ఒకటి చదువు.
- సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి

-వి.చంద్రశేఖరరావు