వినమరుగైన

అసమర్థుని జీవయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసమర్థుని జీవయాత్ర నవలలో మొట్టమొదటి దోషం- ట్రాజిక్ ఫ్లో- ‘సీతారామారావు అతని తండ్రికి తగిన తనయుడవటం. తల్లికి తగిన తనయుడవలేకపోవటం. తండ్రి గడించిన వ్యవస్థకు ఒక ప్రతీక. తల్లి రానున్న వ్యవస్థను అడ్డుకొంటున్న పురుషాధిక్య వ్యవస్థకు ప్రతీక. వంశానికీ, సామాన్య జీవనానికీ పొంతనలేని ఒకానొక విడివిడితనానికి మధ్యన నలిగిపోయే ఓ వంశోద్ధారకుడి ఆత్మ చరిత్రే అసమర్థుని జీవనయాత్ర.
తన కాల్పనిక వంశ గౌరవానికీ బయటెక్కడో ఉండి క్షణక్షణమూ అతనిని తొంగి చూచి హింసించే వాస్తవ సమాజానికి మధ్యలో నలిగిపోయి దేహాత్మనా చిద్రుపలైపోయిన సీతారామారావు కథే అసమర్థుని జీవయాత్ర. హృదయం బుద్ధితో కాట్లాడుతుంది. బుద్ధి సహజాతంతో పోట్లాడుతుంది ఈ చిన్న నవల ఆసాంతం.
ఏదైనా ఒక పాత్రలో ఏదన్నా ఒక ద్రవం పోస్తే ఆ పాత్రా, ఆ ద్రవమూ అలాగే నిలబడి ఉంటాయి మామూలుగానయితే.
అయితే సీతారామారావు అనే పాత్రలో అంతఃచేతన అనే ద్రవం నింపితే పాత్రతోబాటు ద్రవమూ కరిగిపోవటమూ చూస్తాం ఈ నవలికలో. ఉనికి కోల్పోవటంతో వ్యక్తిత్వమూ కనుమరుగవుతుంది. కరిగిపోతుంది.
***
అసలు గొడవంతా ఎక్కడ్నుంచి మొదలయిందంటే- వంశగౌరవాన్నించి. అసలు వంశం అనేదానికి అర్థం సరిగ్గా తెలీని పరిస్థితిలో-వంశాన్ని వశం చేసుకునే ప్రయత్నంలో, సీతారామారావు తండ్రి చనిపోయిన తర్వాత చాలా ఉదారుడుగానూ, ధర్మిష్టిగానూ జీవిద్దామనుకొన్నాడు. కర్మిష్టిగా కాదు. ఏ పొరపొచ్చాలూ పెట్టుకోదల్చుకోలేదు. మంచిగానే ఉందామనుకొన్నాడు. మంచే చేద్దామనుకొన్నాడు.
తన అహం తను కూడా చంపుదామనే అనుకొన్నాడు. కాని సమాజం అందుకు కనీసం ఒక కృతజ్ఞతా వాక్యమన్నా చెప్పలేదు. ముఖ్యంగా మేనమామ! తను కన్నతల్లికి స్వయానా సోదరుడు. ఇవ్వాల్సిన 40వేల ఋణానికిగాను పనికిరాని పదెకరాల జిల్లేడు క్షేత్రం అంటగట్టాడు. మేనమామది వృత్తి, సీతారామారాది ప్రవృత్తి.
వంశగౌరవం ప్రవృత్తి; సమాజంలో మేనమామది ప్రవృత్తి. కాని సీతారామారావు తండ్రిది కూడా ఒక రకంగా చూస్తే వృత్తే. జ్ఞానానికీ ప్రదర్శనకీ వున్న అగాధం కొలవలేనిది.
వంశగౌరవము కోల్పోయి, ఐశ్వర్యమూ చేతులారా పంచేసి మరి ఇందిరనెందుకు పెళ్లిచేసుకోవాలి? ఉద్యోగం చెయాల్సిన కర్మకెవరు బాధ్యులు? తనా? తన వంశమా? తన తల్లిని తండ్రే ఎంత హింసించాడు? మేనమామని ఎంత అవమానించాడు? మేనమామ ప్రతీకారం తీర్చుకోడా మరి? ఇపుడు సీతారామారావు ఎవరిమీద ప్రతీకారం తీర్చుకోవాలి? తన మీదా? తన తండ్రిమీదనా? రామయ్య తాత లోకజ్ఞానం, ఆత్మజ్ఞానం నేర్పుతూనే ఉన్నాడు.
కానీ సమయం మించిపోయింది. తన తల్లి అకాల మరణానికి తండ్రే కారణం. తన అకాల సమరణానికి మాత్రం తనే కారణం. అదీ ఆత్మహత్యలో. కన్న కూతురే భయపడుతుందేమిటి తనను చూచి? తన భార్య తిరిగి తన తల్లి రూపంలో తిరిగి వచ్చిందా ఏమిటి? అంతటి సహనశీలిని తను ఎంత హింసపెట్టాడు? కొట్టాడు, తిట్టాడు, తన తండ్రిలానే. తను ఒక్కడే. కాని తన కళ్లముందే తాను ఇద్దరు మనుషుల్లా ప్రత్యక్షమవుతున్నదేమిటి? తను అసలు మంచివాడా చెడ్డవాడా? అసలీ సమాజం మంచిదా చెడ్డదా?
ఆసీతారామారావు పాత్రలో వంశపారంపర్యపు అహంకారం అతని జీవితంలో అమాయకత్వంలోకి పరిణమించి, అతన్ని అన్ని బాధలు పెట్టింది.
సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-వేగుంట మోహనప్రసాదు