వినమరుగైన

అసమర్థుని జీవయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాధలు పడి అతను భార్యనీ, కూతుర్నీ పరోక్షంగా బాధలు పెట్టాడు. అతని మేనమామే గనుక అలాంటి ఉత్తరం రాయకపోతే తన తండ్రినీ, తల్లినీ, ఈ సమాజాన్నీ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయేవాడు. అస్తిత్వ వేదనతో అస్థిమిత మనస్సుతో అతను ఒక వేశ్య పిలిస్తే వెళ్తాడు. ఇద్దరి అస్థిమితాలు ఒకటేనని తెలుసుకుని పారిపోతాడు.
ఓ సుందర స్వప్నంలాంటి జీవితం కొనసాగుతున్న పీడకల అవుతుంది. అదీ స్మశానంలో ఆత్మహత్యలో అంతమవుతుంది.
***
గోపీచంద్ ఈ నవలలో ప్రయుక్తం చేసిన రచనా శైలి అంతర్ముఖీన వక్తృత్వ శైలి. చైతన్య స్రవంతి శైలి. సీతారామారావు తనతో తను మాట్లాడుకొనేప్పుడు బయటి నుంచి సమాజం అతనితో మాట్లాడుతుంది. దీన్ని డ్రమెటిక్‌గా మోనోలాగ్ అని కూడా గుర్తుపట్టవచ్చు.
ఈ నవలలో వున్న ఒకే ఒక లోపం- రామయ్యతాత సుదీర్ఘమైన ధార్మికోపన్యాసం. అది సీతారామారావు కోసం రామయ్య తాత చేసింది కాదు- పాఠకుల కోసం ఆలోచనాశీలి అయిన గోపీచంద్ అనే నవలకారుడు చేసిన దీర్ఘోపన్యాసం. ఈ ఒక్క లోపాన్ని ఆవల ఉంచితే సహజ సంభాషణలు ఎన్నో ఇలాంటివి వినపడ్తాయి.
‘‘బాబూ! మన వంశం పేరు నిలబెట్టు. అంతకంటే నే చెప్పేది ఏమీ లేదు’’ అని సీతారామారావు తండ్రి.
‘‘తండ్రికి మించిన చెయ్యి’’ అని సమాజం ‘‘ఇవి స్తనాలు అనుకుంటున్నారేమో కాదు మాంసపు ముద్దలు’’ అని సీతారామారావు లోలోచన. ‘‘శరీరానికి, శవానికీ భేదం ఏమిటి?’’ అని సీతారామారావు ప్రశ్న.
‘‘సోదరీ!’’ అని సీతారామారావు గోడమీది బల్లిని పిలవటం.
‘‘ఆత్మ ఎప్పుడూ మూలనున్న ముసలమ్మ మల్లే గొణుగుతుంది’’ అని అతని ఆత్మే.
‘‘అతనికి అకస్మాత్తుగా నెమరువేసే గేదె జ్ఞాపకం వచ్చింది’’ ఆ గేదె అతనే,
‘‘ఆడదెవరో జూడరా..
***
మాట విననిది గాడిద’’
ప్రపంచంలో వున్న భార్యలందరూ అలా కన్పించారు-మనోవ్యాధి పీడితుడైన సీతారామారావుకి.
‘‘సంఘం అంటే ఏమనుకొన్నావు? అది చేనుకి కంచె, చేలో మంచె’’ పిచ్చెక్కి ప్రవచించినా సీతారామారావు చెప్పిన సత్యం- అదీ ఒక వేశ్యతో.
శివరావు, సూర్యారావు, బాలకృష్ణుడు, ఏనాదివాడూ, చైతన్యస్వామీ, పరబ్రహ్మశాస్ర్తి, నాగలింగం, విశే్వశ్వరరావు, రాంభొట్లూ, సూర్యప్రకాశరావూ తనకంటే తక్కువ నీచులేం కాదు కదా! మరి ఒక్క సీతారామారావే అసమర్థుడెందుకయిపోయినాడు?==రామయ్య తాత సీతారామారావుఊర్థ్వచేతన, సీతారామారావు అధోచేతననని ఒక్కసారిగా రామయ్య తాత పటాపంచలు చేసేటప్పటికి చెడి బతికావా బతికి చెడ్డావా? అనే ప్రశ్నకు ఉక్కిరిబిక్కిరయ్యి- సీతారామారావు స్మశానంలో తన తండ్రి నీడనీ, తన నీడనీ సమాధిలో ఆనందాశృవుల్ని రాలుస్తున్న తన తల్లినీ, ఓ నల్లని కుక్కనీ చివరికి తన నీడలోని పొడనీ చూచుకొని విహ్వలుడై తన మెడను తానే కోడి మెడను విరిచినట్లు విరుచుకొన్నాడు.చివరగా ఒక మాట- సీతారామారావు శాడిస్టు కాడు. మాసోలికిస్టు. రెండు తరాలకూ, రెండు సంస్కృతులకూ మధ్య రెండు ప్రపంచ యుద్ధాల మధ్య నిలిచి నలిగిపోయిన ఇలాంటి వంశోద్ధారకులందరూ స్వీయ బాధల్లో స్వీయగాధల్లో ఆనందాన్ని పొంది, ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలకు స్వీయ కరుణలోనే ఆనందాన్ని పొందుతారు.
సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి.

-వేగుంట మోహనప్రసాదు