వినమరుగైన

ఎంకి పాటలు - నండూరి వెంకట సుబ్బారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివాహానంతరం కొత్త దంపతులు చేసే తీర్థయాత్రల ప్రస్తావన కూడా యెంకి పాటల్లో కనిపిస్తుంది.
‘‘ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి
మూటముల్లీ గట్టి ముసిలోల్లతో సెప్పి
యెంకీ నాతోటి రాయే- మన
యెంకటేశరుణ్ణి యెల్లి సూసొద్దాము’’-
‘‘ఆడనీ సుక్కాని రుూడనే గెడ యేసి
పడవెక్కి బద్రాద్రి పోదామా
బద్రాద్రి రాముణ్ణి సూదమా’’
‘‘యెంకితో తీర్తానికెల్లాలి
సంకలో పిల్లోడు సంబ్రాలు పడుతుంటె
యెంకితో తీర్తానికెల్లాలి’’
అన్న పాటలు యిందుకు నిలువెత్తు నిదర్శనాలు.
ఈ వలపుల గంధం రుూనాటిది కాదని, అది ఏనాటికి యిగిరిపోదనీ ప్రేమికులు భావిస్తారు. ఏడేడు జన్మల బంధంగా తలపోసే రుూ ప్రణయ బంధాన్ని ఎంతో హృదయంగమంగా వర్ణించారు శ్రీ నండూరివారు.
‘‘యెనక జన్మములోన యెవరిమోనంటి
సిగ్గొచ్చి నవ్వింది సిలక నా యెంకి
ముందు మనకే జల్మముందోలెయంటి
తెలతెల్లబోయింది పిల్ల నా యెంకి
యెన్నాళ్లో మనకోలె ఈ సుకములంటి
కంట నీరెట్టింది జంట నా యెంకి’’
ఎంతటి ప్రణయ రసాధి దేవతలైనా అడపా తడపా అలిగితేనే గానీ, ఆ బంధానికి అందం వుండదు. అలకవల్లనో, అన్నమాట నిలబెట్టుకోలేదనో, వేరే వూరికి వెళ్లి, చెప్పిన సమయానికి తిరిగి రాలేదనో- ఈ పల్లె జంట జీవితంలో కూడా విరహవేదన చోటుచేసుకుంది.
‘‘అలనాటి నావోడు సెందురూడా/ అలిగి రాలేదోయి సెందురూడా
కలకాల మీ దినమె నిలుసు మనకన్నాడు
గాలికైనా తాను కౌగిలీనన్నాడు’’
అన్న యెంకి మాటల్లో విరహవ్యధతోపాటు, తన బావపై వున్న నమ్మకం కూడా వ్యక్తవౌతుంది.
‘‘రావొద్దె నాపక్క రావొద్దె యెంకి
ఆ పొద్దె, మన పొత్తులయిపోయె యెంకి’’
‘‘నన్నిడిసి పెట్టెల్లి నాడే నా రాజు
మొన్న తిరగొస్త నన్నాడె’’
‘‘ఈ రేయి నన్నొల్ల నేరవా, రాజా
యెనె్నలల సొగసంత యేటిపాలే నటర’’
అన్న పాటలో యెంకి-నాయుడు బావల రుసరుసలు, కన్నీళ్లు వేడికోళ్లు హృద్యంగా పాఠకులకు సాహిత్య రసానందాన్ని పంచిపెడతాయి.
‘‘ఉత్తమా యిల్లాలినోయి
నన్నుసురుపెడితే దోసమోయి’’
అన్నపాటలో విరహజనిత వేదనతో పాటు ఉపాలంభన కూడా వినిపిస్తుంది. ఈ కోవకు చెందిన పాటలన్నింటికి మకుటాయమానమైంది.
‘‘దూరాన నా రాజు కేరాయిజౌనో
రుూరోజు నా రాత లే రాల పాలో’’
అన్న గీతం స్థాలీపులాకంగా పరిశీలిస్తే యెంకి పాటలలో రెండు భాగాలు వున్నాయి. మొదటిది పాత పాటలు, రెండవది కొత్త పాటలు. పాత పాటలు వ్రాసిన తర్వాత చాలా కాలానికి కొత్త పాటలు వ్రాశారు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-కె.వి.ఎస్.ఆచార్య