వినమరుగైన

మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో కుతుబ్షాహి సుల్తానుల తర్వాత అసఫ్జాహీల పరిపాలనలో దాదాపు రెండు వందల సంవత్సరాలపాటు ఆంధ్ర సంస్కృతి అణగారిపోయింది. నిజాం పరగణాలో అత్యధిక సంఖ్యాకులైన ప్రజలు ఆంధ్రులే అయినా ఆంధ్ర భాషకు గౌరవం లేకపోయింది. (1951 లెక్కల ప్రకారం తెలంగాణలో తెలుగు మాట్లాడే ప్రజల సంఖ్య 90 లక్షలు. మరాఠీ మాట్లాడేవారి సంఖ్య దాదాపు 45 లక్షలు. కన్నడం మాట్లడేవారు 20 లక్షలు. ఉర్దూ మాట్లాడేవారు 21 లక్షలు. నైజాం నవాబు ఉర్దూ భాషను రాజభాష చేశారు. తెలుగు భాష, సంస్కృతి పూర్తిగా నిరాదరణకు గురయ్యాయి.)
నానాటికీ నిజాం పరిపాలన దుర్భరమైంది. దేశముఖ్‌లు, జాగీర్దార్‌ల క్రౌర్యమూ, పటేల్ పట్వారీల పీడనా ప్రజలకు భరింపరానివి అయ్యాయి. సేద్యానికి కాలువలు, చెరువులు, బావులు తవ్వించటం పోయి జాగీర్దార్లు పేద రైతుల ఎముకల్ని పిండిచేసి, పండిన పంటలో ఎక్కువ భాగాన్ని శిస్తు కింద జమ కట్టుకోసాగారు. భూస్వాములు వివిధ వృత్తులవారి చేత అన్యాయంగా వెట్టిచాకిరీ చేయించుకునేవారు. పన్నులు చెల్లించలేని రైతుల భూములను స్వాధీనం చేసుకోవటంతో భూస్వాముల వద్ద భూమి అపరిమితమైపోయింది. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబానికి లక్షన్నర ఎకరాల భూమి వుండేదంటే యిక భూస్వాముల అధికారమెంతో వూహించుకోవచ్చు. వెట్టిచాకిరీతో కృశించిపోయిన ప్రజలు ‘‘బాంచను -నీ కాల్మొక్కుతా దొరా’’ అని మాట మాటకూ అంటూ భూస్వాముల పాదాల దగ్గర నికృష్టంగా బతుకుతూండేవారు.
పన్నులు చెల్లించలేని పేద రైతులను వంగబెట్టి మూపుకే బండలు పెట్టేవారు. పండిన పంటనంతా లెవీలని, తావానులనీ, నాగూలని, నజరానాలనీ దోచుకునేవారు. భూస్వాముల ఇండ్లలో వేడుకల ఖర్చుకోసం సమర్తపట్టీ, పెండ్లిపట్టీ, చూడిద పట్టీల పేరిట డబ్బు బలవంతంగా వసూలు చేసేవారు.
పరిపాలకుల దోపిడీకి, దౌర్జన్యానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలన్న గట్టి సంకల్పంతో శ్రీయుతులు మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు, బూర్గుల రామకృష్ణారావు మొదలైనవారు పూనుకొని 1922లో ఆంధ్ర జన సంఘమును స్థాపించారు. ఈ సంఘం గ్రంథాలయాలు స్థాపించటం వంటి సాంస్కృతిక కార్యకలాపాలకే పరిమితమైంది.
నిస్సహాయులైన ప్రజలకు సాయంచేయటానికి 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. దీని ప్రథమ మహాసభ మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి రుూ సభకు అధ్యక్షులు. ఆంధ్ర మహాసభను సామాన్య ప్రజలు సంగం అని పిలుచుకున్నారు. సంగం క్రమంగా తెలంగాణ ప్రజల జీవితంలో ఒక భాగమైంది. ఆంధ్ర మహాసభ సభ్యులు చూపిన సాహసం, చేసిన త్యాగాలు ఎంత వర్ణించినా తనివితీరనివి. ఆంధ్ర మహాసభ మొత్తం పదమూడు మహాసభలను జరుపుకుంది. ఈ సభ ప్రజలలో కలిగించిన చైతన్యం జాగీర్దార్ల, పటేల్ పట్వారీల దౌర్జన్యాల్ని దోపిడీని ఎదిరించే దశకు చేరుకున్నది. ఒక విధంగాచూస్తే ఆంధ్ర మహాసభ చరిత్ర తెలంగాణలో జాతి పునరుజ్జీవన చరిత్ర అని చెప్పవచ్చు.
విసునూరి దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దౌర్జన్యలను ప్రతిఘటించి ప్రజలు ఐకమత్యంతో నిలిచినప్పుడు దేశముఖ్ దౌర్జన్యానికి తలపడి తన గూండాల చేత కాల్పులు జరిపించాడు. ఆ కాల్పులలో దొడ్డి కొమురయ్య అనే కార్యకర్త తుపాకి గుండ్లకు బలి అయ్యాడు. ఈసంఘటన 1946- జూలై 4వ తేదీన జరిగింది. ఆ గ్రామ ప్రజలు అందరూ ఏకమై దేశముఖ్‌ను, అతని కొడుకును, గూండాలను గ్రామం నుండి తరిమికొట్టారు.
- ఇంకా ఉంది -
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కడియాల రామమోహనరాయ్