వినమరుగైన

మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సుంకర సత్యనారాయణ, శ్రీ వాసిరెడ్డ్భిస్కరరావు రచించిన మాభూమి, ముందడుగు నాటకాలు భూమి సమస్యను, రైతుల కష్టాలను కళ్లకు కట్టించాయి.
‘తెలంగాణ విమోచనోద్యమం- తెలుగు నవలపై పరిశోధన చేసి సిద్ధాంత వ్యాసం రచించిన వరవరరావుగారన్నట్లు ‘‘తెలుగు సాహిత్యమే గర్వించదగిన నవలా సాహిత్యాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం సృష్టించింది. ఈ విధమైన నవలలన్నిటికీ మార్గదర్శమైనది మృత్యుంజయులు.
తెలంగాణలో ఒక గ్రామంలో 1964కు ముందు జరిగిన -అంటే పోరాటానికి పూర్వం జరిగిన సంఘటనలను మృత్యుంజయులు నవల యధాతధంగా చిత్రించింది. నవలలో గ్రామం పేరును రచయిత ఎక్కడా తెల్పలేదు. ఈ గ్రామం నల్గొండ, వరంగల్ జిల్లాలోని ఏ ఊరైనా కావచ్చు.
రావు సాహెబ్ వెంకట్రామ నారాయణరెడ్డి దేశ్‌ముఖ్‌గారి జాగీరులో గ్రామం మన కథా స్థలం. ఆ గ్రామంలో రైతులంతా తాతల తండ్రుల తరాల నుంచి అడవులు కొట్టి బీళ్లు దున్ని పొలాలు సాగులోకి తెచ్చుకున్నారు. అందరూ కొద్ది రైతులే. పొలాలను రైతులు సాగుచేసుకుంటున్నారు గాని రెవిన్యూ రికార్డుల్లో అవి అన్నీ దేశ్‌ముఖ్ దొరవారి పేరనే ఉన్నాయి. పొలాలను సాగుచేసుకొననిస్తున్నందుకు రైతులు దేశముఖ్ దొరవారి గడీలో, పొలాల్లో వెట్టిచాకిరీ చెయ్యాలి. ఎవరైనా చాకిరీకి ఎదురు తిరిగినా తప్పించుకోజూచినా, స్వంత ఇబ్బందులుండి పనిలోకి రాలేమని బతిమాలుకున్నా దొరగారి బంట్లు దౌర్జన్యం చేసేవారు.
గ్రామంలోని బడుగు రైతు కుటుంబాలలో మల్లారెడ్డి కుటుంబం ఒకటి. మల్లారెడ్డి భార్య రాములమ్మ. ఆయన మొదటి భార్య కొడుకు నర్సిరెడ్డి. రాములమ్మ పిల్లలు ఎల్లారెడ్డి, రాజవ్వ. నర్సిరెడ్డి భార్య ఒక కొడుకును కని చిన్న వయసులోనే చనిపోయింది. రాజవ్వకు పెళ్లి అయింది కాని ఆమె పెనిమిటి ఆమెను కాపురానికి తీసుకువెళ్లటం లేదు.
దొర పొలంలో నాట్లు వేయటానికి కూలీలను బలవంతంగా తీసుకుపోవటానికి దొరబంటు అప్పన్న ఇంటింటికీ తిరుగుతూండటంతో రచయిత మృత్యుంజయులు నవల ప్రారంభించారు.
తన పొలంలో నాటువేసుకొని వస్తానని లేకపోతే నారు ఎండిపోతుందని రాములమ్మ అప్పన్నను బతిమాలుకుంటుంది. కాని వాడువినలేదు. వాడు మరొక ఇంటికి పోగా రాములమ్మ రాజవ్వను ఇల్లు చూసుకోమని చెప్పి తన పొలానికి పోయింది. రాములమ్మ దొర పొలంపనికి రాలేదని ఆగ్రహించి అప్పన్న రాజవ్వను పనిలోకి రమ్మంటాడు. ఆమె రజస్వల అయిన సందర్భం అది. తాను వచ్చే స్థితిలో లేనని చెప్పి బతిమాలుకొంటుంది. అప్పన్న ఆమెను ఈడ్చుకొనిపోయి దొరగడీలో పడవేశాడు. అక్కడ రౌడీలు రాజవ్వపై అఘాయిత్యం చేశారు. ఆమె జీవచ్ఛవంలా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ ఊళ్ళో ఇటువంటి అఘాయిత్యాలు సర్వసాధారణమైపోయాయి. ప్రజలెవ్వరికీ దొరనుగాని, అతని గూండాలను గాని ప్రతిఘటించే శక్తి లేదు.
రాజవ్వకు జరిగిన ఘోరమైన అవమానానికి ప్రతీకారం తీర్చుకోలేక నిస్సహాయంగా దుఃఖిస్తూ వుండగా, పులిమీద పుట్రలా అప్పన్న వచ్చి రాజవ్వ తనను కొరికినందుకు జరిమానాగా ఐదు రూపాయలు చెల్లించమన్నాడు. డబ్బు ఇవ్వకపోతే జరిమానా కింద ఇత్తడి కడవ పట్టుకుపోయాడు. ఈ గొడవ జరిగినప్పుడు నర్సింరెడ్డి ఇంట్లో లేడు. బాడుగ బండి తోలటానికిపోయాడు. రోజంతా కష్టపడితే రెండు రూపాయలే బాడుగ. వస్తూ వస్తూ అడవిలో కాసిని కట్టెపుల్లెలు బండిలో వేసుకొని తెస్తున్నందుకు ఫారెస్టు డిపార్టుమెంటువారు అడ్డగించి దౌర్జన్యం చేసి అపరాధం కింద ఒక రూపాయి వసూలు చేశారు.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కడియాల రామమోహనరాయ్