వినమరుగైన

మృత్యుంజయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సిరెడ్డి ఇంటికి చేరుకొని చెల్లికి జరిగిన అవమానానికి కుమిలిపోయాడు. ఇత్తడి కడవ కూడా ఎత్తుకుపోయారని తెలిసి ఆందోళన చెందాడు. ఎలాగైనా కడవను తిరిగి తెచ్చుకోవాలని రాత్రిపూట గడీకి వెళ్లాడు. అందరూ నిద్రలో ఉండగా కడవ చేత బుచ్చుకుని వస్తూ, దొంగతనం చేస్తున్నానన్న గాభరాలో కడవను జారవిడిచాడు. ఆ చప్పుడుకు మేల్కొన్న దొర మనుషులు నర్సిరెడ్డిని పట్టుకోజూచారు. వారి బారి నుండి తప్పించుకోవటానికి నర్సిరెడ్డి హైదరాబాద్ పారిపోయాడు.
దేశ్‌ముఖ్‌గారి తండ్రి మరణించాడు. కర్మకాండ జరపటం కోసం గ్రామాధికార్లు బూడిద పట్టీ వసూళ్లకు పూనుకున్నారు. ఎల్లారెడ్డి రుూ అన్యాయాన్ని ఎదిరించాలన్నాడు. ‘‘చచ్చేవాడికి రెండు చావుల్లేవు’’ అని అందరికి ధైర్యం చెబుతాడు. అందరూ కలిసి సంగం సాయం కోరాలనుకుంటారు.
పటేల్ పాపిరెడ్డికి ఈ సంగతి తెలిసి అప్పన్న సాయంతో హిందూ ముస్లిముల మధ్య చీలిక తేవాలని చూస్తాడు. నవాబు పాలనకు ముప్పు ముంచుకు వచ్చిందని పేద ముస్లిం మహబూబ్‌ను రెచ్చగొట్టి అతడి సాయంతో సంఘం వాళ్లు రాకముందే బూడిద పట్టీ వసూళ్లు చాలా వరకూ పూర్తిచేశాడు. పిలిచిన వెంటనే డబ్బు చెల్లించటానికి రాలేదని అప్పన్న మల్లారెడ్డిని కొట్టి చంపేశాడు.
హైదరాబాద్ చేరిన నర్సిరెడ్డికి ఊళ్లో జరిగిన సంగతులు తెలియవు. రిక్షాలాగి బతుకీడుస్తున్నాడు.
ఎల్లారెడ్డి సంగం వాళ్లను ఇంటికి తీసుకువచ్చి మర్యాదలు చేస్తాడు. కులాలలో ఎక్కువ తక్కువలు పాటించవద్దని తల్లికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. నైజాం రాజ్యపు నిరంకుశ చర్యల్ని ఖండిస్తూ బెజవాడ, బందరు, తెనాలి, యింకా చాలాచోట్ల సభలూ ఊరేగింపులు జరిగాయి.
* * *
పట్నంలో నర్సిరెడ్డి కార్మిక సంఘాల కార్యకలాపాలను గూర్చి తెలుసుకుంటాడు. ఒంటరిగా కూర్చుని కూలీలంతా ఏకమైతే కూటికి తరుగేమిరా అని కూనిరాగం తీస్తుండేవారు.
దేశ్‌ముఖ్ గ్రామానికి విచ్చేశాడు. తాగినమైకంలో ఇంట్లో పనిచేసే పిల్లను చెరిచాడు. ముస్లిం యువతి ఫాతిమా బీబీ మీద దొంగతనం నేరం మోపి దొర ఆమెను దక్కించుకోవాలనుకున్నాడు. ఈ అన్యాయాన్ని ఎల్లారెడ్డి ఎదిరించాడు. ఫాతిమా బీబీని కోర్టులో హాజరుపరుస్తామేగాని దొర ముందు విచారణకు అనుమతించేది లేదనంటాడు. దొర తొతె్తైన పోలీసు సార్జెంట్ బీబీని దాచిపెట్టినందుకు ఎల్లారెడ్డిని అరెస్టు చేస్తాడు. ప్రజలు ఆందోళనకు దిగగా వారించి ఎల్లారెడ్డి న్యాయ పోరాటానికి సిద్ధమై జైలుకు పోవటానికి ముందుకు వచ్చాడు. ‘‘ఎల్లారెడ్డిని విడిచిపెట్టాలి; దేశ్‌ముఖ్ దురంతాలు నశించాలి; ప్రజారాజ్యం కావాలి’’ అని గ్రామ ప్రజలు నినాదాలు చేశారు. కొడుకు ధైర్యానికి సంబరపడుతూనే అతనికి ఏమవుతుందోనని ఆందోళన చెందుతుంది రాములమ్మ.
నిప్పును ఊక ఎంతకాలం కప్పి పెడుతుంది, చివరకు అది కూడా కాలి బూడిద అవుతుంది. ప్రజలు తెగించారు. ‘ఆంధ్ర మహాసభ జిందాబాద్’ నినాదాలు చేశారు.
తనను తిట్టినందుకు రాములమ్మ మీద దౌర్జన్యం చెయ్యబోయాడు పటేల్. సుభాన్ కొట్టిన దెబ్బకు పటేల్ మట్టికరిచాడు. ఈ నేరాన్ని ఎల్లారెడ్డిమీద మోపటానికి దేశ్‌ముఖ్ పన్నాగం పన్నాడు.
పటేల్‌ను ఆస్పత్రికి తీసుకుపోవటానికి గ్రామ ప్రజలెవరూ ముందుకు రాలేదు. వెట్టిచాకిరీ వాళ్లు స్వస్తిచెప్పారు. కోళ్లు, మేకలు ఇతర వస్తువులు దొరకుచితంగా ఇవ్వటానికి నిరాకరించారు.
పటేల్ చచ్చిపోతే శవదహనాన్ని కూడా గ్రామప్రజలు సహాయ నిరాకరణ చేశారు. పటేల్ తమ్ముడు మురహరి అందరినీ బతిమాలుకొని శవదహనం ఎలాగో పూర్తిచేశాడు.
***
ఎల్లారెడ్డి అరెస్టు వార్త తెలిసి నర్సిరెడ్డి గ్రామానికి ప్రయాణమయ్యాడు.
దేశ్‌ముఖ్ గూండాలు ఊళ్లో స్వైరవిహారం చేసి నానా బీభత్సం సృష్టించారు. సంగం నాయకుడు సుభాష్‌ను పోలీసులు, గూండాలు చిత్రహింసల పాల్జేశారు. ప్రజలు తిరగబడ్డారు. దేశ్‌ముఖ్ పోలీసులతో కలిసి పారిపోవటానికి ప్రయత్నించాడు. ఆ బీభత్సవంలో అపుడే ఊళ్ళోకి వచ్చిన నర్సిరెడ్డి పోలీసుల తుపాకి గుండ్లకు బలిఅయ్యారు. అమ్మ రాములమ్మ వొడిలో తుదిశ్వాస విడిచాడు.
దేశ్‌ముఖ్ తన ప్రాణం కాపాడుకోవటానికి తన మకాం హైదరాబాద్‌కు మార్చాడు. ఇతర జాగీర్దార్లకు, దేశ్‌ముఖ్‌లకు ఇదే గట్టి పట్టింది.
పోరాటాన్ని అణచటానికి నైజాం సిబ్బందికి తోడు తెల్ల మిలటరీ కూడా జతకలిసింది. గ్రామప్రజలు తమ మీద జరగబోయే దాడికి సన్నద్ధమయ్యారు. ఆత్మరక్షణ ఉపాయాలు తెలుసుకున్నారు. దళాలుగా ఏర్పడ్డారు.
రాములమ్మ పోరాటంలో చేరింది. దళ సభ్యురాలైంది. పోరాటం మరింత దగ్గరపడుతోంది. నేడో రేపో సాయుధ మిలటరీ దళాల మీదికి ప్రజాశక్తి విజృంభిస్తోంది.
పోలీసుల చేతిలో మరణించాడనుకున్న ఎల్లారెడ్డి అజ్ఞాతవాసం వదిలి పోరాట నాయకుయ్యాడు. అతన్ని చూసి రాములమ్మ తనను వీరమాతగా భావించుకున్నది.
ఒక్కసారి దళాలన్నీ ఉవ్వెత్తుగా వచ్చే సముద్ర కెరటాల్లాగా ముందుకు సాగినయ్.
నడూ - నడూ- ముందునడూ- ముందుకె మున్ముందుకే
తరతరాల దాస్యబాధ తరలింపను మరలింపను
చావటమన్న భయమదేడ? బ్రతికి పడెడు సుఖమేదోయ్
సుఖము దొరకు బ్రతుకు కొరకు పదుగు రొకేపదముగా
దళాలు ముందుకు సాగినయ్.
తెలంగాణ రైతాంగ పోరాన్ని నడిపించిన అగ్రశ్రేణి నాయకులు రావి నారాయణరెడ్డి మృత్యుంజయులు నవలను పరిచయం చేస్తూ తెలంగాణలో దొరలు జరుపుతున్న దౌర్జన్యాలనెన్నింటినో రచయిత చక్కగా చిత్రించారనీ, తెలంగాణ ప్రజలు ఈ దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరుపుతూన్న వీరోచిత పోరాటాన్ని గూడ చిత్రించారు’ అని అన్నారు.
మృత్యుంజయులు నవల జరిగిపోయిన చరిత్రకు సాహిత్యరూపం కాదు. జరుగుతున్న చరిత్రకు సాహిత్యరూపం. ఈ నవలలోని సందేశం భావితరాలకే కాదు, వర్తమాన యుద్ధ రంగంలో నిలిచిన యువయోధులకు గూడ. కనుక ఇది నడుస్తున్న చరిత్రగా అభివర్ణించారు శ్రీ వరవరరావు.
ఉన్నవ లక్ష్మీ నారాయణగారి మాలపల్లిలాగ వర్తమాన చరిత్రను నవలగా రూపొందించిన మృత్యుంజయులు తెలంగాణ పోరాటంపై వచ్చిన నవలలన్నిటికీ చక్కని ఒరవడి పెట్టింది.
ఇరవయ్యవ శతాబ్ది తెలుగు నవలల్లో బొల్లిముంత శివరామకృష్ణగారి మృత్యుంజయులు ఉత్తమశ్రేణి నవలగా పరిణించదగినది.
-సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కడియాల రామమోహనరాయ్