వినమరుగైన

అతడు -ఆమె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతం పెంపుడు కూతురు సుభ జనార్దనాన్ని ప్రేమిస్తుంది. ఐతే ఆమె తనకు తటస్థపడిన మిగిలిన పురుష స్నేహితులను గురించి కూడా ఆలోచిస్తుంది. మామూలుగా రచయితలు స్ర్తిల ప్రేమను ఈ రకంగా ఎప్పుడూ చిత్రించరు. కథానాయిక నాయకుడెదురయ్యేవరకూ మగపురుగుని కూడా కనెత్తి చూడదు. కథానాయకుడెదురయ్యాక ఒక్క క్షణం కూడా ఆలోచించదు. తాను అతనిదానే్ననని తేల్చేసుకుంటుంది. చాలా పేరున్న రచయితలు, సమస్యల్ని వాస్తవికంగా చిత్రించే రచయితలు కూడా స్ర్తి పాత్రల విషయంలో ఈ పొరపాటు చేస్తుంటారు. స్ర్తి ఒక్కరినే ప్రేమించాలి. ఇంకొకరిని గురించిన ఆలోచన కూడా ఆమెకు రాకూడదు. అసలు రాదు కూడా అనే ఆలోచన సమాజంలో స్థిరపడిపోవటమే అందుకు కారణం. లక్ష్మణరావుగారు సామాజిక శాస్తమ్రూ, మనస్తత్వ శాస్తమ్రూ తెలిసిన వారవటంవల్ల అలాంటి పొరపాటు చేయకుండా స్ర్తి పాత్రలను రక్తమాంసాలున్న పాత్రలుగా తీర్చిదిద్దారు. సుభ మదనం గురించీ, జనార్దనం గురించీ, సీతారాం గురించీ కూడా ఆలోచిస్తుంది. ఇతనితో వివాహమైతే నా జీవితం ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇద్దరూ కలిసి ఒక పని చేయటం మంచిమార్గమని సుభ, జనార్దనం అనుకుంటారు. శాంతం కూడా అదే సలహా ఇస్తుంది. క్విట్టిండియా ఉద్యమంలో సుభ జైలుకెళ్లి వచ్చిన తర్వాత సుభ, జనార్దనాలిద్దరూ కూచిపూడి వెళ్లి వేదాంతం దగ్గర నృత్యం నేర్చుకోమనీ, ఇద్దరూ జంటగా నేర్చుకుని నర్తిస్తుంటే జైలు జీవితంలో తానూ, సుభ ఎంతగానో మారిపోయే అవకాశం ఉందని తెలిసీ జనార్దనం ‘‘మార్పు ప్రాణశక్తి విలాసం. చైతన్యశక్తి కీల- దాన్ని అడ్డడం ఎవ్వరితరమూ కాదు.. నేను ముందుకే అడుగువేస్తా’’. సుభని పెళ్లాడతానని భవిష్యత్తుపై ఆశ నుంచుతాడు. ఇంత బాధ్యతగా ప్రేమ గురించి చెప్పిన రచయితలు తెలుగు సాహిత్యంలో ఒకరిద్దరికంటే లేరు.
ప్రేమికులుగా ఉన్న సుభ-జనార్దనాల విషయం ఇలా ఉంటే ప్రేమించుకుని పెళ్లాడిన శాంతం శాస్ర్తిల సమస్యలు ఇంకోరకంగా ఉన్నాయి. వైవాహిక జీవిత గమనంలో వారు క్రమంగా ఒకరికొకరు మానసికంగా దూరమైపోయారు. ప్రేమ యింకా వుందా వుంటే ఎన్ని పాళ్లున్నది అని ఆలోచించే స్థితికి శాంతం, ఆ ప్రేమా గీమా అన్నీ కుర్రతనపు చేష్టలు.
ఇపుడు సంసారం బరువు బాధ్యత అంటూ పెద్దమనిషైపోయాడు శాస్ర్తీ. భార్యాభర్తల్లో ప్రేమ క్రమంగా తగ్గిపోవటం అనే విషయాన్ని ఇంత చక్కగా డీల్ చేసిన నవల ఇంకొకటి లేదనే చెప్పాలి.
అతడు-ఆమె నవలలో అపురూపమైన పాత్ర శాంతం, తానెంతో ప్రేమించిన శాస్ర్తీ స్వార్థపరుడిగా, పదవీ కాంక్షాపరుడిగా మారిపోతుంటే బాధపడి అతని నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అతనిలో మార్పు వచ్చాకే మళ్లీ అతనితో సహజీవనం సాగిస్తుంది.
జాతీయోద్యమంలో స్వప్రయోజనాల కోసం చేరిన వారిని అసహ్యించుకుంటుంది. మహిళా కార్మికుల దయనీయ స్థితికి చలించిపోతుంది. అనాథలా తన ఇంటికి వచ్చిన సుభను కన్నకూతురిలా పెంచుతుంది. పిల్లలను వ్యక్తిత్వం, బలం వున్నవారిగా పెంచింది. పిల్లల అభిప్రాయాలను శాస్ర్తీ కంట్రోలు చేయబోతే ‘‘శాస్ర్తి నీ దబాయింపులు నేను సహించను. ఈ ఇంట్లో మాత్రం ఎవరి అభిప్రాయాలు వాళ్లదే. ఎవరి స్వేచ్ఛ వాళ్లదే. దానికిష్టం వుంటే కమ్యూనిస్టుల్లో చేరుతుంది. హిందూ మహాసభలో చేరుతుంది. దాని స్వతంత్రం దానిది’’ అని గట్టిగా మాట్లాడుతుంది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-ఓల్గా