వినమరుగైన

కీలుబొమ్మలు -జి.వి.కృష్ణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం పేదలమీది కనికరంతో మిల్లులో పనిచేసేవారందరికీ వీలైనన్ని సౌకర్యాలు కల్పిస్తాడు. చంద్రశేఖరానికి గొప్ప ఆదర్శాలైతే వున్నాయిగానీ, వ్యాపార విషయాల్లో అతడికి అనుభవంగానీ, జ్ఞానం గానీ శూన్యం. ఫలితంగా మిల్లు నష్టాల్లో కూరుకుపోతుంది. మరోప్రక్క పనివాళ్లు జీతాలూ, సౌకర్యాలూ పెంచాలని ఒత్తిడి చేస్తుంటారు. చంద్రశేఖరం వాళ్లందరినీ మంతనాలకి పిలిచి, మిల్లు ఆర్థిక వ్యవహారాలని విశదీకరించి, సహకార పద్ధతిలో మిల్లును నడుపుదామని సూచిస్తాడు. పనివాళ్లు వాళ్లకి మిల్లు లాభనష్టాలతో పనిలేదనీ, జీతాలు మాత్రం ఎక్కువ చేయాలనీ, మరిన్ని సౌకర్యాలు కలిగించాలనీ పట్టుబడతారు. లేకుంటే సమ్మె తప్పదని హెచ్చరిస్తారు. మిల్లును మూసివేస్తే పనివాళ్లు చెప్పరాని కష్టాలకు లోనవుతారనే ఉద్దేశ్యంతో, దొరికిచోటల్లా అప్పుజేసి, చివరకి మామగారి ఆస్తిని కూడా అమ్మి మిల్లు నడుపుతుంటాడు. కాని అలా ఎంతోకాలం సాగదు. మిల్లును మూసెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నదంతా పోగొట్టుకోవడమేగాక తన మామ కుటుంబాన్ని కూడా పేదరికంలోకి దిగలాగుతాడు చంద్రశేఖరం. రెండు యిళ్ళల్లోనూ పూటగడవని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ పరిస్థితుల్లో మార్వాడీ దగ్గర తన పూచీ పడిన సొమ్ము చంద్రశేఖరం చెల్లించలేడనే విషయం పుల్లయ్యకి అర్థమవుతుంది. అతనికా సొమ్ము ఒక లెక్కలోనిది కాదు. అతనికి చంద్రశేఖరం పట్ల సానుభూతి కూడా వుంది. కానీ తన డబ్బు పోగొట్టుకున్నాడంటే ఊళ్లోని ప్రజలు తనని చులకనగా చూస్తారేమోననే బాధ ఒక వంకా, భార్యంటే అతనిగల భయం ఒక వంకా అతణ్ణి క్రుంగదీస్తాయి. చివరికి భార్యా, కూతురు రుూ పూచీ విషయమై అతణ్ణి నిగ్గదీసేటప్పటికి, తను పూచీ పడలేదనే అర్థం వచ్చే మాటలు అస్పష్టంగా గొణుగుతాడు. ఈ సంఘటన అతడి నైతిక పతనానికి నాంది అవుతుంది. మోసపు మాటలూ, అసత్యాలూ అర్థసత్యాలూ వరసగా చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. పుల్లయ్య ప్రత్యర్థి ఐన మల్లయ్య అనే మరో మోతుబరి రైతు ఈ వ్యవహారం ఆధారంగా ఊళ్ళో రాజకీయ, ఆర్థిక లబ్ధిపొందాలని చూస్తుంటాడు. ఇటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజకీయ శత్రువుపై దెబ్బతీయాలని పుల్లయ్య కుట్రలకు పాల్పడవలసి వస్తుంది. ఇది పరిస్థితుల విషవలయం. తప్పించుకోవాలన్నా తప్పించుకోలేని దుస్థితి. ఈ వ్యవహారానికంతటికీ ముగింపుగా, పుల్లయ్య సంతకం ఫోర్జరీ చేశాడన్న అభియోగంతో కోర్టు పాలైన చంద్రశేఖరానికి జైలు శిక్ష పడుతుంది. తక్షణమే గ్రామంలోని రాజకీయ సమీకరణాలు మారిపోయి, పుల్లయ్య ఒక మెట్టు ఎదగి సర్దార్ పుల్లయ్యగా మారతాడు. మంత్రిగారు గ్రామానికి విచ్చేసి స్వయంగా రుూ బిరుదుని ఆయనకి ప్రదానం చేస్తాడు. ఒక హృదయ విదారకమైన దృశ్యంలో మంత్రిగారితో కారులో వెళ్తున్న పుల్లయ్య దుర్భర దైన్యావస్థలో వున్న చంద్రశేఖరం భార్యా పిల్లల్ని చూడలేక తల పక్కకు తిప్పుకుంటాడు. ఈ కథతో సంబంధమున్న ఇతర పాత్రలలో ముఖ్యమైనవి అమ్మాయమ్మగారు. ఈమె సంఘ సేవిక. ఆవిడ శరీరంలాగే ఆమెలో స్వార్థమూ బలిసింది. తేనెమాటలాడుతూ తన స్వార్థం కోసం ఏమైనా చెయ్యగలదు. పుల్లయ్య ప్రత్యర్థి అయిన మల్లయ్య తన మేలు కోసం, తన శత్రువుకి హాని చెయ్యడంకోసం ఏపని చెయ్యడానికైనా వెనుకాడని వ్యక్తి. సత్యనారాయణ పంతులు నమ్మకస్థుడైన గుమాస్తా. స్వామిభక్తి పరాయణుడు ఉన్న ఉద్యోగం ఊడితే తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థంకాని అమాయకుడు. అందుచేత, ఏ పనిచేస్తే తన జీవికకి భంగం కలుగుతుందోనన్న నిరంతర భయంతో బతికే జీవి. అతని భార్య పద్మ. భౌతికంగా అన్నివిధాలా అసంతృప్తితో కాలం గడిపే జీవి. సంప్రదాయ బంధాలు ఛేదిచి బయటపడాలన్న కోరిక వున్నా సాహసం చాలని భీరువు. పుల్లయ్య కొడుకు రామారావు. సమాజంలో మార్పు తేవాలని, సమ సమాజాన్ని నిర్మించాలని తాపత్రయపడే యువకుడు. చివరగా డాక్టరు వాసుదేవశాస్ర్తీ, గాంధేయవాదే కాకుండా వైద్యంలో దిట్ట. నిస్పృహతో, పరాజయంతో -అతడు వుండటం అత్యవసరమైన తరుణంలోనే- పల్లె వదలి నగరానికి శాశ్వతంగా మకాం మార్చిన వ్యక్తి.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-డి.కేశవరావు