వినమరుగైన

అపస్వరాలు - -శారద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండేడవకండీ అంటూ పీడితులను, తాడితులను, వంచితులను ఓదార్చే ప్రయత్నంలో మహాకవి స్వప్నించిన జగన్నాథ రథ చక్రాలు కదలనేలేదు. ఐదు దవాబ్దలు గడచి కొత్త శతాబ్దిలోకి అడుగిడినా ఇప్పటికీ కదలనేలేదు. పెదవులపై నిరంతరం శ్రీశ్రీ గేయాలను పలవరిస్తుండే శారద ఎలాంటి రచనలు చేస్తాడని ఊహిస్తామో అలాంటివాటినే అక్షరబద్ధం చేశాడు కీ.శే.శారద.
సఖుల వలన పరిచ్యుతులు.. జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కతుల వర్గాన్ని ప్రధానంగా చిత్రించారు రచనా శిల్పి శారద. ఎటుచూసినా పటు నిరాశ అలుముకున్న గౌరవప్రదమైన జీవితం అనే ముసుగులు ఏ చెడు పనీ చేయని చేయలేని కడుపు నిండని మధ్యతరగతి జీవితాల రంపపు కోతకు గురవుతున్నప్పటికీ చిన్నచూపు చూడబడుతున్నప్పటికీ మందహాసాలు చిందిస్తూనే వున్నది. నాల్గవ ఐదవ దశకాలలోని ఈ రెండు వర్గాల చరిత్రకీ, పరిస్థితులకీ నవలారూపం కీ.శే. శారద రచన అపస్వరాలు. చెప్పుకున్న రెండు వర్గాల సామాజిక సంగీతంలో ధ్వనించేది స్వరాలు కాదు. ప్రతిధ్వనించేది అపస్వరాలే. ఆ పేరే శిల్పానికి పరాకాష్ట.
వరదరాజులు పొడగరి. పంచె సైకిల్ కట్టు కట్టి తెగ తాగి తూలుతూ తలుపు నొక్క తన్ను తన్ని వసంతాన్ని లేపుతాడు. మళ్లీ తాగొచ్చినావంటా సచ్చినోడా అన్న పలకరింపుతో వసంతం లేస్తుంది. అన్నం పెడుతూ తన మారుటి చెల్లెలు రత్తాలు వస్తున్నదని ప్రకటిస్తుంది. అన్నం తిని వరదరాజులు బ్రాకెట్ ఆడడానికి వెళ్తాడు. బెజవాడ స్టేషన్ బయట గుర్రబ్బండ్ల షెడ్లూ, బలంలేని గుర్రాల సకలింపులూ, తమ కడుపు కొట్టిన సైకిల్ రిక్షావాళ్లతో కొట్లాడుతున్న గుర్రబ్బండ్లవాళ్లూ, బీడికొట్లు, అన్నింటినీ దాటుకుంటూ కొంచెం పెద్దగా వున్న బీడీకొట్టు దగ్గర చేరి నిరీక్షిస్తుంటాడు వరదరాజులు. నిరీక్షణ రంగయ్యగారి కోసం. ఆయన జిల్లా బోర్డు స్కూల్లో తెలుగు మాస్టారు. స్వయంగా కవీ పండితుడూ, బ్రాకెట్ వ్యసనం వుంది. వరదరాజులు ఆయన చెప్పిన అంకెలపైనే పందాలు కాస్తూ వుంటాడు.
ఆయనకిద్దరు పిల్లలు. జయ, సదానందం. జయకు పెళ్లయింది. భర్త త్రయంబకరావు. పూర్తిగా తల్లిదండ్రుల చాటు మనిషి. తినడం కూర్చోవటం తప్ప వేరే వ్యాపకం ఏమీ లేదు. అతడి తండ్రి శేషాద్రిరావు ప్లీడరు. తెగ సంపాదించాడు. అయినా కట్నంలో వెయ్యి రూపాయలు తక్కువైందని కోడల్ని కాపురానికి రానివ్వడు. సదానందం కాలేజీ విద్యార్థి. చిత్రకారుడు. అతడిది ఊహాలోకం. భావుకలోకం. ఆదర్శవాది. జీవం వుట్టిపడే చిత్రాలు గీయగలడు. బ్రహ్మానందం అతని స్నేహితుడు. అతడిదీ మధ్యతరగతి కుటుంబమే. గొర్రె తోక బెత్తెడే అన్న చందంగా పెరగని జీతాలు, పెరిగిపోయే ఖర్చులు. శేషాద్రి కూతురుకి తిండిపోతులైన తండ్రికీ, కొడుక్కీ వండి వార్చటమే పని. శేషాద్రిరావు భార్యకు భర్తకు వంతపాడడమే పని.
వసంతం పినతల్లినీ, చెల్లెలు రత్తమ్మనీ చేరదీస్తుంది. రత్తమ్మ పరమ అమాయకురాలు. వసంతం వొళ్లు అమ్ముకుని బ్రతుకుతుందన్నమాట తల్లినోట వినివున్నది. ఆ జీవితాన్ని అసహ్యించుకుంటుంది. గత్యంతం లేదు. మొదట్లో వరదరాజులు వసంతం మీద కనే్నసినా రంగం నుంచి తప్పకుంటాడు.
మూడు భాషలలో పండితుడైన రంగయ్య గారు కట్నం బాకీలో అయిదు వందలు తీర్చినా కోడల్ని కాపురానికి తీసుకెళ్లదు. అది ఆయన వేదన. బాకీ తీరే విధానం కనపడదు. కరుణమూర్తి అనే ప్రచురణకర్త రంగయ్యగారి చేత పిల్లలకు పుస్తకాలు రాయించి డిస్ట్రిక్ట్ బోర్డు స్కూళ్లలో పెట్టించి డబ్బు సంపాదిస్తుంటాడు. డబ్బు దాహం తప్ప మరేమీ లేని ప్రచురణకర్త. మృత్యుంజయశాస్ర్తీ అనే నాటకాల పెద్దమనిషితో కలిసి, మరొకరిచేత తప్పుల తడక పుస్తకాన్ని రాయించి స్కూళ్లలో పెట్టిస్తాడు.
-సశేషం

-పరుచూరి రాజారామ్