వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోధుమరంగు పంచెపై - మావిచిగురు అంచు...
దానిపై గౌతమీ నదిలా.. తళతళలాడే తెల్లటి చొక్కా...
ఆ రెండింటికి మరింత అలంకారంగా నల్లగా ఆ మనీషి..
మావిచిగురు - నలుపు- అనే పదాలు వినిపించేసరికి మనకేదో గుర్తుకు రాకమానదు.
అది తప్పనిసరిగా కోకిలే కావాలి.
అందులోను అది మామూలు కోకిలైతే వసంతం వాడిపోగానే మరచిపోతాం. కాని అది గౌతమీ కోకిల.
గౌతమి ప్రవహిస్తున్నంత సేపు దాని మధురిమలు మనలను పరవశింపజేస్తూనే వుంటాయి. అవి సాహితీ మధురిమలు కావటం మన అదృష్టం.
ఆ గౌతమీ కోకిలను దర్శిద్దాం-
ఆయనే వేదుల సత్యనారాయణ శాస్ర్తీగారు.
గౌతమీ కోకిల పాట నీ యెడదకుం బులకింపుల కాన్కలీయదే.. అంటూ కృతి భర్తనే కాకుండా ప్రతి హృదయ రసాలాన్నీ ప్రతిభావంతంగా మీటిన గౌతమీ కోకిల ఆయన. భద్రాచలం తాలూకా గొల్లగూడెంలో 1900 సంవత్సరం మార్చి 20వ తేదీన జన్మించారు. నూనూగు మీసాల నూత్నవన దశలో- గొట్టపుళ్ల శ్రీనివాసాచార్యులు, మృత్యుంజయ శాస్ర్తీ గారల వద్ద కావ్య నాటకాలు చదువుకున్నారు. చల్లా వెంకట నరసయ్య గారి దగ్గర స్మార్తం, చిలుకూరి సోమనాథ శాస్ర్తీగారి శుశ్రూషలో వ్యాకరణం అభ్యసించారు. అవధాన విద్యలో కవి సార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తీగారికి చేరువై అవధానాలు వెలయించారు. ఆ తరువాత దేవులపల్లి వారి సాహచర్యం, కాటూరి వారి మైత్రి ఆయనను ప్రగాఢంగా హత్తుకొన్నాయి. వేదులను కవితా శాఖలపై నిలబెట్టటానికి అవి ఎంతగానో దోహదపడ్డాయి.
అయితే వీటన్నిటి వెనుక అలసిసొలసిన దృశ్యాలనేకం ఆయన జీవితంలో పెనవేసుకున్నాయి. అందుకే సంప్రదాయ సాహితీ ప్రక్రియలోంచి అధునాతన సమాజం వైపు చూడగలిగారు. రాజమండ్రిలో చదువుకొంటున్నప్పుడు కొన్ని రోజులు వారాలుగా దొర్లిపోయాయి. మరికొన్ని రోజులు ఉపవాసాలుగా మిగిలిపోయాయి. కష్టాల చిరుగులెన్నో కప్పుకున్నారు. కారుచీకట్ల పొలిమేరలలో కదనకుతూహలంగా పాడుకొన్నారు.
ఇరవయ్యో శతాబ్దం ఎగురవేసినా ప్రతిభా పతాకాలలో వేదుల కవితా కేతనం కూడా ఒకటి. శైలి, అభివ్యక్తి, భావుకతలలో వేదులవారి ముద్రకు హారతులు పట్టింది ఆనాటి రసజ్ఞలోకం. శ్రీనాథుని సీసం ఎంత హృద్యంగా నడిచిందో- వేదులవారి వృత్తం అంతగా శారదా నైవేద్యమయింది అని ప్రస్తుతించారు మధునాపంతులవారు.
వేదులను పఠించిన కవితా ప్రక్రియలనేకం..
పద్యానికి పట్టం కడుతూనే, పాటను పల్లకీ ఎక్కించారాయన. కథను కదిలిస్తూనే, నవలను, నవనవోనే్మషంగా నడిపించారాయన. తానే ఒక వ్యాసమై, నాటకమై, నలుగురి మెప్పు పొందారు. చివరికి సినీ కథా రచయితగా కూడా ఆయన జాబితాలోకి ఎక్కారు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు