వినమరుగైన

కొల్లాయి గట్టితేనేమి? మహీధర రామమోహనరావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహీధర రామమోహనరావు గారి కొల్లాయి గట్టితేనేమి? నవల చదవటం ఒక గొప్ప అనుభవం!నిర్దిష్ట స్థల, కాలాలను, వాస్తవికతా దృక్పథంతో, ప్రగతిశీల భావజాలంతో చిత్రించే ఏ మంచి రచన అయినా పాఠకుడికి ఒక గొప్ప అనుభవాన్ని ప్రసాదిస్తుంది. కొల్లాయి గట్టితేనేమి? నవల పాఠకుడి చారిత్రక, సామాజిక, సాంస్కృతిక అనుభవాలను విస్తృతం చేస్తుంది కూడా! ఉన్నవ లక్ష్మీ నరాయణ పంతులుగారి మాలపల్లి నవల చదివినప్పుడూ, ఉప్పల లక్ష్మణరావు గారి నవల అతడు-ఆమె చదివినప్పుడూ, కొడవగంటి కుటుంబరావు చదువు చదివినప్పుడూ, పాఠకుడు ఎలాంటి అనుభవాన్నీ, అనుభూతినీ పొందగలుగుతాడో అంతకుమించిన అనుభవాన్ని కొల్లాయిగట్టితేనేమి? చదివినప్పుడు పొందగలుగుతాడు. వ్యక్తికీ, సమాజానికీ, సంస్కృతికీ, ఆధునికతకూ, చరిత్రకూ గల గాఢమైన అనుసంధాన్ని చెప్పిన నవలగా కొల్లాయిగట్టితేనేమి? మరొక మెట్టు ఉన్నత స్థానంలో ఉంది.
ఫ్యూడల్ సమాజపు సాంస్కృతిక, రాజకీయ భావజాలాలకూ, ఆధునిక రాజకీయ సాంస్కృతిక రాజకీయ భావజాలాలకూ మధ్య రగిలిన ఒక అనివార్యమైన సంఘర్షణను అక్షరీకరించిన నవల ఇది! సమీప గతంలోని ఒకనాటి చారిత్రక వాస్తవాన్ని, నాటి ఛాందస సంస్కారాన్నీ, నూతనంగా తలెత్తుతున్నభౌతికవాద దృక్పథాన్నీ, ఆధునిక దృష్టితో విశే్లషించిన నవల ఇది! ఒక యుగసంధిలో జీవించేవాళ్లూ, పురోగమన భావజాలంతో ముందుకు అడుగువేసేవాళ్లూ, ఎలాంటి సంయోగాన్నీ, అంతర్మథనాన్ని అనుభవిస్తారో, గాఢంగా ప్రతిబింబించిన నవల ఇది! జాయోద్యమాన్ని కేవల దేశభక్తి తత్త్వంతోగాక, గత కీర్తి పొగడ్తల పరాయణత్వంతో గాక, సంకుచిత హైందవీయ పునరుద్ధరణ భావజాల దృష్టితోగాక ఆధునిక భౌతికవాద సంస్కార దృక్పథం నుండీ కళాత్మకంగా దృశ్యీకరించిన నవల కొల్లాయి గట్టితేనేమి?
ఈనవలలోని కథాకాలం 1920-22. రచయిత ఈ నవలను రాసిన కాలం 1964. అంటే 40 సంవత్సరాల వెనుకటి కాలం నాటి సామాజిక జీవితం ఇందులోని కథావస్తువున్నమాట! రచయిత రామమోహనరావుగారు పుట్టింది 1909లో. అంటే ఈ నవలలోని కథ నడిచేకాలం నాటికి ఆయన వయసు 13, 14 సంవత్సరాలు;అంటే తన సమకాలం-అప్పటికే తన దృష్టికి ఆనుతున్నకాలం! అందువల్ల ఇది రచయిత సమకాలిక నవల అవుతుంది!
కొల్లాయి గట్టితేనేమితోనే ఈ నవలా రచన ఆగిపోలేదు. దీనికి కొనసాగింపుగా, దేశం కోసం, జ్వాలా తోరణం అన్న నవలలు కూడా మహీధర రాశారు. దేశం కోసం నవల 1935-39 కాలాన్నీ జ్వాలాతోరణం నవల 1939-45ల కాలాన్నీచిత్రించిన నవలలు, కొల్లాయి గట్టితేనేమి నవలలోని ప్రధాన పాత్రలు. జ్వాలాతోరణం నవలవరకూ విస్తరించాయ. అంటే ఈ మూడు నవలలూ 1920 నుండీ 1945 వరకూ గల తెలుగు దేశపు రాజకీయ, సామాజిక, ఆర్థిక జీవితాల్ని చిత్రించటం ఉద్దేశంగా రాసినవి. కాబట్టే ఈ నవలలన్నీ రచయిత, సమకాలిక జీవితాన్ని ప్రదర్శించిన నవలలుగా మనం అర్థం చేసుకోవాలి.
*
- సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

గమనేని నారాయణ