వినమరుగైన

జానకి విముక్తి - ముప్పాళ్ళరంగనాయకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ పుస్తకాల జ్ఞాన ప్రభావంతో, జానకి తన జీవితంలోని దౌర్భాగాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతుంది. తనకు మేలు చేసే ఆ చైతన్యాన్ని అందిపుచ్చుకుంటుంది.
ఎవరి జీవితం వాళ్లకి అమూల్యమయినదనీ, ఆ అమూల్యమైన జీవితాన్ని నీచుల చేతికి అప్పగించకూడదనీ, వ్యక్తి తన భావాల్ని ఎంత ఉన్నతం చేసుకుంటే జీవితాన్ని అంత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చనీ, అంతటి ఉన్నతమైన వ్యక్తినే జీవితంలోకి ఆహ్వానించాలనీ, కనుక ముందుగా తననితాను అభివృద్ధిపరచుకోకపోతే ఉన్నతంగా బ్రతకలేరనీ జానకి గ్రహిస్తుంది.
జానకిలో అంతటి అభివృద్ధి కలిగించిన అంశాల్ని చాలా సహజమైన సంఘటనల ద్వారా రచయిత్రి చిత్రీకరించారు.
స్వతస్సిద్ధంగానే జ్ఞానం వైపు, మంచి వైపు మొగ్గే స్వభావమున్న జానకిని ఈ చైతన్యం, అభివృద్ధి నిరోధకుడూ, నీచుడూ అయిన భర్త అని పిలువబడే వెంకట్రావు నుండి విడిపోయేలా చేస్తుంది.
రెండు మాసాల గర్భవతిగా, అర్థరాత్రి కట్టుబట్టలతో శారీరకమైన అవస్థతో భర్తనుండి శాశ్వతంగా తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వచ్చేస్తుంది జానకి.
పుట్టింటిదగ్గర అన్నయ్య ప్రేమానురాగాలూ, చైతన్యపూరితమైన చర్యలు, శాంత ఆదర్శమైన ప్రవర్తనలు, మిగిలిన కమ్యూనిస్టు మిత్రుల భావాలూ, స్నేహాలూ, జానకి నూతన జీవితాన్ని ప్రారంభించటానికీ, గత జీవితపు ఆలోచనలనుండి పూర్తిగా బయటపడటానికి ఎంతో తోడ్పడతాయి. ఆ ఆసరాలతో జానకి తనను తాను పూర్తిగా అభివృద్ధి చేసుకుంటుంది అన్ని రకాలుగా. తనను తాను పోషించుకోగల్గిన చిన్న ఉపాధిని ఏర్పాటు చేసుకుంటుంది.
పెళ్లికి పూర్వం ఆగిపోయిన చదువుని కొనసాగిస్తుంది. పుస్తక పఠనం ఒక నిత్యకృత్యం అవుతుంది ఇంటిలో. ఇటలీ దేశపు ఖగోళ శాస్తవ్రేత్త బ్రూనో జీవితానికి చెందిన పుస్తకం ఆమెకెంతో నచ్చింది. బ్రూనో కనిపెట్టిన సైన్సు విషయాలు మతాధికారులకు కోపం తెప్పిస్తాయి. తను కనిపెట్టిన అంశాలు తప్పని ఒప్పుకుంటే సరేసరి, లేకుంటే మరణశిక్ష విధిస్తామని హెచ్చరిస్తారు వాళ్లు ఆయన్ని. చావుకయినా బ్రూనో సిద్ధపడతాడు గాని అసత్యాలని సత్యాలుగా తను అంగీకరించనంటాడు. అందుకాయన్ని మత ఛాందసవాదులు దారుణంగా తగలబెట్టి చంపేస్తారు. ఆయన జీవితం జానకికి ఎంతో ఆదర్శమనిపిస్తుంది. అందుకే జానకి తన కొడుక్కి బ్రూనో అని పేరు పెట్టుకుంటుంది.
ఆమె భావాలను గౌరవించే ప్రభాకర్ ఆమె జీవిత భాగస్వామి అవుతాడు. రాజకీయాలంటే ఏమిటో అర్థం చేసుకుంటుంది. రాజకీయ పరిజ్ఞానం ప్రతి వ్యక్తికీ చాలా అవసరమని ఆమె గ్రహిస్తుంది. వ్యక్తిగత అభివృద్ధితో ఒకరో ఇద్దరో అభివృద్ధి కావాల్సిందే గానీ, మొత్తం స్ర్తిల సమస్యలకు పరిష్కారం వ్యవస్థను మార్చటంలో వుందని జానకి గ్రహిస్తుంది. ఆ మార్పు దిశగా తన బాధ్యతను నెరవేరుస్తూ అడుగులు వేస్తుంది. అంతటితో నవల పూర్తవుతుంది.
నవలంతా సాదాసీదాగా, హుందాగా, నూరు శాతం వాస్తవ సంఘటనలతో, నిజ జీవితంలో తారసపడే పాత్రలతో పూర్తిగా నేలమీద నడుస్తుంది.
-సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-జి.మోహన్‌రావు