వినమరుగైన

మరీచిక -వాసిరెడ్డి సీతాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాగే ఏ ఉద్యమం పట్లగానీ, పోరాటంవైపుగానీ తొందరగా ఆకర్షితులయ్యేది యువతరమే. సంఘంలో మార్పు కోరుకుంటూ కొత్త బాటలు వేసుకొంటూ ముందుకుపోయేది వారే.
ఈ మరీచిక నవల యువతరానికి చెందిన నవల. దీనిలో ముఖ్యమైన పాత్రలు శబరి, జ్యోతి (లేదా ప్రతిభ) వీరిద్దరు కాలేజీ విద్యార్థులు. తాను నివశిస్తున్న సంఘంలో ఇమడలేక నవ సమాజ స్థాపన కోసం జ్యోతి కలలు కంటుంది.
జీవితంలోని మొనాటనీని అంతమొందించేలేక, నిత్య నూతన జీవితాన్ని, ప్రేమమయమైన జీవితాన్ని, ఆనందమయమైన జీవితాన్ని అనే్వషిస్తూ ఇంట్లోంచి వెళ్లిపోయి తిరుగుబాటులోని థ్రిల్‌ను అనుభవించాలనుకొంటుంది శబరి.
ఆ ప్రయత్నంలో తనను ఆకర్షించిన హిప్పీ ఉద్యమంలోకి దూసుకువెడుతుంది. కానీ ఎంత తొందరగా వెళుతుందో అంతే వేగంగా అక్కడివారిని, ఆ వాతావరణాన్ని అసహ్యించుకొంటుంది. వాళ్ల మురికిబట్టలు, వారి విశృంఖల విహారం ఆమెకు వెగటు కలిగిస్తాయి. శబ్దాలను చూసి రంగుల్ని వినాలనుకొని తాను పుట్టి పెరిగిన ఇంటిని వదలి వెళ్లి అక్కడ మరో యాంత్రికమైన మత్తుమందుల ప్రపంచంలోకి వెళ్లి అక్కడ ఇమడలేక, ఆ ఊబిలోనుంచి బయటపడలేక తన జీవితాన్ని నాశనం చేసికొంటుంది.
శబరి తండ్రి ధనవంతుడు. మేడ, కారు, డ్రైవరు మొదలగు ధనవంతులకుండవలసిన లక్షణాలున్నవాడు. బీదవాళ్లకు వడ్డీలకు డబ్బులిస్తూ, ఆ డబ్బులతో బొజ్జ పెంచినవాడు. తల్లి రుక్మిణి గొప్పవాళ్ల అలవాట్లకు బానిస. పార్టీలు చీరలు, నగలు ఇవే జీవితమనుకొనే స్ర్తి. కూతురి కోరికలను, మనసును చూడలేని అహంభావి.
భార్యాభర్తలిద్దరికీ పడదు. కానీ పైకి భర్త భార్య అన్నమాటలకు తాన అంటే తందాన అంటాడు. భార్య లేని టైములో వంటమనిషితో సరసలాడతాడు. భార్య కూడా భర్త వున్నపుడు పోట్లాడుతూ, లేనపుడు ‘‘మా యింట్లో అంతా మావారి పెత్తనమే’’ అని గొప్పలు చెప్పుకొంటుంది.
శబరి ఈ కృత్రిమతను సహించలేదు. ఒక తీరని అసంతృప్తి కెరటం ఆమె. అసహనం అగ్నిజ్వాల ఆమె జీవితం. జీవితంలో ప్రతి విషయం బోరు కొడుతుంది ఆమెకు. అంతులేని హిపోక్రసీ అంటే జుగుప్స. వీటన్నింటినీ భరించలేక కొత్త జీవితంవైపు ఎగిరిపోతుందామె.
ఈ నవలలో మరో ముఖ్యమైన పాత్ర జ్యోతి లేదా ప్రతిభ. చెప్పాలంటే ఈ నవలా నాయిక ఈమె. కాలేజీ విద్యార్థిని ఐన జ్యోతికి అన్నీ అభ్యుదయ భావాలే. ఈ సమాజంలోని ధనికులు, బీదలు ఈ అన్యాయాలు, ఈ దారిద్య్రం ఆమెను అశాంతి పాల్జేస్తాయి. ధనిక, బీద తారతమ్యం లేకుండా అందరూ స్వేచ్ఛగా హాయిగా వుండాలనుకునే సమాజం కావాలనుకొంటుంది. ఆ నవ సమాజ స్థాపనకు విప్లవ మార్గమే శరణ్యమనుకొని ఆ ఉద్యమంవైపు అడుగులు వేస్తుంది.
ఉద్యమంలోకి వెళ్లాక వర్గ శత్రువును అంతమొందించాలని పోరాడుతుంది. ఈ పోరాటం మూడుసార్లు జరుగుతుంది. రెండుసార్లు కలలోనే పోరాటాలు. మూడోసారి మాత్రం వాస్తవ పోరాటం. కానీ అది విఫలవౌతుంది.
నవల అంతంలో జ్యోతి గ్రామ పొలిమేరలలో కాలుపెడుతుంది. కామ్రేడ్ సత్యం ప్రబోధం మేరకు గ్రామ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఉద్యమిస్తుంది. ఎక్కడా ఆగదు.
నవల అంతా చదివాక అవివేకంతో, మూర్ఖత్వంతో తన జీవితాన్ని నాశనం చేసికొన్నందుకు శబరిపై జాలి కలుగుతుంది. కానీ ఒక పక్కన అలాంటి సంఘం వున్నందుకు కోపం వస్తుంది. శబరి పతనానికి కారణం విలువు లేని మాజం. ఎలా సంపాదించినా ఫరవాలేదు కానీ డబ్బు కావాలి. ధనవంతుడే ఈ సమాజంపై ఆధిపత్యం సంపాదించే వ్యవస్థ ఇది. ఎన్ని అవమానాలకు గురైనా, ఎన్ని అణచివేతలకు బలయినా మళ్లీ ఆ ధనవంతుల మోచేతికింద బతక్క తప్పని పేదల జీవితాలు.
నిత్యనూతన జీవితాన్ని సరికొత్త సమసమాజాన్ని ఆశించిన శబరి, జ్యోతులు కోరుకొన్నది పొందలేకపోయారు. ఎవరి కారణాలు వారికుంటాయి. ఆ కారణాలను సందర్భానుకూలంగా నవలలో ఇమిడిపోయేటట్లు చక్కగా వర్ణిస్తారు రచయిత్రి.
ఒకచోట సత్యం ‘‘పట్టుబడినవారిని పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తారు. ఆ దారుణాలను, చిత్రహింసల్ని తట్టుకోలేక కొంతమంది ఇన్‌ఫార్మర్‌లౌతారు’’ అంటాడు.
‘‘వ్యక్తిగత బలహీనలు, సరయిన రాజకీయ అవగాహన లేకపోవడమే మన ఉద్యమానికి అవరోధంగా వుంటాయి’’ అని చెప్తాడు.
మరొకచోట జ్యోతి వర్గశత్రువును చంపితే ఆ తల ‘‘నన్ను చంపావ్! బాగానే వుంది.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-మందరపు హైమావతి