వినమరుగైన

ప్రజల మనిషి -వట్టికోట ఆళ్వారుస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణాలో జరిగిన మహోద్యమానికి సంబంధించి వచ్చిన సాహిత్య సంబంధమైన రచనలలో ప్రజల మనిషి అగ్రస్థానంలో వుంటుంది. ప్రజల మనిషి రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి స్వయంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నవాడు. సాంస్కృతిక, రాజకీయ నేపథ్యం నుండి చూసినపుడు నవలకున్న ప్రాధాన్యం సుస్పష్టం.
మా నిజామురాజు జన్మజన్మాల బూజు అని మహాకవి దాశరధి చెప్పినట్లు ప్రతి ఊరిలోను ఆ నిజాం ప్రభువు పాలనకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు, ప్రతిఘటనకు సిద్ధమవుతున్నటువంటి వారినుంచి కొన్ని పాత్రలను ఎన్నుకుని ఈ ప్రజల మనిషి ఒక మహేతిహాసంగా సాగుతుంది. దిమ్ముగూడెం అనే గ్రామం అందుకు ఉదాహరణగా వట్టికోట ఆళ్వారుస్వామిగారు ఎన్నుకున్నారు. భూమికోసం పరితపించేటువంటి పేదల్ని అనేక ప్రలోభాలకు గురిచేసి వారిని వంచించేటువంటి కపట రాజనీతి ఒకవైపు, దానికి ప్రతిఘటనగా జాతి కోల్పోయినటువంటి సాంస్కృతిక ఆత్మను, అభిమానాన్ని పునరుద్ధరించుకునే ప్రజ ఒకవైపు ఇందులో మనకు కనబడతారు. ధర్మక్షేత్రం కురుక్షేత్రం అయినటువంటి ఆనాటి ఆ పోరాటంలోప్రజల వైపు వున్నటువంటి ఒక పాత్ర కంఠీరవాన్ని నాయకుడుగా ఎన్నుకుని ఆళ్వారుస్వామిగారు ఈ నవలను రచించారు. ఆ వూరిలో అన్ని వూళ్లలోలాగే ఒక భూస్వామి రాంభూపాలరావు, అలాగే నిజాం తొతె్తైనటువంటి హైదరాలీ, దానితోపాటు భూస్వామికి కొమ్ము కాచేటువంటి రైతులు ఒకవైపు వున్నారు. మరోవైపు ఆ దోపిడీకి గురైనటువంటి వారిలో అటు అగ్రవర్ణాల నుంచి ఇటు నిమ్నజాతుల వరకు అనేకులు మనకు ఇందులో సందర్శనమిస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం జరగటానికి ప్రాతిపదిక సిద్ధం చేసినటువంటి సాహిత్య రచనల్లో ఇది ఒకటని చెప్పవచ్చు.
తెలంగాణ గురించి చాలా నవలలు వచ్చినాయి కానీ వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి, అలాగే దాశరధి రంగాచార్య రచించిన చిల్లరదేవుళ్లు నవలలో నేటివిటీ చాలా ఎక్కువగా ఉంది. వారిద్దరూ కూడా ఆ ప్రాంతవాసులే కాకుండా ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందువలన అక్కడి ప్రజల మనోభావాలకు చక్కనైనటువంటి సాహిత్య రూపం ఇవ్వగలిగారు. తరువాత విశ్వవిద్యాలయాల్లో సిద్ధాంత గ్రంథాల్లో తారతమ్య పరిశీలనలో తేలింది కూడా ఆ తెలంగాణ నవలలో వట్టికోట ఆళ్వారుస్వామి గారిది చాలా ఉత్కృష్టమైన రచన అని నిర్థారింపబడింది. ఒక ఊళ్లో భూస్వామికి వ్యతిరేకంగా అనేక వర్గాల సమీకరణ సంఘటన ఈనవలలో ప్రధానాంశం. వేదాల రఘునాథాచార్యులుగారిది సనాతన వైష్ణవ కుటుంబం. దొర రాంభూపాలరావుగారికి ఆ కుటుంబానికి చాలా సాన్నిహిత్యం వుంది. వాస్తవానికి దొరగారి ఆధ్యాత్మిక గురువులైటువంటి ఈ రఘునాధాచార్యులుకి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు వెంకటాచార్యులు సాంప్రదాయకమైనటువంటి పద్ధతిలోనే నడుస్తూ, దొరవారి పక్షంగా వుంటాడు. చిన్నవాడు కంఠీరవం తాను తన వారిచే భ్రష్టుడనిపించుకున్నప్పటికీ వూరిలో దొరవారి పీడనకు గురవుతున్న వారి సానుభూతిని పొందగలుగుతాడు. అంతేకాకుండా ఈ నవలలో మరొక విశేషమేమంటే ఆనాడు వున్నటువంటి రాజకీయ పార్శ్వమే కాకుండా మత, సాంస్కృతిక వైవిధ్యాలకు సంబంధించిన అనేక అంశాలు చక్కగా చోటుచేసుకున్నాయి. ఉదాహరణకి కంఠీరవం క్రమంగా ఎదుగుతూ వచ్చిన వికాసం, ఆ పరిణామాన్ని ఈ నవలలో చాలా అద్భుతంగా చిత్రించారు. కంఠీరవం తనవైదిక నేపథ్యాన్ని వదులుకొని, ఎలా ఇతర వర్గాలవారి అనుభవాన్ని పురస్కరించుకుని, తాను మారుతూ వచ్చిందీ ఇందులో ఆళ్వారుస్వామిగారు చక్కగా ప్రతిబింబించారు. నిజామాబాద్ జైలుకు వెళ్ళేవరకూ కంఠీరవానికి ఇంకా తన కుల పట్టింపులు చాలా వున్నాయి. అందరితో కలిసి భోంచేయటం, అందరితో కలిసి ఉండటం అనే విషయాలమీద వున్నటువంటి ఆ శషభిషలు కూడా జైలు జీవితంలో పోయాయి. అందుకే జైల్లో జీవితం గడుపుతూ, అక్కడికి వచ్చినటువంటి అనేక వర్గాలవారితో ఆయన పొందిన అనుభూతిని ఒక్క వాక్యంలో ఆయన తేల్చి చెపుతాడు. జైలు ఒక పెద్ద పాఠశాల. వాస్తవానికి అది రెండువిధాల అన్వయించుకోవచ్చు. నిజాం ప్రభువు యొక్క దౌష్ట్యానికి గురైనటువంటి ప్రజలను మరింతగా అర్థం చేసుకునేటటువంటి క్రమంలో జైలు ఒక పాఠశాల అయితే, తాను జన్మించి పెరిగినటువంటి ఛాందస నేపథ్యాన్ని వదులుకుని సామాజికమైనటువంటి ప్రగతి పథంలో పయనించటానికి కంఠీరవానికి జైలు ఒక పాఠశాల అయింది.
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-సి.రాఘవాచారి