వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలు కోపం లెక్కలోకి రాదు. ఆ కోపంలో ముక్కంటి కంటిమంట వేడివేడిగా ప్రజ్వరిల్లాలి. త్రిశూలంపై మొనలా, కొనలా, వాడివాడిగా, భయం భయంగా ఆ కోపం గుచ్చుకోవాలి. అప్పుడే శత్రువు తోక ముడుస్తాడు. ఇంత మేలుకొలుపు ఈ అక్షరాలలో గాఢంగా ఉన్నది. అంతేకాదు-
‘‘దారి తప్పిన బాటసారుల కొరకు
దారిగానని పేదవారల కొరకు
వెలిగించు కాగడా! వెలిగించవోయి..’’
అని కూడా అంటారు. స్వేచ్ఛా మార్గం తప్పిన బాటసారులు కొందరైతే, అసలు దారే కనపడని నిర్భాగ్యులు మరికొందరున్నారు. వారందరికోసం దీపం వెలిగిస్తే సరిపోదు. కాగడా పట్టుకోవాలి. అప్పుడే చైతన్యకాంతి చేతులు కలుపుతుంది. ఇంత సాంఘిక స్పృహ కాగడాలో వున్నది. దీపాన్ని కాకుండా కాగడాను ఎన్నుకోవడంలోనే వస్తు పోషణకు సరైన పనిముట్టు దొరికినట్లయింది.
మరొక స్వేచ్ఛాదీపం- కాంక్ష...
ఇందులో పద్యాలన్నీ ఆనాటి సాహిత్యాభిమానులను కదిపి కుదిపినవే! ఈ పద్యాలలో ఆదరాభినయం చేసింది పుష్పమే అయినా, నేపథ్యసంగీతం మాత్రం బానిసత్వంలో మ్రగ్గుతున్న భారతీయునిది. అయితే దీని వెనుక ‘పూల్ కీ చాహ్’ అనే హిందీ గేయపు ప్రభావం ఉన్నదని కొందరి అభిప్రాయం. ఏదిఏమైనా ఈ కాంక్షను మనం మన్నింపవలసిందే!
‘‘పేదల రక్తమాంసముల బెంపు వించి దయా సుధారసా
స్వాద దరిద్రులైన ధనవంతుల పెద్దరికమ్ముకై, మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్పిన రాతిబొమ్మలం
దూదరవోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నా యెదన్!’’
పీడిత ప్రజానీకంలోని అంతర్మథనం, ఆవేదన, ఈ నాలుగు పాదాల్లో వినబడుతున్నాయి. ధనం కాదు పెద్దరికానికి ఇంధనం. కృపాధనం కావాలి. అది లేకపోతే ధనవంతుడైనా దరిద్రుడే. విగ్రహాలు దేవునికి ప్రతిరూపాలైనా మతోన్మాదం పెంచే విషయంలో అవి వట్టి బండరాళ్లే. ఆ ధనవంతుల కోసం, ఈ బండరాళ్లకోసం అర్పణ కావటం ఆ పుష్పాలకు ఇష్టం లేదు. వీటి వెనుక అస్వతంత్రుడైన భారతీయుని మనోవేదన అంతర్లీనమై ప్రతిధ్వనిస్తున్నది. ఇంత ఉదాత్తంగా చెప్పటం మహాకవికే సాధ్యమవుతుంది తప్ప- మామూలు కవికి చెల్లదు.
తేనెల కోసం తమ చుట్టూ స్వార్థకళతో పరిభ్రమించే తుమ్మెదలను పూలు నిరసించాయి. ఇక్కడ తుమ్మెదలు తెల్లదొరలే. గాలితో తాదాత్మ్యం చెందే సౌఖ్యం తమకు వద్దన్నాయి. నవోదయకాంతి పెట్టే నులి వెచ్చని ముద్దులలో దొరికే వైభవాన్ని త్రోసిపుచ్చాయి. ఈ తావుల్లో శిరమెత్తి నిలబడింది ఆత్మాభిమానమే! ఇదంతా వేదుల ఆత్మాభిమానమే. పరాధీనంలో బ్రతకుతున్న భారతీయుని విషయమే. ఆత్మాభిమానంలో అంత పట్టు వుంది. కాబట్టే పదవిలోనున్న బెజవాడ గోపాలరెడ్డి వంటి వ్యక్తి అంకితం కోరితే- దాన్ని సున్నితంగా తిరస్కరించారు వేదుల. ఆ అభిప్రాయాలన్నిటికీ ఆకారమే ఈ పద్యం...
‘‘తేనెల కోసమై కొదమదేటుల దాటువొనర్చు నృత్యగీ
తానునయమ్ముగాని, మలయానినులు కౌగిట బల్కరించు సౌ
ఖ్యాను భవమ్ముగాని, తరుణారుణరాగ కదుష్ణచుంబన
శ్రీ నవకమ్ముగాని పరితృప్తి యొసంగపు నాకొకింతయున్..’’
ఇదే కవితా ఖండికలో-
‘‘కానుకనై ధరాధిపుల కాళ్ల కడం బరలాడి వాడిపోలేదు’’
అంటూ భారతీయ సుమశీలాన్ని వివరించారు.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు