వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా అని అవకాశం వచ్చింది కదా అని, అవతలివారి బలహీన క్షణాన్నో, అనుభూతి క్షణాన్లో ఆసరా తీసుకొని తన అవసరం తీర్చుకునే వ్యక్తి కాదు. మగద్వేషి అయిన, యువకుల ఆరాధ్య సౌందర్యవతి, సుగుణశీలి అయిన డాన్సర్ వందన తనంతట తానుగా శ్రీపతితో- ‘నన్ను పెళ్లిచేసుకోకున్నా, ఒక్కసారి నన్ను మీలో కలిపేసుకోండి’ అని ప్రాధేయపడినప్పుడు- ‘నేను తిరుగుబోతుని, నాలాంటివాడు కాక జీవితాన్ని అర్పించుకొని పంచుకోగల్గిన వ్యక్తితో సార్థకమవండి’ అంటూ సున్నితంగా తిరస్కరించిన సహృదయుడు. స్వప్నరాగలీన మాటల్లో చెప్పాలంటే శ్రీపతి ‘దిగకుండానే లోతు ఫీలయి అనుభూతిస్తాడు. దిశ లోతు అనుభవించి వొప్పుకునే స్వభావం కాదు’.
అనుక్షణికంలో మరో అద్భుత సృష్టి స్వప్నరాగలీన. మంచు, వెనె్నల, తేనె, పాలతోపాటు మంచినతనం, మానవత్వం, నిర్మలత్వం, లాలిత్యంలను కలగలపుకొని సృష్టించబడ్డ ఒకే ఒక స్వప్న సౌందర్య దేవత స్వప్నరాగలీన. స్వర్గంలోని ఒక గంధర్వ దేవత పొరపాటుగా ఈ లోకంలోకి వచ్చిందా అని అనిపిస్తుంది స్వప్నను చూస్తుంటే. తను ప్రేమించిన, తనకు అన్నివిధాలా అర్హుడైన ‘అనంత్‌రెడ్డి’ని తనభర్తగా పొందటం ఆమె అదృష్టానికి పరాకాష్ట. ఇక్కడే ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. అన్ని విధాలా స్వప్న కు సరితూగగల, స్వప్నకోసమే పుట్టినట్లనిపించే అనంత్ ఆమెను సెక్స్‌తో కలువలేకపోతాడు. భౌతికంగా, మానసికంగా ఏ లోపం లేకున్నా, ఒకానొక గాథ రసానుభూతి అతన్ని ఆ క్షణంలో అశక్తున్ని చేస్తూ వుంటుంది. చివరగా- ఒక రసోద్వేగక్షణాన- పెదాలలోంచి అవిరామంగా, అనంతంగా ప్రవహిస్తున్న రసధార స్కలించి- స్వప్న విశ్వైక్య రసయోగ విశ్వ సంప్లావిత నిర్వాణం చెందుతుంది.

(ఇంకా ఉంది)

రామిశెట్టి చంద్రశేఖర అజాద్