వినమరుగైన

అనుక్షణికం -వడ్డెర చండీదాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తర్వాత అతనికి పెళ్లి అయినాక, తన భార్య శాంత కూడా వేదవది లాంటిదే కావచ్చునన్న అనుమానం అతన్ని వేధిస్తుంది. ఆ సంఘర్షణ అతన్ని ఆత్మహత్య చేసుకునేదాకా నెడుతుంది. చివరి క్షణంలో శాంత ప్రోద్భలంతో తన సంఘర్షణను వివరించి-మనసు తేలిక చేసుకొని అప్పటినుంచీ ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తాడు.
సుబ్రమణ్యం లాంటి చాలామంది మగవాళ్లకు యిది కనువిప్పు కాగలదు. ఇక్కడితో ఈ పాత్రను ముగిస్తే బాగుండేదని అనిపిస్తుంది. ఆనక సుబ్రమణ్యం బ్యాంక్‌లో దొంగ డిడిల కేసులో చిక్కుకోవటం, అతనికి పిచ్చి ఎక్కడం తిరిగి శాంత జీవితం కష్టాలపాలు కావటం- సుబ్రమణ్యం సఫర్డ్ మోర్ దేన్ హి డిజర్వ్‌డ్‌లా అన్పిస్తుంది.
అంకినీడు, విజయ్‌కుమార్, రంగారెడ్డి-వీళ్లంతా సెక్స్ కక్కుర్తిగాళ్లు. రంగారెడ్డి కొంచెం మానవత్వమున్నవాడు. అమ్మాయిలను మోసం చెయ్యటం, వేశ్యలతో గడపటం మిగతా ఇద్దరికీ రొటీన్ కార్యక్రమం. అంకినీడు, ‘నళిని’తో పెళ్లికావటం, సినిమాను తీసి నష్టపోవటం, ఆ తర్వాత నళిని అతన్ని అన్ని విధాలా అదుపులో పెట్టడం ఈ పాత్రకు జరిగిన ముగింపు. విజయ్‌కుమార్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ ముసుగులో ధన, కామ కక్కుర్తిని తీర్చుకోవటం, అతని బాధలకు తట్టుకోలేక మొదటి భార్య సీత ఆత్మహత్య చేసుకోవటం, రెండవ భార్య కనకదుర్గ అతన్ని అదుపులో పెట్టడం, అంతలో ఒక దొంగనోట్ల కేసులో చిక్కుకొని అరెస్టు కాబడి, బెయిల్‌మీద బయటకు వచ్చి, ఆత్మరక్షణలో పడటం అతని పాత్ర విషయంలో చూస్తాము.
వెంకటావధాని, అతని ప్రేయసి ‘స్రవంతి’, స్రవంతి నాన్న రాఘవరెడ్డిల మధ్య నడిచిన కథ ఒక డిటెక్టివ్‌లా నడుస్తుంది.
విజయ్‌కుమార్ చేతుల్లో మోసపోయి ఒక కొడుకుని కని, ఆ కొడుకుని హాస్టల్‌లో చదివిస్తూ, పోషణార్థం పడుపువృత్తిలో దిగిన శ్రీగంధం కస్తూరి పాత్ర పాఠకుడిని విపరీతంగా కదిలిస్తుంది. అలానే తండ్రి చనిపోతే కుటుంబ పోషణార్థం చదువుకుంటూనే లాడ్జిలకు వెళ్ళే జయంతి పాత్ర కూడా జాలిని కల్గిస్తుంది. కుంటి అవధాని ‘జయంతి’ని పెళ్లాడటం మరో మలుపు.
మరొక ప్రత్యేకమైన విచిత్ర మనస్తత్వం కలిగిన పాత్ర రాజమండ్రి రమణిది. నిజానికి ఈనవలలో ఈ పాత్రను చూపించాల్సిన అవసరం లేదు. అయితే సెక్స్ యొక్క మరొక వికృతభావం జీవితాన్ని ఎంతటి విషాద స్థితికి తీసుకెళ్తుందో చూపటానికే ఈ రమణిని ప్రవేశపెట్టినట్లు అనిపిస్తుంది. రమణి జీవితం భయంకర ముగింపు. జాలిని రమణిమీద కలిగేలా చేస్తుంది- జుగుప్సను మించి.
ఇలా ఎనె్నన్నో పాత్రలను చూస్తాం. ఒక్కొక్కరు ఒక్కొక్కరకమైన మనస్తత్వానికి టిపికల్ రిప్రజెంటేటివ్స్‌గాకనపడతారు. చదివిన ప్రతి పాఠకుడూ తనను ఏదో ఒక పాత్రలోనో, లేక పాత్రలలోనో ఐడెంటిఫై చేసుకుంటాడు. తనకు తెలియకుండానో, తెలిసో తనకు తాను సరిచేసుకోవటానికి కనీసం ప్రయత్నిస్తాడు. అది ఈ నవల వల్ల కలిగే సాహితీ ప్రయోజనం? కులాల, మతాల, రాజకీయ ద్వేషాలమధ్య సెక్స్ ప్రధానంగా యిన్ని పాత్రలను సహజంగా ప్రెజెంట్ చేసినందుకు రచయితను తప్పనిసరిగా అభినందించాల్సిన పని వుంటుంది.
ఇందిరాగాంధీ ఎన్నికను కోర్టు తప్పుపట్టటం, ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించబడటం, అప్పటి ఆగడాలు, ఆనక జనతా ప్రభుత్వం ఏర్పడటం, ఆ అతుకుల బొంత విశేషాలు- తిరిగి చిక్‌మగ్‌లూరు నుంచి ఇందిర ఘన విజయం- ఈ రాజకీయ నేథ్యంలో మొత్తం నవల నడుస్తుంది.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

రామిశెట్టి చంద్రశేఖర అజాద్