వినమరుగైన

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, దాన్ని తెగేసి ప్రోత్సహిస్తూ శ్రీపాదవారు జూనియరూ కాదు, అల్లుడు అన్న కథ రాశారు. తహస్సీలుదారు గాదు -వర్తకుడు, వెలుగు-చీకటి నలుగుర్ని పోషిస్తున్నానిప్పుడు అన్న కథలు పాఠకులలో స్వతంత్ర వృత్తిమీద ఆసక్తిని, గౌరవాన్ని కూడా పెంపొందించాయని నాటికీ నేటికీ విజ్ఞులు వక్కాణిస్తున్నారు. వీరేశలింగం పంతులుగారు అన్నా, బంకించంద్ర ఛటోపాధ్యాయగారు అంటేనూ శాస్ర్తీగారికి చెప్పనలవిగాని యిష్టం. వీరేశలింగం పంతులుగారినే తనకథలలో ఒక పాత్రగా ప్రవేశపెట్టి రంజుగా; సంఘ శ్రేయోభిముఖంగా కొన్ని కథలను ఆయన నడిపించాడు. స్ర్తి జనోద్ధరణ మాత్రమే గాదు-స్ర్తిల మీద అపారమైన ప్రేమాభిమానాలతో శ్రీపాదవారు ఎక్కువ భాగం కథలు రాశారు. అరికాళ్ల క్రింద మంటలు అన్న కథలో ఒక బాల వితంతువు తన సవతి తల్లీ, అక్కలూ పెట్టే బాధలు తట్టుకోలేక అట్టి అరికాళ్ల క్రింద మంటలు భరించలేక అర్థరాత్రి వేళ రాజమండ్రి పారిపోతుంది. ఒక బండివాడు ఎక్కడికమ్మా వెళ్తారూ అనడుగతాడు. ‘‘దానవాయిపేటకు వెళ్ళాలబ్బీ’’ అంటుంది. దానికా బండివాడు సంగతి గ్రహించి ‘‘అమ్మా, పంతులుగారి తోటకే అయితే డబ్బులివ్వక్కరలేదులే, తొందరగా బండెక్కండి, రేపీ పాటికి పెళ్లిచేయిస్తారు’’ అని చెబుతాడు. ఈ కథలో బండివాని పాత్రకూడా మరపురానిదే. వితంతు పునర్వివాహ ఆవశ్యకతపై ఆయన రాసిన కథలన్నీ అతి సహజసిద్ధంగా అపూర్వ శీర్షికలతో సంస్కరణలు స్ఫూర్తినిస్తాయి. శైలీ, శిల్పాలతో సజీవ చిత్రణలుగా భాసించాయి ఆ కథలు.
శ్రీపాదవారు మొదట్లో పద్యం నుంచి గద్యంలోకి మారగానే నేరుగా వాడుక భాషను ఎత్తుకొనలేదు. సరళ గ్రాంథీకంలో రాశారు. అటు తరువాత, తన కథనమంతా సరళ గ్రాంథీకంలో నడిపిస్తూ పాత్రలయొక్క సంభాషణలను మాత్రం నిత్య నూతన వాడుక భాషలో నడిపిస్తూ వచ్చారు. అదీ వదలి 1925తరువాత మాత్రం అనితరసాధ్యమైన వ్యవహారిక భాషా ప్రయోగాలతో సంవాదనా శైలిలో కథలను తీర్చిదిద్ది చదువరులను వాటి వెంట గ్రుక్క తిప్పుకోకుండా పరుగెత్తించారు. గులాబీ అత్తరు, రాచపీనుగ తోడులేనిదే వెళ్లదు, కొత్తరికం, ముళ్లచెట్టూ - కమ్మని పువ్వూ లాంటికథలు పదే పదే చదివించే కథలు!
శ్రీపాదవారి కథలకు బీజం, క్షేత్రం కూడా నాటి సంఘమే. అగ్రహారీకులలో రావాల్సిన మార్పులనూ భ్రష్టుపట్టిపోయిందనుకున్న బ్రాహ్మణ సమాజాన్ని ఉద్ధరించే లక్ష్యంతోనూ ఆయన పుంఖానుపుంఖాలుగా రాశారు. అయితే కేవలం బ్రాహ్మల బాగోగులను గుర్తించి వారందుకే అంకితం అయిపోయారు అనుకోవడానికి వీలులేదు. సంఘంలో నవీన యుగపు పోకడలు యిల్లాలితోను, యింటితోను మొదలవ్వాలని దానికి అన్నికులాలలోను వివాహ వ్యవస్థలో సరళమైన మార్పులు రావాలని కోరుతూ ఆయన తన దృష్టిని అన్ని కులాలు, మతాలూ వర్గాలమీద కేంద్రీకరించారు.
- సశేషం

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com