వినమరుగైన

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ కథలు -శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆ వూరు రైతాంగం అంతా కమ్మవారు. రెండొందలు పైగా వుంటుంది గడప. ఊరిపెత్తనం వారిదే’’. తతిమ్మా కులాల వాళ్లు శెట్టి బలిజలు, కలారీలు కొప్పు వెలమలు, చాకళ్లూ, మంగళ్లూ.. బాగా తక్కువేగాని మాదిగపల్లెలో యాభైదాకా వున్నాయి కొంపలు.
అది ఎప్పుడు, ఎందుకు అలా తటస్థించిందో కాని ముప్ఫయి తొమ్మిదిమంది ‘మహమ్మదీయులు’ కూడా వున్నారా వూళ్లో. కానీ క్రైస్తవులుగా మతం మార్చుకున్నా దళితులైనవారికి వేర్పాటు తప్పలేదు. అయితే హిందువులు, ముస్లిం మతం తీసుకుంటే వాళ్లు సవర్ణులతో అలాగే బ్రాహ్మల మధ్య భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్నారు వూళ్లో. ‘‘ హిందువులుగా వున్నపుడూ బ్రాహ్మణడూ, క్షత్రియుడూ, వైశ్యుడూ, శూద్రుడు, చాకలి, మంగలి, మాల మాదిగ యిలా వేరే వేరయి పోయి వుండినవారందరూ ఇస్లాం మతం పుచ్చుకోగానే ఒక్కటే అయిపోయారు.
నవాబూ -గరీబూ, పాచ్చా -ఫకీరూ- భేదాలటుంచి బతుకంతా వాళ్లది ఒకటే, జాతి ఒకటే-ఎందుకనీ? ఇలా అడుగుతూ అంచేత హిందువులలో వర్ణ్భేదం, దళిత భేదం వుండరాదు అంటాడు శాస్ర్తీగారు. ఆ కథలో యిదంతా అరటిపండు వొలిచి చేతబెట్టినట్లుచెప్పుకొస్తాడు. ప్రతి పాత్ర సానబెట్టిన రత్నం. సవర్ణులు, దళితులు అంతా ఏకం అయిననాడే మనకి జాతీయత - ‘‘జాతి ప్రతిపత్తి అన్న ప్రతిపాదనను తన కథల్లో పాలల్లో చక్కెర కలిపినంత తియ్యగా, మందుమాత్ర చుట్టూ చక్కెరపొర వేసినంతగా చక్కగా చెప్పుతాడు. ఆ తీరు, మహానుభావుడుగాన, ఆయనకే చెల్లు. ఆయన కథల్లో నాకు అపారంగా నచ్చిన మరొక కథ-1948లో వారు రాసిన కొత్త చూపు. అది నేటికీ, రేపటికీ కూడా మనకు కొత్తచూపు. కొత్త మాట ప్రసాదించే అద్భుతమైన కథ. అందులో కట్నంతో చేసుకునే పెళ్లికి నిరాకరించిన ఒక విద్యావతి ‘అన్నపూర్ణ’కి తండ్రి యిచ్చే ప్రోత్సాహం రచయిత ఆవిష్కరించిన తీరు మన నరాల్లో కొత్త నెత్తురై ప్రవహిస్తుంది. అందులోనుంచి కొన్ని వాక్యాలుటంకించి మహామేరువు అయిన శాస్ర్తీగారిని రుూ కొద్ది సమయంలో కొలవలేకపోయినా ఆయన్ని గొప్ప కథకునిగా కొలుస్తూ శలవు తీసుకుంటాను.
‘బ్రతికున్నంతకాలమూ జీవితంలో స్ర్తిలు తమతో సహకరించుకోవాలంటే యువకులిప్పుడు గడించుకోవలసిన యోగ్యతలు. శౌర్య, బల పరాక్రమాలు, తెగబడి యుద్ధం చేసే ధైర్యం. ఆడపిల్ల తండ్రి అయిన రామశాస్ర్తీగారి మాటలే యివి కూడా. ఏదైనా విద్యలో ప్రజ్ఞకలవాళ్లు ఏమన్నా అదో అందం కానీ, పప్పు్భట్టు పండితులు ధర్మశాస్త్రాలు విడగొడితే ఎలాగ భరించడం? ఇంతకీ అగ్రహారం అంతటిలోనూ ఆడపిల్లని యింగ్లీషు చదువులో పెట్టింది నేను. రజస్వల అయితేగాని పెళ్లి చెయ్యనని అట్టేపెట్టేసిన మొదటివాణ్నీ నేనే అంటాటా రామశాస్ర్తీ.
ఇక శాస్ర్తీగారి అమ్మాయి అన్నపూర్ణ గురించి ఆయన మాటల్లోనే ఇంగ్లీషు ఉద్గ్రంధాలు అనేకం చదవటంవల్లా, ఖండాంతర ప్రఖ్యాత పత్రికలు ఎప్పుడూ చూస్తుండటంవల్లా మా అమ్మాయికి కొత్త దృక్పథం ఏర్పడింది. ఖండాంతర ఫిలిములు దాన్ని పోషించాయి.
ఇలా అటు సంప్రదాయ, వేదాల సారాన్నీ యిటు ఆధునిక పోకడల రీతిని రెండింటిని సమన్వయిస్తూ నవీన దృక్పథానికి పరమావధిని రుూ కొత్త చూపు పెద్ద కథలో చూపెట్టారు శ్రీపాదవారు! స్వతంత్రంవచ్చిన మరుసటి సంవత్సరంలో 1948లో రాసిన రుూ కథలో కొంత నాటకీయంగాను, మరికొంత సినిమా ఫక్కీలోనూ విశదీకరిస్తారు వారు.
చివరగా గుర్రప్పందాలు అన్న కథ కూడా నేటికీ సరిపడేలాగా ఉద్యోగాలను, ఇంటర్వ్యూలను ఒక ఫార్సు రూపంలో ఎండగడుతుంది. శాస్ర్తీగారి కథలు చిన్న కథలా? కథానికలా? పెద్ద కథలా? నవలికలా? లాంటి మీమాంస వదలిపెట్టి వారి కథల ద్వారా నాటి సమాజ పరిణితిని విశే్లషించి, పరిశోధించినట్లయితే ఒక్కో కథ మీద ఒక్కో థీసిస్సు తయారయిముందు తరాలకు కరదీపికా, కార్యప్రణాళికా కూడా కాగలవు.
శిథిలం కాని అక్షరం శిల్పాలయినవి. అందులోనూ సజీవమయిన శిల్పాలవి! శాశ్వతాలవి! కథలలో కొత్త చూపు కథనంలో ఒక కొత్త వూపూ- తెనుగు జాతి గర్వించదగ్గ తెనుగు కథామూర్తి ఆయన!

- సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వీరాజీ