వినమరుగైన

కాంతం కథలు- మునిమాణిక్యం నరసింహారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంలో కాంతం పుటక అదీ. అక్కణ్ణిచీ భార్యాభర్తల సరాగాలూ, అనురాగాలూ, పంతాలూ, పట్టింపులూ, ఇరువురి జయాపజయాలూ వగైరాలమీద బోలెడు కథలు. అన్నిటా ఆవిష్కరింపబడే ఒకే ఒక విషయమేమిటంటే వెంకట్రావు అంటే కాంతం భర్త ఎంత వ్యక్తిత్వం వున్నా దాన్ని ప్రదర్శించడానికి వీలులేనపుడు సామరస్యంతో వెనక్కి తగ్గుతుంటాడు. ఏతావతా కాంతందే పైచేయి అవుతూంటుంది. ఇందులోంచి బయటపడే విశేషమేమిటంటే ఏ ఇంట్లో ఇల్లాలిది పైచేయి అవుతుందో ఆ సంసారం సర్గతుల్యం అని, మగవాడన్నాక అనేక కోరికలు ఉంటూంటాయి. అన్నీ భార్య తీర్చలేనపుడు భార్య చెప్పే పాఠమే వారిద్దరిమధ్యా అనుబంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
పుస్తకాలు చూసీ చదివీ ప్రయాణం సాగించవొద్దని ప్రకృతి సహజంగా ఆనందించమనీ వెనె్నలలో కథలో చెబుతాడు. ది పెర్‌ఫెక్ట్‌లైఫ్ కథలో గూడా భార్య కావ్యనాయికలా ఉండాలని బోలెడు ప్రబంధ సాహిత్యాన్ని గుప్పిస్తే మరి మీరు వారి వారి నాయకుల్లా ఉన్నారా- మనకి మనమేనండీ అని కాంతం పాఠం చెబుతుంది. ఏ భార్యా భర్తలకైనా ఒకరికొకరు రతీ మన్మథులు కాకపోతే సంసారం నడవదన్న నీతి ఇందులోంచి ఊడిపడుతుంది. ఇదే విషయాన్ని బద్‌నసీ హత్ అనే కథలో గూడా వివరిస్తాడు. సాంసారిక ఆనందం మీద భ్రమ చావని నడి వయస్కుడికి చిట్కాలు చెప్పబోయి అతని భార్య చేత కాంతం ఎదురుగా చీవాట్లు తింటాడు. ఇంట్లో విరహం అన్న కథలో గూడా తన కాంతం కావ్యకన్యలా విరహం అనుభవించాలని యోచించి ఏర్పాటుచేస్తే ఆమె తన గురించి భోజనం మానేసి ఎదురుచూపులు చూస్తూ చేసిన త్యాగాన్ని గమనించి పుస్తకాల్లో చిట్కాలు ఇంట్లోకి పనికిరావురా బాబూ అని లెంపలేసుకుంటాడు కాంతాన్ని అడ్డుపెట్టుకుని.
మునిమాణిక్యంగారు సంసారిక జీవనంలో స్పృశించని విషయమంటూ లేదు. పిల్లా జెల్లకు పేరు పెట్టుకునే నామకరణం తమాషాల నించీ, వాళ్ళబ్బాయి రాధాయిగాడికి ఆముదం పట్టించేందుకు పడ్డ పాట్ల వరకూ అందరూ తమ తమ ఇళ్ళల్లో అనుభవించే తమాషాలే. ఆ సంఘటనలే పక్కింట్లో ఇలా జరిగాయని తెలిస్తే కథలౌతాయి. పైగా కాంతానిదెప్పుడూ గట్టి పట్టు వరసే కానీ కోపిష్టి మార్గం కాదు. సూర్యచంద్ర గ్రహణాలకి మల్లే పాణిగ్రహణాల విషయంలో గూడా పట్టువిడుపులుండాలని తెలిసిన సంసారిక విదుషీమణి. ఆడవాళ్లు పసిపిల్లల్తో ఎంత అవస్థపడ్తారో అనుభవపూర్వకంగా భర్తకి తెలియజేసే కథ కాంతం పేరంటం. పాయింటేమీ లేదు. కొంచెం పిల్లాణ్ణి చూస్తూండండి అలా పేరంటానికెళ్లొస్తానంటుంది కాంతం. ఆమె తిరిగి వచ్చే కాసేప్పట్లోనే ఆ గడుగ్గాయి పధ్నాలుగు లోకాల్లోని పధ్నాలుగు నరకాల్నీ చూపిస్తాడు ఆయనకి. ఆమె పేరంటం నించి రాంగానే ఈయన బతుకుజీవుడాని పిల్లాణ్ణి అందిస్తే ఠక్కున కచేరీ ఆపేసి విజయగర్వంతో నవ్వుతాడు. హంపీ ప్రయాణం కథలో తనూ వస్తానని కాంతం వెంటబడ్తే నేచూసొచ్చి వర్ణించి చెప్తాగా అంటే నేను కూడా షడ్రుచుల్తో విందు భోజనం వండి నేనూ పిల్లలూ తిని ఆ భోజనం ఎలా వుందో మీకు పెట్టకుండా వర్ణించి చెప్తాలెండి అంటుంది కాంతం! పాపం! ఇంక ఆ మానవుడికి నోరేదీ! దారేదీ!- కాంతంది ఇదీ వరస. కొట్టుకోడాలూ, తిట్టుకోడాలూ ఉండవ్. నీ పని ఇలా ఉందా ఐతే సరే నీ చేతే ఇది కుదర్దు అనిపిస్తాను- అన్న గడుసుదనం.
భార్యాభర్తల మధ్య పోట్లాటలు రావొచ్చుకానీ తెగేదాకా వెళ్లగూడదని మునిమాణిక్యం సిద్ధాంతం. రస హృదయంతో సాంసారికానందాన్ని ఆస్వాదించాలన్నది ఆయన తీర్మానం. ఇందులో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ లేదు. ఏ కథలోనైనా సరే కాంతందే గెలుపు కావడానికి ముఖ్య కారణం ఆయనలో దాగివున్న స్ర్తివాదం. యత్ర నార్యస్తు పూజ్యంతే - ఆయన నమ్మిన సిద్ధాంతం. కాంతానికి ఒక్క తన సుఖంపైనే కాదు, భర్త సుఖం, పిల్లల సుఖం అన్నిటినీ పరిణితి చెందిన దృష్టి వుంచి తనకు చేతనైన రీతిలో సుఖ సంసారానికి పునాదులు వేసుకుంటూంటుంది. సంసార బంధానికీ సంసార సుఖానికీ పునాదులు పిల్లలు అని నీలికొండలు కథలో చెప్తుంది కాంతం.
ఒకే ఇంట్లో రొటీన్ జీవితం గడిపే భార్యాభర్తలకు పిల్లలమీది ప్రేమ మళ్లీ దగ్గరకు చేర్చే మంచి టానిక్ అంటుంది కాంతం. అంతమాత్రాన భర్తని కొంగున ముడి వేసుకుంటుందని కాదు. కొంగువిడిపోకుండా చేయి దాటిపోకుండా చూసుకుంటుంది అదొకరకమైన చతురతతో.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

పిశుపాటి ఉమామహేశ్వరమ్