వినమరుగైన

మల్లాది రామకృష్ణశాస్ర్తీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా నర్సయ్య ఆగడాలెక్కువై, యిల్లు విడిచిపోయి- జతకట్టి, పిల్లల్ని కని చివరకు యింటికి తిరిగొచ్చి చూస్తే ఏముంది? పాడుపడిన కొంప!.. అందుకని మునసబుగారింటి కెడితే- అరుగుపైన ఆయన పడుకొనింటాడు. అరుగు కింద ఆయన చెప్పులు పడి ఉంటాయి. ఆ చెప్పుల చర్మం తన తల్లిది! చూసిన కన్ను అలానే గడ్డ గట్టుకుపోయింది. ఈ కనుకలి కథలోని శిల్పం అత్యద్భుతం!
ఇక భాష విషయానికొస్తే- శాస్ర్తీగారికి గ్రాంథిక భాషలో ఎంత ప్రావీణ్యముందో, జానపద భాషల్లో-అంటే ప్రజల భాషలోనూ అంతే పట్టు ఉంది! ఆ రెండూ ఆయనకు రెండు కళ్లు.
డు.ము.వులు కథ పరికిద్దాం!
‘‘కవి బ్రాహ్మలని పేరుమోశారు గందా!... ఆ మాత్రం ఎరికలేదా? గాలికి పుట్టి, ధూళికి పెరిగినోళ్లు కూసేదయ్యా ఈ బాస!.. తాటాకు కట్టలు మేసే ఓళ్లకు- మీ బాస! తవరిలాంటోరు వెయ్యి మందిలో ఒకరుంటారు. కైతలు సేస్తారు. ఏ మారాజో మెచ్చుకుంటారు. ఏనుగు నెక్కిస్తారు. ఒక్కరి కూటికి, గుడ్డకు అక్కరకొచ్చేది మీ బాస!.. మందిలో పడేది బా బాస!.. పదం, పాటా చేలో ఆవులన్నీ ఆలకిస్తాయి. లేగలన్నీ సిందేస్తాయి..’’ అంటే కొమ్మన్న కొడుకు తిక్కన సోమయాజి తమ్ముడు- గురునాథుడు ద్వారా, భాషా సారస్యాన్ని మనకు తెలియజేస్తారు ఈకథలో.
ఛాందస భావాలంటే శాస్ర్తీగారికి ఒళ్లుమంట! అలాంటి వాటిని నిరసించాలన్నదే ఆయన ధ్యేయం! అలాగే మహిళాభ్యుదయం, స్ర్తి విమోచనోద్యమం- అంటే ఆయనకు ఎంత అభిమానముందో చూద్దాం!
‘‘ఆహా.. ఆనాడు అంతే! .. ఆడదంటే కొట్టాంలో కట్టేసిన గొడ్డుతో సమానం. అరుగుమీద పరిచే నలిగిన చాప!.. అతిథి ఎవరొచ్చినా హాయిగా పడుకోవచ్చు. అభ్యంతరం ఏమీ లేదు. లేకపోగా- అతిథి సత్కార సంభారాల్లో, అవసర నైవేద్యాల్లో అదొకటి’’.
ఇలాంటి పురాణకాలపు ఛాందస సంప్రదాయాల్ని ఎండగట్టడానికే రాసిన కథ కామందకి.
‘‘వాడి పుణ్యమా అంటూ- ఆనాడు ఆ పసివాడు ఎదురుతిరిగి అలా నోరు చేసికొని ఉండకపోతే- యివాల్టివరకు- ఆడది ఓ మూలన పడుండేదే కదా!.. ఇప్పటి మహిళోద్యమాలన్నీ అంకురించడానికి ఎన్ని యుగాలు పట్టేదో’’ అంటూ ముగింపు చెప్తారా కథకు!
యుద్ధ సమయంలో సైనిక పటాలాలకు తన శరీరాన్నమ్ముకున్నా, ప్రతిఫలంగా వచ్చినదాన్నంతా ఊరి వాళ్లకిచ్చి-అటు యుద్ధానికి, యిటు ఊరికి పుష్కలంగా సాయంచేసి, చివరకు ప్రాణాలు వదిలిన అనామకురాలు చిట్టి వీరగాధను ‘‘బ్రతికి ఎందర్నో సుఖపెట్టింది. పోయి తాను సుఖపడుతుందంటూ’’ మంత్రపుష్పం కథలో హృద్యమంగా చిత్రిస్తారు. అలాగే పదేళ్ల ప్రాయంలోనే పాడైపోయి, నిర్లజ్జగా, అర్థనగ్నంగా బజార్నపడి, అడుక్కుంటూ, తల్లిని పోషించిన, పనిమనిషి కూతురు సీతాయ్- దీనగాథను అర్థ-నారిలో ‘‘సీతాయ్ బ్రతుకిలా అయిపోయిందా? ఎలా తెలవారుతుందో! దేశంలోఎంతమంది పడుచులు సీతాయ్‌లు అయిపోతున్నారో’’ అంటూ- జాలిగా చెప్తూ- స్ర్తి పతనానికి కారణభూతమైన పురుషజాతిని వ్యంగ్యంగా దుయ్యబట్తారు.
‘‘అన్నా..! అన్నా..!! నీకు పునె్నముంటుంది. పెద్దవారి బుద్ధులు ఎసుమంటివైతేనేం? లోన పోరగాడున్నాడు- తిన్నగా- తోలుకుపో అన్నా!’’ అంటూ శుద్ధ అబద్ధం కథలో బ్రతిమాలిన రత్తి మానవత్వమంటే ఆయనకెంతో మక్కువ! శాస్ర్తీగారు నిత్యాగ్నిహోత్రులు! ఒక చేతిలో ఊటకలం సాగిపోతూంటే- మరో చేతిలో శే్వత కాష్టం కాలిపోతూంటుంది! ‘‘గీర్వాణం వెలిగించానయ్యా!.. ఈ పొగాకు ససిగాలేదు. మానివేద్దామనుకున్నాను. అదీ స్వగతంగా!.. ఆర్యోక్తిలోనే.. అసలు మనసుదాటి రానీయకుండా ఉండవలెననే మాట మర్చిపోయాను. సంకల్పం పవిత్రమైనది. గనుక కూతురు ఎందుకని తల్లినే ఆశ్రయించాను. తలదిమ్ము.. తిక్క తీరేందుకు తరుచ్ఛాయ!.. అందుకూ మా గృహిణికి యింత అలుక!.. కసి తీర్చుకున్నానుగా- ఛిక్కునీ- అని తిట్టి!.. ఏం?.. అక్షీనా!.. ఇంటావిడా?’’ అంటూ కామకోటిలో శాస్ర్తీగారు వాడిన భాష, భావన అర్థం చేసికోవాలంటే ముందు వెనుకలు చూసుకుంటూ కథ చదువుకోవాల్సిందే! ఇందులో- తల్లెవరు? .. కూతురెవరు? ఆలోచించాల్సిందే!
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

సోమంచి రామం