వినమరుగైన

మల్లాది రామకృష్ణశాస్ర్తీ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషన్నవాడికి ప్రేమించడం చేతకావాలని, అలా చేతగాని దద్దమ్మలంటే ఆయనకంత అక్కసని తెలుస్తుంది.
శాస్ర్తీగారి కథల్లో సంభాషణలన్నీ చతుర సంభాషణలే! పదాల విరుపులు అతి రమ్యంగా ఉంటాయి. ఖుదావంద్ కథలో ఈ సంభాషణ విందాం!
‘శకుంతల ఉలిక్కిపడి తల ఎత్తింది. ఏమిటని ఆ చూపులు నన్ను ప్రశ్నించింది. నేను అర్థం కానట్టు చూసీ చూడనట్లు ఊరుకోగా’
‘‘ఏమిటది?’’ అని పలికింది.
‘‘ఏం లేదు.. ఎక్కడ్నించో గాలివచ్చి-’’
‘‘నాలుగ్గోడల సందునా గాలి ఎట్లా విసురుతుంది?’’
‘‘విసరదు - మసలుతుంది!’’
‘‘మసలేగాలికి అంత అదరిపాటుతనం ఉండదు.’’
‘‘ఐదవతనంతోపాటు అదరిపాటుతనమూను.’’
‘‘ఐదు వరాలిచ్చిన ఆ ఐదవరాలి పేరేమిర?’’-అదీ సంగతి!
‘‘ఈ గోరంత గొప్పే మాకు ఎల్లకాలం చాలును’’ అంటూ ముగించిన గోరంత గొప్ప- కథలోని పాత్రలన్నీ రామకృష్ణశాస్ర్తీగారి ఊహాకల్పితాలు కావు.. ఆయన మనోవాంఛితాలు!
‘‘నన్ను తలచుకోరా అని పుటక యిచ్చాడు-నదులను సేవించరా అని ఈ దేహం ఇచ్చాడు’’ అని తలపోస్తూ, తన సంపాదనలో పొట్ట గడిచాక మిగిలినదంతా యితరులకిచ్చే రామాంజయ్య, ‘‘సీతమ్మ వారంతటి ఆడకూతురుకి అబద్ధమాడాలనిపించిందని, జైలుకెళ్లి వచ్చి, వాపోయే- పరోపకారి రంగడు, గోపాలస్వామి వౌనోపదేశంతో భక్తుడైపోయిన సాహేబు యిస్మాయిల్- గోవుల్ని కంటికి రెప్పలా చూచుకునే కోమటి సుబ్బయ్య-
సాధువిచ్చిన విభూతి ప్రసాదంతో వాడలోని చినదానికి జన్మించి, పెరిగి పెద్దదై, జ్ఞానాంబగా మారిన పిల్ల.
వీళ్లందర్నీ చూస్తుంటే-ఇంత మంచితనమున్నవాళ్లు ఆ ఊళ్లో ఉంటే-యింకా ఊరికేం కావాలి?
ఏ కులం వారైతేనేం-ఏ మతం వారైతేనేం-మంచితనమున్న మనుషులే ముఖ్యమని చాటిచెప్పే గోరంత గొప్ప కథ కొండంత నీతిని చెప్తోంది.
రామకృష్ణశాస్ర్తీగారి కథలకు- పాత్రలకు కులమత భేదాల వాసనలు గిట్టవు. శాస్ర్తీగార్కి, బందరుకు విడదీయలేని, విడదీయరాని అనుబంధముంది. బందరును విడిచివెళ్లినా, ఆయన మనసు బందరు చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.
అందుకే -బందరు గొడుగుపేటలో ఏటా జన్మాష్టమినాడు చమ్మకొడుతూ, దరవు అందుకొంటూ- ఉట్టికొట్టడం, గరుడకంబం చడ్డీ వేయడం- స్వామివారి వాహనం ఊరేగించడం- ఈ వింతలన్నీ పాటలతో సహా మన కళ్లముందు కలకాలం నిలిచేలా నిలిపిన కథ వినవేడుకగా చెప్పారు. అలాగే కనుమరుగైపోతున్న అలనాటి ముచ్చట్లు- పల్లె జీవనాలు- మనకు తెలియాలంటే ఆనందకాననం- లాంటి కథలు చదవాల్సిందే!
శాస్ర్తీగారి కథల నిండా విచిత్ర పదప్రయోగాలు, పదాలు దొర్లుతాయి. కాఫీ-సాయి, మన కారువాళ్లు, నెల మసలింది, ఉపధానం, ఉపానహృద్వయి, శే్వతకాష్టం యిత్యాదులు.
కథల శీర్షికలూ అలాగే ఉంటాయి. ఛాందోగ్యం, దోదమ్మి, పంచసాయకం, తార్కికరక్ష.. శాస్ర్తీగార్కి పదక్రీడలంటే వల్లమాలిన అభిమానం.
అమ్మక చెల్ల నా మనసమ్మక చెల్లదు
రకానికో కోరకాన్ని గికురించు
సకి మోము గ -నాలేని-నా..
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పవచ్చు!
అందుకే ఆయన కథలు ఆ తరం వాళ్లకు అమృతోపమానాలు. అత్యంత ఆదరణీయాలు. అద్భుత స్వప్నాలు. ఆరాధనీయాలు. సాగర గర్భంలో ఆణిముత్యాల సరసన ఆలిచిప్పలూ స్థావర మేర్పరచుకుంటాయి. కాని శాస్ర్తీగారి కథా సాగరంలో ఆలిచిప్పలుండే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఏ కథ కా కథ ఓ ప్రత్యేకతను సంతరించుకునే ఆణిముత్యమే!
అందుకే ఆయన కథలు ఆనాటికీ, ఈనాటికీ, ఏనాటికీ పఠనీయాలు, స్మరణీయాలు, కలకాలం పదిలపర్చుకోవాల్సిన సాహితీ కవనాలు, సాహితీ మంజీరాలు.
*
-సమాప్తం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సోమంచి రామం