వినమరుగైన

మా గోఖలే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వు పల్లెటూళ్లో బీళ్లమ్మట, గట్లెమ్మటా గొడ్లు గాసుకునే బుడ్డోడివైతే, ఆరుదల చేలో కలుపుదీసే కూలీవైతే, దీపాల మాసరాత్రి మసి పువ్వొత్తి చేతబట్టి జుయ్‌మంటూ వీధులమ్మట పరిగెత్తే పిలగాడివైతే, తొలి కోడి కూయంగానే ఎడ్లబండి గట్టుకొని డొంక దారినబడి కుప్ప నూర్పిడికి బయలెల్లిన రైతువైతే, అన్నిటినీమించి నీవూరి నేలని గట్టిగా గుండెకి వాటేసుకోగలిగిన ప్రేమికుడివైతే మా గోఖలే కథలు చదివి పరవశించిపోతావు
మా గోఖలే అని అందరూ ఆత్మీయంగా పిల్చుకొన్న మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరులో 7-3-1917 నాడు పుట్టడం, 4-10-1981నాడు చనిపోవడం యాదృచ్ఛిక సంఘటన అయితే 1940-60 మధ్యకాలంలోని గుంటూరు ప్రాంతపు గ్రామీణ జీవితంలోని వెలుగునీడల్ని కమనీయ కథా ఖండాలుగా మలచటం విలక్షణ సంఘటన.
బహుశా రెండు సంగతులు మా గోఖలే జీవితాన్ని ప్రభావితం చేసి వుండాలి. ఒకటి-తండ్రి ద్వారా సంక్రమించిన గాంధీయ భావజాలం, అందులో ముఖ్యంగా దీనజనోద్ధరణ, గ్రామ పునర్నిర్మాణం. రెండోది- వామపక్ష భావజాలం. అందులో ముఖ్యంగా పీడిత పక్షపాతం. ఈ రెండు ప్రభావాలతోపాటు గోఖలే అచ్చమైన అభ్యుదయ రచయితగా రూపొందడానికి అతని బాబాయి గొప్ప రచయిత అయిన కొడవటిగంటి కుటుంబరావు మార్గదర్శకత్వం కూడా తోడయ్యింది. అభ్యుదయ రచయితల సంఘంలో విశేష కృషి చేశాడు మా గోఖలే.
మా గోఖలే బతుకు బొమ్మకి బహుముఖాలున్నాయి. పుట్టిందేమో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో. తండ్రి అడుగుజాడల్లో నడిచి భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు. మద్రాసులో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో ప్రసిద్ధ చిత్రకారుడు దేవీప్రసాద్ రాయ్ చౌదరి దగ్గర చిత్రకళ లోతుగా నేర్చుకున్నాడు. బ్రహ్మనాయుడు, పావురాలు, అగ్నిపరీక్ష మొదలైన గొప్ప చిత్రాలు రచించాడు. ముఖ్యంగా తన ముందు ఒరలో కత్తి, డాలుతో ఆలోచనా నిమగ్నుడై కూర్చున్న బ్రహ్మనాయుడి మట్టిరంగుల బొమ్మ చాలా విలువైంది. 1949 ఆగస్టు ఒకటో తేదీ నాటి విశాలాంధ్ర పక్షపత్రికలో కృష్ణా జిల్లా కాటూరు, ఎలమర్రు గ్రామాల్లో పోలీసుల పైశాచిక కృత్యాలపై శ్రీశ్రీ, ఆరుద్ర, కొ.కు, తాపీ ధర్మారావు, గోపీచంద్, మల్లాది రామకృష్ణశాస్ర్తీ, సెట్టి ఈశ్వరరావు, మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే తమ నిరసన తెలిపారు. దాంతోపాటు మా గోఖలే వేసిన ఒక రేఖా చిత్రం- పోలీసులు ఆ గ్రామ ప్రజల్ని దిగంబరుల్ని చేసి గాంధీ విగ్రహానికి ప్రదక్షిణ చేయించిన దృశ్యం- ప్రభుత్వం కనె్నర్రకు గురి అయింది. ఇంకా ఆంధ్రప్రత్రిక, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, చందమామ మొదలైన పత్రికల్లో చిత్రకారుడుగా పనిచేశాడు మా గోఖలే. ఉత్తమ ప్రమాణాలతో పత్రికా రచన కూడా చేశాడు.
సినిమా రంగంలో కళాదర్శకుడుగా కూడా రాణించాడు మా గోఖలే. ముఖ్యంగా విజయా సంస్థకు అతను ఆస్థాన కళాదర్శకుడు. పాతాళభైరవి, మాయాబజార్ సినిమాల్లో సెట్స్ చూసినవాళ్లకు అతని నైపుణ్యం అర్థమవుతుంది. ఎబ్బెట్టుతనం లేకుండా, విభ్రాంతి పరచకుండా కథాకాలంలో నిన్నూ, నన్నూ లీనం చెయ్యగలగటమే ఆ నైపుణ్యం. అది ఏభై చిత్రాలకు పైనే వ్యాపించింది.
1940 ప్రాంతం నుంచి సుమారు రెండు దశాబ్దాలు మా గోఖలే రచనల కాలం. అతని తొలి కథా సంపుటి మూగజీవాలు యువ ప్రచురణగా 1946లో వెలువడింది. రెండో కథా సంపుటి బల్లకట్టు పాపయ్య విశాలాంధ్ర ప్రచురణగా 1955లో వచ్చింది. ఇవిగాక మరికొన్ని కథలు కలుపుకొని మొత్తం ఏభై మా గోఖలే కథలు విశాలాంధ్ర ప్రచురణగా 1989లో వెలుగుచూశాయి. ఇంకా స్మరణ (1941) కిష్టయ్య పంతులు (1954) వంటి కథలు విడిగానే మిగిలిపోయాయి. కిష్టయ్య పంతులు ‘విస్మృత కథ’ సంకలనంలో (సం. పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, వల్లూరి శివప్రసాద్, 1955) చేరింది.
-సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

పాపినేని శివశంకర్