వినమరుగైన

దీపావళి -వేదుల సత్యనారాయణ శాస్ర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ నవవేణుదండ మిటువేటికి జెక్కెదవేల చిల్లులై
పో నొగిలింతువం చడలిపోయితి; వ్యర్థపు టూర్పుగాడ్పులన్
గానముగాగ మార్చుటకెగా యని యిప్పుడె నే గ్రహించితిం
గాని విశీర్ణమీ హృదయనాళమెటుల్ పలికింతువో ప్రభూ’’
అనేది అద్భుతమైన కవితాదీపం- ఈ కావ్యంలో. వెదురుకర్రకు చిల్లులు పెడుతూ ప్రభువు ఎందుకు పదే పదే చెబుతున్నాడో అతనికర్థం కాలేదు. అదేమైపోతుందోనని పిచ్చిగా భయపడిపోయాడు. కాని, తాను వట్టినే విడిచే శ్వాసను గానంగా మార్చడానికే అలా చిల్లులు చేశాడని ఆ తరువాత గ్రహించాడు. ఇక్కడెంతో జీవితం వుంది. భావ శిల్పికి- ఈ పద్యం పట్టం కట్టిందనే చెప్పాలి.
అవకాశాన్ని సద్వినియోగపర్చుకోకపోతే ఆ తరువాత కాలంలో ఆవేదన చెందవలసి వస్తుందనే దానికి ప్రతీకగా ముక్తావళి పద్యాలు నిలుస్తాయి. ఇక్కడ కూడ స్వామి ప్రణవదీపమై సాక్షాత్కరిస్తాడు.
‘‘ఈ మధుమాస శోభ గతియింపక పూర్వమె పూలతోటలో
కోమల పుష్పుముల్ వెదకి కోసి యమర్చిన ప్రేమాదామమున్
నామెడలోనె వేయుమనినా, వపుడొక్క సుమమ్మునైన నా
స్వామి! భవత్పదార్పణము సల్పగ లేనయితిన్ విమూఢతన్!’’
అనే పద్యం, సోమరుల నిర్లక్ష్యంపై ప్రబోధాస్త్రంగా ప్రయోగింపబడింది. కాలాన్ని కాపాడుకోమని సందేశం అందించింది.
తీరా జ్ఞానోదయమయ్యాక
‘‘.. ఇపుడల్లుచు గ్రుచ్చుచు నుంటినొక్క ము
క్తావళి నా పవిత్ర నయనాంబు కణోజ్వల వౌక్తికమ్ములన్’’
అంటాడా వ్యక్తి. ఇక్కడీ పంక్తుల్లో అంకితభావం వ్యక్తమవుతుంది. కన్నీటి బిందు సముదాయమే ముత్యాలమాలగా మారిందిక్కడ. ఇది ఆర్ద్భ్రీతమైన గొప్ప పరిణామమే! అయితే ఉపేక్షాభావం, అలసత్వం, ఎప్పుడూ పనికిరావనేది ఇక్కడ హెచ్చరికగా సమాజం గ్రహించాలి.
మనం కొన్ని కొన్ని పట్టించుకోం. కాని, అవే కొన్ని సందర్భాలలో గొప్ప దృశ్య కావ్యాలుగా మిగిలిపోతాయి. అటువంటిదే ప్రభాతగీతి. మంచు రాల్చిన కన్నీటి బిందువు వంగిన గరిక కొనలపై వ్రేలాడింది. దానిని సూర్యకిరణం ముద్దాడింది. ఇంకేముంది? ఏడు రంగులు ప్రతిఫలించాయి.
‘‘నరులుపేక్షించు తృణదళాంతర హిమాశ్రు
కణముపై లోక బాంధవు కరము సోకె..’’
అన్న కవితా కిరణాలు పెద్దవాళ్లలోనున్న చిన్న చూపుపై సూటిగా చురకలు తగిలిస్తాయి.
ఇంతటి ఉదాత్తమైన సాంఘిక దృష్టి వేదుల వారిలోనున్నది. కాబట్టే విద్యార్థులలో పేదవారికీ, హరిజనులకూ, ఇంత అన్నం పెట్టి, ఆశ్రయం కల్పించి విద్యాదానం చేయగలిగారు. అంతేకాదు, సంఘం ఉపేక్షించిన వితంతు కృష్ణవేణమ్మ వేదుల కాంతి హస్తం సోకి తిరిగి గృహిణిగా తిలకం దిద్దుకొంది. కన్న బిడ్డ కాకపోయినా గిడుగువారు కన్యాదానం చేయటం మరింత శోభించింది.
అపురూపమైన భావనలకు ఉయ్యాలలూపిన పద్యాలు ఈ దీపావళి నిండా గోచరిస్తాయి.

-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

-రసరాజు