వినమరుగైన

విలోమ కథలు నగ్నముని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెమ్మదిగా పులి సాహచర్యంతో ఈ దేశంలోని పెద్ద మనుష్యులకి, వ్యాపారస్తులకి కూడా ఆవుతలలు, పులి తోకలు నప్పాయి. ఎవరికీ అవి ఎబ్బెట్టుగా లేదు. అంచేత కథకుడు ఎవరన్నా మెడమీది మనిషి తలకాయ వున్నవాడు దొరుకుతాడేమో మాట్లాడదామని బయలుదేరడంతో కథ ముగుస్తుంది. వ్యాపార సంస్కృతిని ఈ కథ ఎద్దేవా చేస్తుంది.
లైకా-మజ్ను ప్రళయగాథ మన నాయకులు కుక్కమాదిరి విశ్వాసం చూపి చివరికి మొసళ్లుగా ఎలా మర్తారో వివరిస్తుంది. అదేవిధంగా గ్రహణం కథ మొదటిసారిగా అవయవాల వ్యాపారాన్ని నిరసించిన తెలుగు కథ.
శిశుహత్య కథలో పుట్టబోయే బిడ్డ ఆడపిల్లగా పుట్టాలో, మగపిల్లాడిగా పుట్టాలో తెలియని సందిగ్ధత పడుతుంది. అందుకే తండ్రిని ఇలా అడుగుతుంది. ‘ఆడపిల్లగా వొస్తే నువ్వు నాకు పెళ్లి చేయలేవు. ఎవడితోనో లేచిపోవాలి. వాడింక చాలామందితో చాలా రకాలుగా లేచిపోయేట్లు చేస్తాడు. చివరికి ఆత్మహత్య తప్ప మరో దారుండదు. పోనీ మగ పిల్లాడిగా పుడదామా అంటే, కట్నం తీసుకొని నా మెడకు కాడిగట్టి, రుూ ఆడసంతునీ, నీ అప్పుల్ని నా నెత్తిమీద రుద్ది నువ్వు పైకి తప్పకుంటావు. అప్పుడు కూడా ఆత్మహత్య తప్ప యింకోదారి కనపడదు’’ అని సంశయాన్ని ప్రకటించి తల్లి కడుపులోనే శెలవు తీసుకుంటుంది.
ఇదే పరిస్థితి ఈనాడూ సాగుతుంది. స్కానింగ్‌లో ఆడపిల్ల అని తెలియగానే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. పోనీ బతికించుకుని బతుకు వెళ్లదీయాలనుకుంటే అప్పుల బాధ, సామాజిక బాధల్తో, సతమతమై రైతులు, గృహిణులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సంఘంమీద సామాన్యుడు తిరుగుబాటు ప్రకటించి చేసే తలకిందులు విలోమ ప్రయాణామే ఈ ఆత్మహత్యలన్నీ. సమాజంలో విలువలు ఎంత తలకిందులుగా వున్నాయో శిశుహత్య కథ నిరూపిస్తుంది.
నగ్నముని విలోమ కథల్లోకెల్లా అత్యుత్తమమైన కథ- సిమెంటు సంతతి. ఈ కథ కూడా వయసొచ్చిన ఆడపిల్లలు ఎలా మోసపోతారో, సమాజం కూడా వాళ్లని ఎలా మోసపుచ్చుతుందో చెప్పటమేకాక- ‘‘రాజకీయ నాయకులు చచ్చి విగ్రహాలుగా మారి కూడా ప్రజల భవిష్యత్తుని చేతుల్లోకి తీసుకొని, తమ సంతతిని పెంచుకుంటూనే వుంటారని తెలియజేస్తుంది.
సిమెంటు సంతతి అత్యద్భుతమైన విలోమ కథ, ఈ విధంగా సాగిన విలోమ కథలు శైలి రీత్యానే కాక వస్తు రీత్యా కూడా ప్రథమ శ్రేణి కథలుగా నిలబడ్తాయి.
చివరగా ఈ కథలు గురించి సోమసుసందర్‌గారు, నగ్నముని విలోమ కథలు ఆధునిక కథా సాహిత్యంలో నిస్సందేహంగా అవి స్మరణీయమైనవి. అతనెన్నుకున్న కథా వస్తువులు, కథా సంవిధానమూ అనిందపూర్వకమైనవి. ఆ కథల్లోని కొన్ని సన్నివేశాలు నాకు తరచు జ్ఞాపకం వస్తాయి’’ అని నాకు రాసిన ఒక లేఖలో మెచ్చుకుంటారు.
మంచి కథకి కొండగుర్తు జ్ఞాపకానికి నిలబడటమే. పది కాలాలపాటు జ్ఞాపకం వుండే కథలు ఈ నగ్నముని విలోమ కథలు.

- సమాప్తం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

శ్రీరామకవచం సాగర్