వినమరుగైన

అమరావతికథలు -శంకరమంచి సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదివరకు అమరావతి పేరు వినగానే అందరికీ అపురూప శిల్పాలు జ్ఞాపకం వచ్చేవి. 1980 తర్వాత అమరావతి పేరు వింటే సాహిత్య పాఠకులకు సత్యం శంకరమంచి పేరు జ్ఞాపకం రావటం మొదలైంది. అతను ఆకాశవాణిలో నాటక రచయిత, ప్రయోక్త, కథకుడు, అప్రకటిత కవి, కాల్పనికుడు, మనస్వి, అతి సున్నితమైన స్పందనలు గలవాడు. లోలోపల ఎంత మాట్లాడుకుంటాడో బయటకు అంత మితభాషి కూడా అనుకుంటా. నేను చెపుతున్న ఈ గుణగణాలన్నీ అతని ప్రాపంచిక వ్యక్తిత్వం గురించి కాదు. అతని కథలలో నాకు కనిపించిన మూర్తినే చెపుతున్నాను.
అమరావతి కథలో తన స్వంతవూరి సాంఘిక జీవితంతోపాటు, తాను తిరిగిన మట్టివాసన, తన జన్మవాసన గూడా పెనవేసుకొని ఉన్నాయి. గతానుభవాల అందమైన సంస్మరణం ఈ కథలకు ప్రేరేపణ. అనుభవాలు అందమయినవి కాకపోయినా స్మరించుకోవటంలో ఒక పండిన సంతృప్తి ఉంటుంది. దానే్న నాష్టాల్జియా అంటారు. ఆమోదించలేని వాటితోగూడ మనసు పారవశ్యం పొందటం- అదొక మంచి మూడ్.
అమరావతి కథలు సత్యంగారి సాహిత్య సృష్టిలో పరమ దశను పొందినవి. చరమం గూడా అవ్వేనేమో! ఈ కథలకు ఒక 20 సంవత్సరాలకు ముందు కార్తీకదీపాలు కథాసంపుటి వచ్చింది. అందులో గూడా అమరావతి వాతావరణమే స్పష్టంగా కొంత, అస్పష్టంగా కొంత కనిపిస్తుంది. కథనంలో ఇంకా గడుసు పోకడలు అలవడలేదు.
అవి మిణుకు మిణుకుమనే కార్తీకదీపాలు. అయినా ఒక మంచి కథకుడు రూపుదిద్దుకుంటున్న జాడలు కన్పిస్తాయి. అదే కాల్పనిక శృతి. అదే శ్రవ్యనాటకీయత పొడకడతాయి.
- సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వావిలాల సుబ్బారావు