వినమరుగైన

అమరావతికథలు.. శంకరమంచి సత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావ్యాలలో నాటకీయతను గురించి తరచుగా విమర్శకులు చెపుతుంటారు. ఆ నాటకీయతకన్నా శ్రవ్య నాటకీయత ఇంకొంచెం భిన్నం. రంగస్థల నాటకాల కంటే శ్రవ్య నాటకాలకు భిన్నమైన గుణాలు ఉంటాయి. రంగస్థల నాటకాలన్నీ రేడియో నాటకాలు కాలేవు. శ్రవ్య మాధ్యమానికి కావలసిన నాటక గుణాలు వేరు. అవి శంకరమంచి వారి అమరావతి కథలలో కనిపిస్తాయి- అతనే వ్రాసిన హరహర మహదేవ రేడియో నాటకం చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది.
అమరావతి కథలలోని పాత్రలు ముప్పాతిక భాగం నిజమైన వ్యక్తులే. వాస్తవ వ్యక్తులను వాస్తవ సంఘటనలను తీసుకొని పాత్రలను అటూ ఇటూగా కొంత మార్చి స్వంత కాల్పనికతను, సంస్మరణ మాధుర్యంతో కొత్తరకం తివాచీ అల్లాడు శంకరమంచి. ఏ కొంత అయినా వాస్తవికాధారం లేని కథ అమరావతి కథాశతకంలోనే లేనే లేదేమో!
అమరావతిలో తప్ప జరగటానికి వీలులేని కథలు కొన్ని ఉన్నాయి. ఎక్కడయినా జరగటానికి వీలుండి అమరావతిలో గూడా జరిగిన కథలు కొన్ని. అమరావతి గుర్తులు ఏమీ లేని కథలు కూడా మూడో నాలుగో ఉన్నాయి. అక్కడి కృష్ణానది, అమరేశ్వరాలయం, పూజారివీధి, పురాణంబండ, వేంకటాద్రినాయుడు, దీపాలదినె్న, నదిలో రాతిచట్టు, మెట్లరేవు, లంకలు- ఇవన్నీ కథల్లో పదే పదే పునరావృతం అవుతాయి- దాంతో పాఠకుడు గూడా అమరావతి పౌరుడు అయిపోతాడు. ఒకవేళ ఆ పాఠకుడు ఎపుడయినా నిజంగా అమరావతి వస్తే, ఇదంతా ఎపుడో కలలో చూచిన ఊరులాగా, పూర్వ పరిచితంగా అనిపించవచ్చు. స్థానిక వాతావరణ చిత్రణం ఈ కథలంత బలంగా మరొకచోట చదవలేడు.
నూటొక్క అమరావతి కథలలో చదివిన కథను మరొకరికి తిరిగి చెప్పగలిగినవి చాలా కొద్దిగానే దొరుకుతాయి. తిరిగి మరొకరికి చెప్పగలిగిందే కథ. ఏమీ చెప్పలేక అనుభవంలోకో ఆలోచనలలోకో జార్చేది కవిత- అని నేనొక సమంజసమైన హద్దునే గీచుకున్నాను. అమరావతి కథలలో ఎక్కువ భాగం ఈ హద్దుకు అటొక కాలు, ఇటొక కాలు వేసి నుంచుంటాయి. అందుకనే వీటిని భావకవిత్వంలాంటి లిరికల్ కథలు అనుకుంటాను. వీటిలో సౌకుమార్యం ఉన్నంతగా కథా సంఘర్షణ ఉండదు. కార్యకారణ పురోగమనం గతి సన్నివేశాలతో నిర్దిష్ట పర్యవసాసానికి చేరకపోయినా ఆకట్టుకొనే కథలు కూడా వున్నాయి. పుస్తకం చదవటం అంతా ముగిసిన తర్వాత కవిగా కావలసిన రచయిత ఎందుకో కథకుడయినాడనిపిస్తుంది. అతని చేతిలో కథలు కవితా కథలయినాయి- అంటే కవిత్వంలో కథలు వ్రాయటం కాదు. కథలనే కవిత్వంలాగా భావించటం శంకరమంచి కథా లక్షణం.

-సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వావిలాల సుబ్బారావు