వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాలపు జీవితం చిన్న పరిధిలో చాలా శక్తివంతంగా ఎదిగినట్లు వుంటుంది.అది చాలా గొప్ప టెక్నిక్. కేవలం కొందరు మేధావులకే సాధ్యమయ్యే టెక్నిక్.
దీనివల్ల రచయిత ఎన్నో విషయాలు ఆ చిన్న పరిధిలోనే చెప్పగలుగుతాడు. అయినా కథారూపం చెడకుండా వుంటుంది.
వాసనలేని పూవులు మరో గొప్ప కథ. ఇందులోని నాయకుడు రాజారావు చిత్రమైన మనస్తత్వంగల మనిషి. తానేమిటో తాను తెలుసుకోలేని స్థితిలో వుంటాడు. అతనికి పెళ్లవుతుంది. భార్య కమల.
ఆమె రోజూ ఆ యింటి తోటలో పూచే ఎర్రటి పూలు తల్లో పెట్టుకుంటూ వుంటుంది. ఆ పువ్వులు అందంగా వుంటాయి. కాని వాటికి ఏ వాసనా వుండదు. కేవలం అందం తప్ప సువాసన లేని ఆ పువ్వులు అతనికి చికాకు కలిగిస్తూ వుంటాయి. మర్నాడు ఉదయం వాడి పడి వున్న ఆ పువ్వులు మరింత వెక్కిరిస్తూ వుంటాయి.
కమల చాలా అందగత్తె. చక్కని శరీర సౌష్టవం గలది. ఆమెనతడు ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నాడు. కాని ఆ ప్రేమని ప్రేమగానే వుంచుకోగలుగుతున్నాడు గాని శారీకరంగా దగ్గరకు రాలేకపోతున్నాడు. కారణం ప్రేమను శారీరకానుభవంతో కించపరుస్తున్నానన్న ఉద్దేశ్యమా? అంటే ప్రేమని కించపర్చటమా? ఆ రెంటికీ సమన్వయం కుదరదా? అతనికి తెలియదు. అర్థం కావటంలేదు.
ఈ సంఘర్షణలోంచి అతన్లోంచి కవితావేదం పుట్టుకువచ్చింది. వాసనలేని పువ్వులు అన్న గేయం రాశారు. అది అందరకూ నచ్చింది. అతన్లో గొప్ప కవిదాగుని వున్నాడన్నారు. ప్రోత్సహించాడు.
చాలా తక్కువ వ్యవధిలో ఎన్నో గేయాలు రాశాడు. అతనికి కవిగా మంచి పేరొచ్చింది.
కమల తనకు శారీరకంగా జరుగుతూన్న అన్యాయానికి తట్టుకోలేకపోతుంది. ఫలితంగా ఆమెకు మూర్ఛలు వస్తుంటాయి.
ఆత్మహత్యే చేసుకున్నదో, మూర్ఛ వచ్చి తెలియలేదో బావిలో పడిపోయి చనిపోయింది.
అతన్లో సంఘర్షణ. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
-సశేషం

కొమ్మూరి వేణుగోపాలరావు