వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి అందరూ నిద్రలోకి జారుకోగా ముసలయ్య కోపం మరిచి రత్తి దగ్గరకు చేరటం..
ఈ సన్నివేశాలన్నీ చాలా హృద్యంగా చిత్రించారు. చేతికి చిక్కిన పిట్ట కథ కొంత చిలిపితనంతో, గడుసుదనంతో కూడినట్టిది. అందులో నాయకుడు ఓ నేరస్థుడి కోసం వెతుకుతూ, అతను రైల్లో పారిపోతున్నాడని తెలిసి వెంటాడి కూపేలో ఎక్కి ఆ కూపేలో తనను పేరు పెట్టి సంబోధించిన ప్రయాణికుడ్ని స్నేహితుడ్ని స్నేహితుడిగా భావించటం, వారిద్దరిమధ్యా చతురమైన సంభాషణ, చివరకు అతను తప్పించుకుని పారిపోయాక అతనే నేరస్థుడని తెలుసుకుని, తన అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి ఆ తప్పిదాన్ని యింకొకరి మీద రుద్దటానికి ప్రయత్నించటం.. చాలా చమత్కారంగా చిత్రీకరించబడింది.
ఇహ...
హెడ్‌మాస్టర్ ఓ విశిష్టమైన కథ. ఈ కథ గురించి కొంత ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరముంది.
అద్భుతమైన టెక్నిక్. కథ నడిపే విధానం- యివన్నీ మేళవించి, రుూ కథను ఉత్తమ కథగా తీర్చిదిద్దాయి.
ఈ కథలో నాయకుడు రావు ఓ పైలెట్. అతని భార్య కమల. చిన్నప్పుడెప్పుడో చదువుకున్న స్కూల్ హెడ్‌మాస్టర్ చనిపోయారన్న టెలిగ్రాం రావటంతో కథ మొదలవుతుంది.
ఆయనగారి జ్ఞాపకాలు పైలెట్‌గా రావు జీవితంలోని కొన్ని సంఘటనల జ్ఞాపకాలు రుూ రెండింటి కలయికతో కథ సాగిపోతూ వుంటుంది.
రావు.. అతని సీనియర్ పైలెట్ రూంగ్తా ఓసారి విమానం నడుపుతూంటారు. విమానంలో ఎనభై మంది ప్రయాణీకులుంటారు. ఒక ఇంజెన్ చెడిపోయి విమానం అదుపు తప్పుతుంది. రావు ఎంత హెచ్చరిస్తున్నా వినకుండా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో రూంగ్తా విమానం పోనిస్తూ కొన్నిక్షణాలలో విమానానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకొస్తాడు. ఎయిర్‌హోస్టెస్ తీవ్ర భయ విహ్వలురాలవుతుంది.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
-సశేషం

కొమ్మూరి వేణుగోపాలరావు