వినమరుగైన

గాలివాన- పాలగుమ్మి పద్మరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తప్పును తెలుసుకోవడమే కాకుండా దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరునిగా తయారవటానికి అవకాశమిచ్చినట్లవుతుందనీ వాళ్లకి నచ్చజెప్పి ఒప్పిస్తాడు హెడ్‌మాస్టర్. అంతే.. ఆ క్షణం నుంచీ రావు జీవితంతో గొప్ప మార్పు వస్తుంది.
భార్య కమలతో సహా హెడ్‌మాస్టర్ అంత్యక్రియలకు హాజరయి, ఆయనగారి కొడుకు సకాలంలో అక్కడికి చేరుకోలేడని తెలుసుకుని, ఆయన భార్య అనుమతితో తానే అంత్యక్రియలు జరిపిస్తాడు.
ఇదీ కథ. ఇరవై ముప్ఫయి పేజీల కథలో ఇంత విస్తృతమైన పరిధిని ఇమిడ్చి అటు సాంకేతికంగా, యిటు వృత్తిపరంగా కథ నడిపించుకుంటూ రావడం ఎంత కష్టమైన సాధన! ఎంతో పరిణతి, అవగాహన, తపన వున్న రచయిత మాత్రమే రుూ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడు.
ఈ కథలో క్రమశిక్షణపై గొప్ప సందేశముంది. ఎక్కడా విసుగు కలిగించకుండా ఎన్నో సంఘటనలు ఎక్కడికక్కడ పొదిగి వున్నాయి.
ఈ సంపుటిలో యింకా కొన్ని కథలున్నాయి. సమయ భావంవల్ల అన్నిటి గురించీ విడమర్చిరాయటం సాధ్యం కాదు. కాని వేటికవే ఓ ప్రత్యేకత, వైవిధ్యంతో కూడిన కనం, గొప్ప సందేశం- యివన్నీ సంతరించుకుని వున్నాయి.
గాలివాన కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతిని పొందింది.
పద్మరాజుగారి కథలో..
మానవ బలహీనతల్ని ఎలుగెత్తిచాటే కళాత్మకమైన సందేశముంటుంది. ఓ ధర్మం వుంటుంది. ధర్మం అంటే ఏమిటి?
సాహిత్యానికి ఓ ధర్మం. కథను ఎన్నుకోవటంలో పాత్రల్ని నడిపించడంలో అంతర్లీనంగా ప్రవహించే కథనంలో, దాన్ని నడిపించే తీరులో.. చెడు వైపు దారి తియ్యకుండా, మంచి భావనను, ప్రేమతత్వాన్ని మరిపించే రచయిత చేసే మథనం.
పర్‌వర్షన్ అనేది ఓ చెడును చెప్పటానికి సృష్టించబడిన పాత్రల తీరుతెన్నులలో వుండవచ్చు. అంటే ఆ పరవర్షన్ ఎంత చెడ్డదో పాఠకులకు అర్థమయ్యే తీరులో వుండాలి. అంతేగాని కథలో వుండకూడదు.
పద్మరాజుగారిలో అలా మలచగలిగే పరిపక్వత వుంది. ఉత్తమ రచయిత కావటానికి-ఏది చెప్పాలో నిర్ణయించుకోవటంకాదు, ఏది చెప్పకూడదో నిర్దేశించుకోవటం.
పద్మరాజు గారిలో అటువంటి నియంత్రణవుంది. కొందరికి భాష వుంటే భావం వుండదు. భావం వుంటే భాష వుండదు.
పద్మరాజు గారిలో రుూ రెండు తేజస్సులూ పుష్కలంగా ఉన్నాయి.
కొందరు కేవలం రచయితలుగానే వుంటారు. కొందరు కేవలం కవులుగానే వుంటారు. ఒక దాంట్లోంచి రెండో దాంట్లోకి వేలు పెట్టడానికి ప్రయత్నించినా అది చాదస్తంగానే వుంటుంది కాని సఫలీకృతులు కాలేరు.
పద్మరాజు గారిలో కవితాశక్తివుంది. బహుశా కృష్ణశాస్ర్తీగారి ప్రభావం ఆయనమీద వుండటం కారణమై వుండవచ్చు.అందుకనే అయి వుండవచ్చు చిన్నచిన్న వర్ణనలు చేసేటపుడు, వాక్యాలను విరిచేటపుడు ఆ కవితా ధోరణి కనిపిస్తుంది.
కాని..
అది కథను మ్రింగివేసేలా వుండదు. అందులో వొదిగి, సొగసుగా పొదగబడి యింకా శక్తివంతం చేసేలా వుంటుంది.
శృంగారాన్ని కూడా అసభ్యతకు తావులేకుండా మనసులను స్పందింపచేసేలా చెప్పగలరాయన.
ఇన్ని ఉన్నత ప్రమాణాలున్న కథా సంపుటి కాబట్టే -గాలివాన ఉత్తమ గ్రంథమయింది.
సామాన్య పాఠకుడి దగ్గర్నుంచీ మేధావి వరకు అందరూ చదవతగ్గ గ్రంథమే కాకుండా చదివి ఎంతో నేర్చుకోవలసిన గొప్ప కథా గ్రంథం. రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సమాప్తం

కొమ్మూరి వేణుగోపాలరావు