వినమరుగైన

అత్త గారి కథలు( భానుమతీ రామకృష్ణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితలు 20 శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. శాశ్వతమైన రచనలు చేశారు. నాలుగు కాలాలపాటు నిలిచిపోగల పాత్రలను కల్పించారు.
ఈ సమయంలోనే ఎన్నో మంచి రచనలు తెనుగు భాషలో ఉద్భువించాయి. కథలు - నవలలలు- నాటకాలు - నాటికలు - విమర్శలు -వ్యాఖ్యానాలు- కవితలు - కావ్యాలు- అనువాదాలు రుూ సాహిత్య ప్రక్రియలు అన్నింటిలోను మన కవులు - రచయితలు పండితులు ఎంతో కృషి చేశారు.
రచయితలు ఆంధ్రదేశంలో వచనరచనకు పెద్దపీట వేశారు. అన్ని రసాలను సమదృష్టితో చూసినా వాటిలో రచనలు చేసినా- శృంగారానికి, ప్రేమకు సాహిత్యంలో ప్రముఖ స్థానం లభించింది.
ఎందుకనోగాని రుూకాలం రచయితలు హాస్యాన్ని ఆనందించారే కాని, హాస్య రచనల విషయంలో అంత చొరవ చూపించలేదు-కారణం బహుశః హాస్య ప్రధానమైన రచనలు శృంగారం- విషాద రసాలను పోషించినంత తేలి కాదని భావించి ఉండవచ్చును.
లేదా పూర్తిగా హాస్యరస ప్రధానమైన రచన అంటే పాత్రలు- సన్నివేశాలు సంభాషణలు- ఆహార్యము, ఇవన్నీ కూడా ఒకే రసంతో పోషించడం- కష్టసాధ్యమైనని- సులభతరమైనది కాదని భావించారేమో. తెలుగు సాహిత్యంలో హాస్య సాహిత్యం- రాశి తక్కువైనా- మంచి వాసిగల రచనలే వచ్చాయి.
హాస్య రచనలు చేసినమహాకవులు చాలామంది రుూనాడు మన మధ్య లేకపయినా వారు సృష్టించిన పాత్రలు చిరంజీవులై మన సమాజంలో సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని పొందారు.
ఆంధ్రదేశంలో హాస్య రచనలు కూడా చేసిన రచయితలు నిష్ణాతులు, ఉద్దండులు. హాస్య రసంలోని అన్ని శాఖలలో అంటే వ్యంగ్యం, చమత్కరం-శే్లష-పారడి-హేళన -వెక్కిరంతలో చాలమంది రచనలు వచ్చాయి.
ఇరవైయ్యవ శతాబ్దంలో తెలుగులో హాస్య రచనలు అనగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తులు- పాత్రలు.
గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం కొండు బొట్టీయం-గిరీశం, కరటకశాస్ర్తీ.
పానుగంటివారి సాక్షి, కంఠాభరణంలలో జంఘాల శాస్ర్తీ
చిలకమర్తి వారి గణపతిలో గణపతి
మొక్కపాటి నరసింహశాస్ర్తీ గారి బారిష్టరు పార్వతీశంలో పార్వతీశం.
మునిమాణిక్యం నరసింహారావుగారి - కాంతం కథలలో కాంతం
భమిడిపాడి కామేశ్వరరావుగారి నాటకాలలో ఆండాళ్లు,
ముళ్లపూడి వెంకట రమణగారి బుడుగులో సీగాన పెసూనాంబ
పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి ఇల్లాలి ముచ్చట్లలో ... మల్లాది రామకృష్ణశాస్ర్తీ గారి నర్మగర్భితంలో ఇది మదరాసు.
జలసూత్రం రుక్మిణీనాథ శాస్ర్తీ ప్యారడీలు.
భానుమతీ రామకృష్ణగారి - అత్తగారి కథలలో అత్తగారు.
హాస్య రసాన్ని తన వ్యంగ్య చిత్రాల ద్వారా కేరికేచర్స్ ద్వారా శాశ్వతంగా చిత్రించిన బాపు.
పద్మశ్రీ భానుమతి రామకృష్ణగారు ప్రేక్షకులకు శ్రోతలకు పాఠకులకు సుపరిచితులు. జగమెరిగినవారికి కథా రచయిత్రిగా, సాహిత్య రంగంలో శాశ్వతమైన గౌరవస్థానం ఉంది. రచనా వ్యాసంగంలో ఒక కొత్త ఒరవడి పెట్టిన కీర్తి ఆవిడకు దక్కింది. హాస్య రచయిత్రిగా కీర్తిని ఆర్జించిన భానుమతిగారి కథలను మూడు రకాలుగా విభజించవచ్చును.
మనస్సుకుల్లాసాన్ని కలిగించేవి. ఆంతర్యంలో ఆలోచనలు రేకెత్తించేవి, బుద్ధికి పదును కలిగించేవి. హృదయాన్ని స్పందింపజేసేవి. ఈ కథలు మనకు ఐదు సంపుటాలలో లభ్యం అవుతున్నాయి. అత్తగారి కథలు పార్ట్ 1, అత్తగారి కథలు పార్ట్ 2, అత్తగారూ నక్సలైట్లూ, భానుమతి కథానికలు నెం.1, భానుమతి కథానికలు నెం.2.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
సశేషం