వినమరుగైన

అత్త గారి కథలు (భానుమతీ రామకృష్ణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోభిహృదయం, పతిత, జీవితంలోని అగాధాలు, శమంతకమణి- చారుశాస్ర్తీ- ఈ నాలుగు కథలు మన హృదయాన్ని దశదిశలా కదిలించివేస్తాయి. మనలోని మానవత్వాన్ని మేలుకొలుపుతాయి.
మెకానిక్, ఎందుకులెండి, పెద్ద ఆకారాలు చిన్న వికారాలు, వస్త్రాపహరణం, మరో ప్రపంచకం, కోరికలు కొరతలు, ఇరుగుపొరుగు, మావాడి లవ్ ఎఫైర్స్ వంటి కథలు మనని గురించి మనం ఆలోంచుకుని మనలో పాతకుపోయిన మూఢాచారాలని- అకారణ భయాలని, దుష్ట గుణాలను గుర్తించి మంచి దోవకు మళ్లించడానికి దోహదం చేస్తాయి.
చక్రపాణి రాజధాని, రాంగ్‌నెంబర్, త్రిశంకునరకం, వరసలు, రంభా చక్రపాణీయం, కృత్యాదవస్థ, గుభేళ్లు, చక్రపాణి ఇంద్రలోక యాత్ర- ఈ కథలు హాస్య ప్రధానమైన కథలు. హాస్యంతోపాటు రవ్వంత హేళన కూడా జోడించిన కథలు. సినిమా జీవులా-చిరంజీవులా అన్న రచన విషాదం, హాస్యం, చాదస్తం- ఇవన్నీ క్షీర నీర న్యాయంగా పడుగూ పేకగా కలిసిపోయిన చక్కటి ఊహాచిత్రం.
ఈ కథలు పాఠకుల మనస్సు రంజిల్లచేసిన మాట వాస్తవమే. ముముక్షువుల మనస్సుల్లో జిజ్ఞాస రేకెత్తించిన మాట నిజమే. కాని రచయిత్రిగా భానుమతిగారికి సాహిత్య లోకంలో శాశ్వత స్థానాన్ని, సాహిత్య అకాడమీ అవార్డును ఇప్పించిన వ్యక్తి భానుమతి అత్తగారి కథలలోని అత్తగారు. అపురూపమైన కోడలికి అరుదైన అత్తగారు ఆవిడ.
అత్తగారు అందరికీ ఉంటారు. మంచివారు, చెడ్డవారు, గయ్యాళివారు, కోపదారులు ఇలా రకరకాలుగా ఉంటారు. ఎక్కడో తప్ప సర్వసాధారణంగా అత్తాకోడళ్ళ మధ్య షష్టాష్టకంగా ఉంటుంది. కాని ఈ అత్తాకోడళ్ళ తరహాయే వేరు.
*
సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*

మల్లాది సూరిబాబు