వినమరుగైన

అత్త గారి కథలు (భానుమతీ రామకృష్ణ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక్కడ మనం ఒక్క విషయం మరిచిపోకూడదు. ఈ అత్తగారి కథలు.. నిజమైన వ్యక్తి యొక్క ఆత్మకథ కాదు. ఆవిడ జీవితంలో సంఘటనల రిపోర్టింగ్ కాదు.
మహాకవి లక్షణాలను గురించి చెబుతూ శ్రీ మాధవపెద్ది సుందర రామశాస్ర్తీగారు-
‘‘మోదములోన మోదమై పోదురు,
భేదములోన భేదమై పోదురు
యాహ్లాద వినోదముల్ కడు విలక్షణములు
కవులన్న- నిత్య సూర్యోదయ
మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్’’
ఈ లక్షణాలన్నీ భానుమతిగారిలో వున్నాయి. విశేష ప్రజ్ఞావంతురాలైన రుూ రచయిత్రి కథల్లో ప్రశంసనీయమైన విషయాలు ముఖ్యంగా మూడు. పాత్ర సృష్టి- అనుభవైకవేద్యమైన వాస్తవిక- సున్నితమైన హాస్యరసం.
మన సాహిత్యంలో వాస్తవికత అరుదు. పూర్వ సాహిత్యం, స్వానుభవం మీద కన్నా కవి సమయాలు లక్షణ సూత్రాలమీద ఆధారపడి నిర్మించబడి వాస్తవికతకు ప్రధాన స్థానం లేకపోవడం జరిగింది. పాత్రలు - మంచి చెడ్డ రుూ రెండు తరగతులకే చెందుతాయి.
పాశ్చాత్య సాహిత్య ప్రభావంవలన వాస్తవికత మీద రచయితకు అభిమానం కలిగినా అతను సృష్టించిన పాత్రలు కీలుబొమ్మలు. వాటిలో జీవగుణం ఉండదు.
ఇంకొక విషయం- భారతదేశంలో తత్త్వ జిజ్ఞాస మరీ ఎక్కువ అయిపోయిన కారణం చేతనో ఏమో కంటికి కనపడే వాస్తవిక మానవలోకంమీద తాత్పర్యం తక్కువ. భావనాలోకం మీద మోజు ఎక్కువ. మన దేశీయ సాహిత్యంలో మనుషులు కనపడ్డం అరుదు. కొన్ని ఊహలు - లక్ష్యాలు - విలువలు మనుషులు లాగా మాట్లాడుతాయి.
ఈ లోపాలు భానుమతి కథలలో కాని పాత్రలలో కాని మనకు కనిపించవు. ఎందుకంటే వీరి కథలలోని పాత్రలు యదార్థ జీవితానికి చెందడం చేత కృతకంగా వుండవు.
ఈ కథలలోని విశేషం ఇవి రెండు రాష్ట్రాలకు చెంది- అనేక సాంప్రదాయాలకు, ఆచారాలకు అలవాట్లకు భాషా ప్రయోగాలకు రంగస్థలంగా మన ఎదుట నిలవడం.
ఈ రంగస్థలంలో ముఖ్య పాత్రదారి హీరోయిన్ సూత్రధారుడు అన్నీ కూడా ఒకే ఒక వ్యక్తి ఆవిడే- అత్తగారు. విలక్షణ సమన్విత బహుముఖ ప్రజ్ఞాశాలి సర్వ విషయాజ్ఞాతా అని అనుకుని మనసా వాచా కర్మణా నమ్మే ఆ వ్యక్తి పుట్టిల్లు చంగల్పట్. మెట్టినిల్లు రాయలసీమ. పర్మనెంటు చిరునామా అరవ దేశంలోని మదరాసు.
సింహరాశిలో పుట్టడంవలన ఆ ఎస్టేట్, ఆ కుటుంబానికి యజమానురాలు ఆమే. ఎక్కడైనా ఎప్పుడైనా ఆవిడ మాట చెల్లవలసిందే. పసిపిల్లల మనస్తత్వం కలిగిన రుూ పెద్దమ్మ చాలా అదృష్టవంతురాలు.

సశేషం
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
*

మల్లాది సూరిబాబు