వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత శతవసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం- అంటే 1899లో రామలింగారెడ్డిగారు 20వ శతాబ్దంలో రాబోయే సాహిత్యానికి దారిచూపారు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారు రాసి ప్రచురించిన ముసలమ్మ మరణము తెలుగు కవిత్వంలోకి కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది. నూటికి నూరుపాళ్ళు ఆధునిక కావ్యం కాకపోయినా అది విషాదాంత కథనూ, ఆధునిక ఇతివృత్తాన్నీ తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. అదే సంవత్సరంలో రెడ్డిగారు మద్రాసు క్రైస్తవ కళాశాల ఆంధ్రభాషాభిరంజనీ సంఘంవారి సమావేశంలో కళాపూర్ణోదయాన్ని గురించి ఒక ఉపన్యాసాన్ని చదివారు. అది చిలకమర్తి లక్ష్మీ నరసింహం, వేదం వెంకటరాయశాస్ర్తీ, దర్భా సుబ్రహ్మణ్యం మొదలైన పండిత ప్రకాండుల మెప్పును పొందింది. ఇంగ్లండులో విద్యాభ్యాసం పూర్తిచేసుకొని తిరిగి వచ్చి, మైసూరులో ఆచార్య పదవిలో స్థిరపడ్డ తరువాత -అంటే 1914లో రామలింగారెడ్డిగారు దాన్ని విస్తృతపరిచి రాసి కవిత్వతత్త్వ విచారము అన్న పేరుతో ప్రచురించారు. ఆ గ్రంథం తెలుగు సాహిత్యాధ్యయనంలో కొత్త వెలుగును ప్రసరింపజేసింది.
19వ శతాబ్దం వరకూ తెలుగు సాహిత్యరంగంలో సాహిత్య విమర్శ లేదు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

వల్లంపాటి వెంకట సుబ్బయ్య