వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామలింగారెడ్డిగారు కవిత్వతత్త్వ విచారంలో ప్రధానంగా కవిత్వతత్త్వాన్ని గురించి చర్చించారు. మంచి కవిత్వం యొక్క లక్షణాలను చెప్పారు. విజయనగరం యుగం తరువాత తెలుగు కవిత్వం ఎందుకు పతనమైందో, ఎలా పతనమైందో చూపించారు. భారత కవుల్లోనూ, కళాపూర్ణోదయంలోనూ వున్న గొప్పదనాన్ని చూపించారు. గొప్ప కవిత్వ లక్షణాలుగా వారు భావించే కల్పనాశక్తికీ, కథా కథనానికీ, పాత్ర పోషణకూ, నాటకీయతకూ, అంగాక సమన్వయానికీ (యూనిటీ) కళాపూర్ణోదయం వారికి మంచి ఉదాహరణంగా కనిపించింది.
ఆ కావ్యాన్ని కూడా రామలింగారెడ్డి మినహాయింపులు లేకుండా మెచ్చుకోలేదు. ఆరవ ఆశ్వాసంలోని 189వ పద్యం వద్ద ఆ కావ్యాన్ని ఆపి ఉండవలసిందన్నారు. పింగళి సూరన్నగారు రాసిన ప్రభావతీ ప్రద్యుమ్నంలోని చవకబారు శృంగారాన్ని తీవ్రంగా విమర్శించారు.
రామలింగారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం కవిత్వానికి భావనాశక్తి ప్రాణం. ‘్భవనాశక్తి అంటే కావ్యంలోని విషయాలు పాఠకుని మనస్సులో ప్రతిబింబించేటట్టుగా, ప్రత్యక్షంగా అవతారమెత్టేటట్టుగా చేయగల శక్తి’’ అని వారే నిర్వచించారు.
వ్యాకరణమూ, యతిప్రాసలూ అన్నీ కుదిరినా భావనాశక్తి లేని పాండిత్యం జీవం లేని ఆకారంలాగా, జడంగా కనిపిస్తుందన్నారు. భావనాశక్తి లేని కావ్యాలను చదవటంవల్ల ‘నూనెరు సృష్టియేకాని కవితకు పుష్టిలేదు’ అన్నారు. ఆలోచనలూ, భావాలూ, సంకల్పాలూ మానవ ప్రకృతిలోని మూడు ప్రధానాంశాలుగా రామలింగారెడ్డి గారు గుర్తించారు. వీటిలో భావాలు భావనాశక్తిని విజృంభింప చేస్తాయనివారు భావించారు. భావాలు లేకుండా కొయ్యల్లాగానో, మహర్షుల్లాగానో నిర్వికారంగా ఉన్నవారు పద్యాలు రాయవచ్చునేమోకాని కవిత్వం రాయలేరన్నారు.
భారత కవుల తరువాత అలంకారికతే కవిత్వంగా చెలామణీ అయిందని రామలింగారెడ్డిగారు భావించారు. మితిమిరీన అలంకారికతకు కారణం భావశూన్యత మాత్రమేనని వారు తెగేసి చెప్పారు. తెలుగు కవుల్లో ఈ బలహీనత లేనివారు భారత కవులున్నారు. మన కవుల్లో ఎక్కువమంది పండితులు మాత్రమేననీ వారిలో కార్యోత్సాహమూ, భావప్రాబల్యమూ చాలా తక్కువన్నారు. అందుచేతనే వారిలో భావనాశక్తి తగినంతగా అభివృద్ధి చెందటానికి అవకాశం లేకుండా పోయిందని రామలింగారెడ్డిగారు కవిత్వతత్త్వ విచారములో గట్టిగా ప్రతిపాదించారు.

*
సశేషం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

వల్లంపాటి వెంకట సుబ్బయ్య