వినమరుగైన

కవిత్వతత్త్వ విచారం - కట్టమంచి రామలింగారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, అలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, అలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.
ప్రాచీన అలంకార శాస్త్రం మన దేశంలో కవుల ప్రతిభకు సంకెళ్ళు వేసిందనీ, సాహిత్యం విభిన్న మార్గాలలో, వికసించకుండా అడ్డుపడిందని రామలింగారెడ్డిగారి నిశ్చితాభిప్రాయం. నాయకులనూ, నాయికలనూ జాతులుగా విభజించిన అలంకార శాస్త్రాన్ని చాలామంది కవులు ‘అదే వేదమనుకొని, ప్రమాణమను పిచ్చిపట్టి’ మానవ స్వభావ చిత్రణను నిరాదరించారని రామలింగారెడ్డిగారి అభియోగం. వారు కావ్యాలో పాత్ర చిత్రణ సహజంగా ఉండాలన్నారు. పాత్రల మనస్సులలో కలిగే భావోద్రేకాలు చిత్రించాలన్నారు. పేడివారి తెగకు చెందిన మన వేదాంతులు మానవుల సహజ భావోద్రేకాలకు ‘మనోవికారా’లన్న పేరు పెట్టి నిరసించారని రామలింగారెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు.
మన సాహిత్యంలో అతి ఎక్కువగా ఉన్న పునరుక్తినీ, అతి తక్కువగా వున్న ఉపజ్ఞ (ఒరిజినాలిటీ)నూ మొదటిసారిగా తీవ్రంగా ఖండించినవారు రామలింగారెడ్డిగారే. సమకాలీన వాస్తవ జీవితాన్ని తిరస్కరించటమూ, అలంకార శాస్త్ర గ్రంథాల ఆధిపత్యాన్ని తెలిసో తెలియకో అంకీకరించటమూ, జీవితాన్ని గురించి వౌలికంగా ఆలోచించే సాహసం లేకపోవటమూ అందుకు ముఖ్య కారణాలని వారు చెప్పారు. శాస్త్రాలలో అంటే సైన్సులో ఒకరు ప్రతిపాదించిన విషయాన్ని మరొకరు గ్రహించవచ్చనీ, అది పునరుక్తి అనిపించుకోదనీ రామలింగారెడ్డిగారి అభిప్రాయం. కాని సాహిత్యంలాంటి కళ్లల్లో ఆ పద్ధతి పనికిరాదంటారు వారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వారు ‘ఏలనో మనకవులీనాటికీ రుక్మిణీ పరియణములూ, సుభద్ర పరిణయములూ వ్రాయుచుండిరి. వారు పెండ్లాడి పెండ్లాడి అలసిపోయి వున్నారు. వారికి ‘పింఛను’ ప్రసాదించకున్ననెంతయు ఘోరము’ అని తీవ్రంగా విమర్శించారు.
కావ్యంలో వస్తువూ, రూపమూ రెండూ ముఖ్యమేనని, కథకు సంబంధం లేని వర్ణనలు విసుగును కలిగిస్తాయనీ, నిర్మాణ సౌష్టవం లేని కావ్యం పాఠకుని తాకలేదనీ రామలింగారెడ్డిగారు చెప్పారు. లేదంటే ఆ చెప్పటం కాస్త విసురుగా చెప్పారు. తన సిద్ధాంతాలకు తగిన ఉదాహరణల్ని ఈ గ్రంథంలో చూపించారు.
కవిత్వతత్వ విచారం వచ్చిన కాలాన్ని (1914) దృష్టిలో ఉంచుకొని చూస్తే రామలింగారెడ్డిగారి అభిప్రాయాలు విప్లవాత్మకంగా ఉంటాయి. వారికి పూర్వం మన సాహిత్యాన్ని గురించి అంత వౌలికంగా ఆలోచించే సాహసాన్ని ఎవరూ చేయలేదు. కానీ ఆ తరువాత రామలింగారెడ్డిగారు అంతకంటే మరేమీ చేయలేకపోయారు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ఆరోజుల్లో విజృంభించి సాగుతుండేవి.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

సశేషం

వల్లంపాటి వెంకట సుబ్బయ్య