వినమరుగైన

నేటికాలపు కవిత్వం (అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్చల సందర్భంగా ఉమాకాన్తమ్‌గారు భారతీయ సాహిత్య శాస్ర్తియాంశాలనేకం, అనుభవ వివేచన పూర్వకంగా వివరించారు. పాశ్చాత్య వివేచకుల అభిప్రాయాలనూ పలుచోట్ల విస్తరించారు.
నిజానికి ఉమాకాన్తమ్‌గారు మొత్తం తెలుగు సాహిత్యాన్ని సమీక్షిస్తూ వాఙ్మయ భాష్యం రచించాలని ఒక పెద్ద ప్రణాళిక వేసుకొన్నారు. ఆ భాష్యంలో మొదటి ఖండం రచించినట్టుగా కూడా ఈ ప్రస్తుతం గ్రంథంలో అక్కడక్కడా సూచించారు. కాని మొత్తం రచించినట్టు కన్పించదు. సమకాలీన కవిత్వపు వత్తిడివల్ల ఆ భాష్య రచన ఆపి, వాఙ్మయ భాష్య పరిశిష్టంగా నేటి కాలపు కవిత్వం వెలువరించారు. కాని ఈ పరిశిష్టం కూడా పూర్తిగా రచించలేదు. ఈ పరిశిష్టాన్ని మూడు అధ్యాయాలుగా రచించాలనుకొన్నారు. మొదటి అధ్యాయం నేటి కాలపు కవిత్వం. రెండవది నేటి కాలపు కృతిరచన; మూడవది నేటి కాలపు విద్య. ఈ మూడింటికి సూత్రాలు రచించారు గానీ, భాష్యం రచించింది కేవలం మొదటి అధ్యాయానికి మాత్రమే ఇదే పెద్ద అధ్యాయం. ముప్ఫయి రెండు సూత్రాలతో, ముప్ఫయి నాలుగు అధికరణలతో విస్తృతమయిన అధ్యాయమిది. విమర్శకు వ్యాస రచనా ధోరణి బాగా అలవడి వ్యాపించిన కాలంలో ఉమాకాన్తమ్ గారు ఆధునికంగా ప్రవేశపెట్టిన భాష్య రచనావిధానం చాలా విలక్షణమయింది. ఖండాలూ, అధ్యాయాలూ, అధికరణాలూ, సూత్రాలూ, ఆక్షేపాలూ, తటస్థాక్షేపాలూ, ప్రతిపాదనలూ, పూర్వపక్షాలూ, సిద్ధాంతాలూ- ఈ పద్ధతిలో ఆయన భాష్య రచన సాగింది. భారతీయ భాష్యరచనా విధానంలో సరయిన పరిచయం ఉంటే, ఉమాకాన్తమ్‌గారి రచనా శైలిలో సౌలభ్యమూ, నిష్టురత్వమూ, తార్కిక ప్రౌఢి వంటివి అవగతమవుతాయి.
- సశేషం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య