వినమరుగైన

నేటికాలపు కవిత్వం (అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక విషయాన్ని ప్రతిపాదించి, దానికి సూచించి తాను మొదట ప్రతిపాదించిన అంశాన్ని సిద్ధాంతీకరించటం ఈ భాష్య విధానంలోని విశేషం. అయితే, ఆయన ప్రవేశపెట్టిన ఈ విలక్షణమయిన భాష్య పద్ధతిని ఆ తరువాత ఎవరూ అందుకోకపోవటం, లేదా అందుకోలేకపోవటం వల్ల ఆయన విధానం అద్వితీయంగానే ఉండిపోయింది.
ప్రణయ కవితా విచారణ నెపంగా ఆయన చేసిన రస విచారణ భారతీయ రస సిద్ధాంత ప్రస్థానంలో ఒక వినూత్నమయిన ప్రతిపాదన చేసింది. శృంగార, వీరరసాలు జగత్తు యొక్క సృష్టి స్థితుల దృష్ట్యా సాహిత్యంలో అతి ప్రధానమైనవి. అయితే వీటిని ఎట్లాపడితే అట్లా చిత్రించటం కాక, ఉదాత్తంగా చిత్రించినపుడే అవి మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. లోకానికి ఆదర్శంగా ఉండదగిన వ్యక్తుల విషయంగా చిత్రించినపుడే ఇవి ఉదాత్త రసాలవుతాయి. చరిత్ర హీనులయిన వ్యక్తుల విషయంగా చిత్రిస్తే అవి హీనమవుతాయి. కాగా, రస నిర్వహణలో ఉదాత్త నాయకత్వాన్ని ప్రతిపాదించి ఉమాకాన్తమ్‌గారు ప్రవేశపెట్టిన ఉదాత్త రసభావన రసప్రస్థానంలో జీవితం భూమికగా అత్యంత విలక్షణమయింది. రసాల ఉదాత్తత్వం అనుదాత్తత్వ విచారణ కేవలం ఉమాకాన్తోపజ్ఞకమే. ఇది ఆయన చేసిన సృజనాత్మక ప్రతిపాదన.
నిర్మాణాత్మకంగా ఆయనచేసిన మరొక ప్రతిపాదన మరింత విలక్షణమయింది. వస్తు స్వీకరణ, నిర్వహణలలో దేశీయత, ధర్మం అనే అంశాలను ఆయన కావ్య ప్రతిపాదికలుగా ప్రతిపాదించారు. పశుత్వాన్ని అణగద్రొక్కటానికే భారతీయ విజ్ఞానమంతా సర్వశక్తిని ఉపయోగిస్తున్నది అంటారాయన. కావ్యం ఆనందప్రదమనుకుంటే -శిల్పానికీ కళకు కూడా ఆనందమే పరమార్థమని ఒప్పుకొన్నా, అట్లాంటి ఆనందానికి వెనుక ధర్మం గుప్తంగా ఉంటూనే ఉందని ఆయన నిర్థారణ. ధర్మం అనంతరూపమైంది. కాగా, ధర్మ దృష్టి విరహితమయిన రచన కలిగించేది ఆనందం కాదనీ, కేవలం ఇంద్రియ తృప్తి కలిగించే తక్కువ రకపు సంతోషమని ఆయన నిశ్చయం. కాగా, కావ్య రచనకు దేశీయతను, ధర్మాన్ని పునాదిగా ప్రతిపాదించటం ఆధునిక సాహిత్య విమర్శ మార్గంలో ఏకైకంగా ఉమాకాంతంగారు చేసిన నిర్ణయమే. సాహిత్యాన్నీ, కవిత్వాది కళలనూ అప్పటివరకూ ఈ దృష్టితో విచారించి, నిర్థారించింది ఉమాకాన్తమ్ గారొక్కరే. ఆనందం ధర్మ వ్యవస్థితమని ఆయన సిద్ధాంతం. ధర్మభూమిక లేని సాహిత్యమూ, కవిత్వమూ, కళలూ ఏవీ కూడా జీవితాన్ని ఉదాత్తం, క్రియాశీలనం చేయజాలవని అనేకమయిన ఉపనిషత్తుల ద్వారా ఈ గ్రంథంలో ఉమాకాన్తమ్‌గారు నిర్థారించారు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఉమాకాన్తమ్‌గారి అనన్యమయిన అనుదానాలివి. ఇక్కడ ఒక చారిత్రకమైన అంశం గుర్తించవలసి ఉంది. ఉమాకాన్తమ్‌గారి నేటి కాలపు కవిత్వం వెలువడిన తరువాత ఏ ప్రసిద్ధ భావకవీ భావికవిత్వం రచించిన జాడ కన్పించదు. అంటే అక్కడితో భావ కవిత్వాధ్యాయం సమాప్తమయింది. ఆ తరువాత నాలుగదయిదేళ్లలో నవ్య సంప్రదాయ మార్గం, అభ్యుదయ కవితా మార్గం తెలుగు సాహిత్యంలో నెలకొన్నవి. ఈ చారిత్రకాంశాలే ఉమాకాన్తమ్‌గారి నేటి కాలపు కవిత్వం శక్తికీ, ప్రేరణకూ తార్కాణాలు కాగా-
మొదటనే చెప్పినట్టు తెలుగు సాహిత్య విమర్శను ఆరోగ్యకరమైన మలుపు తిప్పిన విమర్శ గ్రంథం అక్కిరాజు ఉమాకాన్తమ్‌గారి నేటి కాలపు కవిత్వం. అది ప్రతిపాదించిన విలువలు ఈనాటికీ శిరోధార్యమైనవే.

- సమాప్తం
*
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన -
శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

-కోవెల సంపత్కుమారాచార్య