వినమరుగైన

ఫిడేలు రాగాల డజన్ -పఠాభి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్యాల సంగతి అలా ఉంచితే ఈనాటి వచన కవితలో కనిపించే అంతర్లయ, భావలయ, ఊపు, విరుపు మొదలైన గుణాలేవీ ఈ కవితలలో కనిపించవు. గ్రాంధిక రూపాలు, వ్యవహారిక రూపాలు చెట్టాపట్టాల్ పట్టుకొని పోతుంటాయి. గ్రాంథిక భాషను ఎగతాళి చేయటానికే ఇలాంటి భాష వాడారు పఠాభి. ఫిడేలు రాగం అనే చివరి కవితలో అక్షరాలు రాయటంలో కూడా తిక్కవరపువారు కొంత తిక్క మనస్తత్వాన్ని ప్రదర్శించారు. అడ్డం తిరిగెన్ అవనీస్థలి అన్న చరణంలో అవనీస్థలిలోని అక్షరాలను అడ్డం తిప్పి ముద్రించారు. అలాగే తలక్రిందులైనది ధరణీతలమ్ము అనే చరణంలో ధరణీ తలమ్ము అక్షరాలను తిరగేసి ముద్రించారు. ప్రేమికులు అన్న పదాన్ని ఇంగ్లీషు భాషా వర్ణక్రమాన్ని అనుసరిస్తూ తెలుగులో పొల్లు అక్షరాలతో ముద్రించారు. వ్యక్తీకరణ వైచిత్రి మీద పఠాభికున్న మోజు ఎంత తీవ్రమైనదో ఈ ఉదాహరణలు నిరూపిస్తాయి. పఠాభిలోని ఈ చీకటి కోణాలను వదిలేసి తరువాత కవులకు మార్గదర్శకమైన మంచి లక్షణాలను పరిశీలించటం చాలా అవసరం.
తెలుగు కవిత్వంలో నగర జీవితాల చిత్రణ తొలిసారిగా ప్రవేశపెట్టింది పఠాభి. మన ప్రబంధాల్లో పురవర్ణన ఉండేది. మోడల్ని, వేశ్యల్ని నాలుగు వర్ణాలవార్ని వర్ణించే వారే కానీ సామాన్య జనుల జీవిత చిత్రణ వాటిల్లో కనిపించేది కాదు. పాశ్చాత్యుల నాగరికత ప్రభావంతో ఆధునిక విజ్ఞానం పెరిగిన కారణంగా మన దేశంలో నగర జీవితం యాంత్రికమైపోయింది. నగర ప్రజలు కాలానికి బానిసలైపోయారు. జాబిల్లి అనే కవితలో మద్రాసు నగరం మీద కనిపించే చంద్రుణ్ణి జనం పట్టించుకోలేదని చాలా కొత్తగా గమ్మత్తుగా వర్ణిస్తారు కవి.
‘‘తగిలింపబడి వున్నది జాబిల్లి
చయినా బజారు గగనములోన
ఏమారి గూడ నీవంక ఎవ్వరూ
కడగంటి చూపయిన పరపరోసీ శశీ
బస్తీల్లో ఉండేవాళ్ళు చందమామను సంవత్సరానికి ఒకసారైనా చూస్తున్నారా అనేది అనుమానం. ఈ బస్తీలోని పిల్లలకు పుస్తకాల్లో చందమామ కనిపిస్తుంది కాని నిజంగా చందమామను చూసి ఉంటారని చెప్పలేము. నగర జీవితాన్ని పఠాభి వర్ణిస్తూనే బలిసిపోతున్న డబ్బు విలువను ఆనాడే దుయ్యబట్టారు.
ముఖరింపుచున్నది మా కర్ణాలలో
గుండియలందు గూడ, వెండి రూపాయి
ఘలంఘలా శ్రావ్య సంగీతము కర్ణపేయముగా
నిన్ను పోగొట్టుకున్న రూపాయి లాగైనా
భ్రమింపరే ఎవ్వారు నిజంగా’’
అంటూ చంద్రుణ్ణి అడ్డం పెట్టుకొని నగర ప్రజల డబ్బు గొడవ నిరసించారు. ఇంకా ఎలక్ట్రికు దీపాల కాంతుల్ని, ఎలక్ట్రికు అడ్వర్టయిజుమెంట్ల రంగు రంగుల ఉన్మాద నగ్ననృత్యాల్ని వర్ణించారు. మద్రాసులోకి చంద్రుడు దరిబేసి గ్రామస్తుడిలాగా దారి తప్పి వచ్చాడని, దేబిరిస్తున్న చంద్రుడిపట్ల సానుభూతి చూపించారు. నగరం కాలం స్పీడును కూడా అద్భుతంగా వర్ణించారు పఠాభి.
‘‘నీవు మాత్రం పదిహేనురోజుల్లోన గాని
నీ రూపాన్నంతా మార్చుకోలేవు
చాలాకాలం, చాలా ఆలస్యం
ప్రజాదృష్టిని ఆకర్షించటంలో
మార్కెట్లోని దుస్సాధ్య కాంపిటీషన్‌కు నీవు
తట్టుకోలేవు జాగ్రత్త సుమా’’
అంటూ పెరిగిపోతున్న కాంపిటీషన్ ప్రపంచాన్ని ఆనాడే పఠాభి అక్షరబద్ధం చేశారు. ఇంకా పఠాభి -మరీనా బీచ్‌ని గురించి, అక్వేరియం హోటళ్ల గురించి సిగరెట్టు పొగ కరల్సు గురించి, అమెరికన్ కార్ల గురించి అమెరికన్ స్ర్తిల గురించి, శరీరాన్ని అమ్ముకునే అభాగినుల గురించి వర్ణించారు.
సమాజంలోని వివిధ వృత్తుల్లో వున్నవారిని గురించి కవిత్వం రాయటం అనే ధోరణికి కూడా శ్రీకారం చుట్టిన ఘనత పఠాభిదే. పోలీసు అనే కవితలో రోడ్లు కూడలిలో ట్రాఫిక్ పోలీసు డ్యూటీని అద్భుతంగా వర్ణించారు. ‘్భరతనాట్యం బాడుచున్న ప్రశాంత ప్రకాశ ముఖంబు తోడి, నటర్షి చూడమణిలాగ’ పోలీసు కనిపించాడు పఠాభికి.
‘‘ప్రచండాతి ప్రచండ ఘోరాతి ఘోర
తీవ్రాతి తీవ్ర తపస్సుం
జేయుచున్నాడో నిష్ఠతోడన్..
మహాశక్తి సంపన్నుండగు యోగి..
పోలీసు భటుణ్ణి చాలా నేను
స్తుతి చేస్తాను. బలే గౌరవిస్తాను
ఇంకా ముగ్ధుండనయిపోతాను కూడా
వాని భరత నాట్యంబును చూచ్చూడ’’
ఇలా ప్రత్యేకమైన అంశాలమీద కవిత్వం రాయటం ఈనాటికీ ఫ్యాషన్‌గానే వున్నది. గూర్ఖావాడిమీద, సోడాబండి వాడిమీద.. ఇలా ఎన్నో అంశాలమీద మన వచన కవులు ఇపుడు కూడా కవితలు రాస్తూనే ఉన్నారు.
పడుపు వృత్తిలోని వాళ్ళను గురించి పఠాభి వర్ణించారు కానీ ఆ వృత్తిలోని కన్నీళ్ళ జాలును గమనించలేదని కె.వి.రమణారెడ్డి పఠాభిని విమర్శించారు. ఇది సత్యం కాదు.
-సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)

--రావి రంగారావు