వినమరుగైన

వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈఏడు ఉపన్యాసాలను పుస్తకరూపంలోకి తెచ్చాక, తెలుగు విమర్శలో ఒక కొత్త పోకడ వచ్చిందని రసలోకం గుర్తించింది. రాళ్లపల్లి తన ఉపన్యాసాలను తెలుగు విమర్శలో శిష్ట్భారుచి ప్రవేశపెట్టడానికి లక్ష్యాలుగా వాడారు. అప్పటివరకు ఒక కవిత్వతత్త్వ విచారం మినహాయించి- తెలుగు విమర్శ వ్యక్తిగత దూషణ భూషణాదులతో నిండి వుండేది. వేమనతో తెలుగు విమర్శ వనానికి వసంతం వచ్చినట్లయింది.
వేమన చదువుతుంటే కేవలం ఒక విమర్శ గ్రంథం చదివినట్లుగా పాఠకుడు అనుభూతి చెందడు, ఓ కావ్యం చదివినపుడు కలిగే ఆనందం అనుభవిస్తాడు.
వేమన కవిత్వానికి విలువ కట్టడం విమర్శకుడికి ఆషామాషీకాదు. కారణం, వేమన కవిత్వం రెండంచులకత్తి. ఒకే విషయాన్ని వేమన ఓసారి దూషిస్తాడు, మరోసారి ప్రశంసిస్తాడు. విమర్శకుడు పక్షపాత బుద్ధితో ఉంటే పాఠకుడిని పక్కదోవ పట్టించడం చాలా సులువు. కావాలంటే ఏ వర్గంవారి ప్రతిష్టనయినా దెబ్బతీయవచ్చు. కాని, తిట్టు, పొగడ్త రెంటిని అవి ఏ స్థానానికి చెందుతాయో అక్కడ వుంచడం సద్విమర్శకుడి పని. ఈ అసిధారావ్రతంలో రాళ్లపల్లి ఎంత చక్కగా నెగ్గుకొచ్చారో వారి వేమన అంతా ఉదాహరణమే. వేమన అందరినీ తిట్టాడు అన్న అపోహ ప్రజలలో ఉంది. రాళ్లపల్లి ఎంతో నేర్పుతో ప్రజల అపోహను తొలగించాడు.
పుస్తకం చదవడం ముగించి పక్కన పెట్టాక మానవాళిని వేమన ఇంతగా ప్రేమించాడా అని మనకు అనిపిస్తుంది. రాళ్లపల్లి తర్వాత వేమనను బాగా అర్థం చేసుకుంది నా దృష్టిలో కృష్ణగారే. వేమనకు ప్రజలపై వున్న ప్రేమను ఆయన ఇలా స్థాపించారు. కవికీ ఇతరులకూ ఇంకో తేడా వుంది. కవికి ఈ లోకమంటే బ్రహ్మాండమైన అనురాగం. అది లేకపోతే కవి కానే కాడు. ద్వేషం సృష్టించలేడు. ప్రేమ సృష్టిస్తుంది.
ఇదీ వేమన కవితాత్మ. తన ఏడు ఉపన్యాసాలలో రాళ్లపల్లి వారు ఈ కవితాత్మని శక్తిమంతంగా ఆవిష్కరించారు.
తొలి ఉపన్యాసం పేరు ఉపోద్ఘాతం. ఇందులో మొదటి పేరాలోని మొదటి వాక్యం వేమన ఆంధ్రులలో సాటిలేని వ్యక్తి అని ఉంటుంది. ఈ తొలి వాక్యంలోనే రాళ్లపల్లి హృదయం ఉంది. అదే వేమన ఓ మహాకవి అనో, గొప్ప ప్రజాకవి అంటే ఇంత విశిష్టత రాదు. నిజం ఆలోచిస్తే వేమనకు పోలిక ఎవరూ లేరు. వేమనలాంటివాడు వేమనే. ఇంకొక విశేషం, కథ మొత్తంలో ఒక్కసారి కూడా రాళ్లపల్లి వేమనని మహాకవి అనడు. అనకుండానే మనకా అనుభూతి కలిగిస్తాడు.
తర్వాత రాళ్లపల్లి ఈ తొలి ఉపన్యాసంలో వేమన పద్య సంఖ్య, ప్రక్షిప్తాలు పరిహరించే పద్ధతి, వివిధ ప్రతులలోని పాఠభేదాలు, సాధారణ పద్యాలకు వ్యాఖ్యాతలు చేసే చిత్ర వ్యాఖ్యానాలు ప్రస్తావించి చివరలో ఇలా అంటాడు. ఇప్పటికిని బ్రౌను దొర ముద్రణమే సర్వోత్తమమని చెప్పుటకు సిగ్గగుచున్నది. అతడు మనకు జేసిన మహోపకారము నేనరగంట చూచుచున్నానని తలపకుడు. చెన్నపట్టణములోని ప్రాచ్య పుస్తకాలలోని వ్రాతప్రతుల నొకమారైనను చూచినవారికి తప్ప తక్కినవారికా మహనీయుని యుప్పు తెలియదు. కాని యతడు దోసిలి నిండ బెట్టినను, పెట్టినదెంత మంచి వస్తువైనను, అది బిచ్చమే. అతని దార్యమన కతనిని పొగడుదము కాని మన దారిద్య్రమునకు సిగ్గుపడవలదా’’

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

కొలసాని సాంబశివరావు