వినమరుగైన

వేమన ( రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొత్తం గ్రంథంలో రాళ్లపల్లి వారి వ్యక్తిత్వం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఒక సాహితీ లేఖ వారే అంటారు. ‘నా దృష్టిలో, నా వ్యవహారములో, విమర్శ ఒక శాస్తమ్రుగాదు. ఆ దృష్టితో నా విమర్శలు నేనెప్పుడును సాగింపలేదు. నాకు తోచినది అభిమాన సంప్రదాయములకు పూర్తిగా లొంగక స్పష్టముగా, వినీతిలో చెప్పవలెనని నా ప్రయత్నము. ఎవ్విర్రీ క్రిటిసిజమ్ ఈజ్ ఆన్ ఆటోబయోగ్రఫి అని ఒక తత్త్వదర్శి అన్నాడని విన్నాను. నా విషయమున అది సత్యము’. అందువల్లనే వారి విమర్శ కవితలా ప్రకాశిస్తుంది.
రాళ్లపల్లివారి వేమన గ్రంథంపై చాలా విమర్శ ఉంది. రాళ్లపల్లివారు సి.పి.బ్రౌన్ గురించి చెబుతూ, మనవారతనిని (మేమనను) కవిగా దలపకపోయినను, అతని పద్యములనన్నిటిని బహు శ్రమచే సంపాదించి, దిద్దించి, వ్రాయించి, తానే ఇంగ్లీషున టీక వ్రాసి, ప్రకటించి, శాశ్వత కీర్తి సంపాదించిన బ్రౌను దొర కూడా ఇతనిని కవియన లేడయ్యెను అంటారు. దీనికి ఆరుద్ర ‘బ్రౌను దొర ఎక్కడా స్పష్టంగా పొయిట్ అనే పదంతో వేమన గారిని పేర్కొనలేదు. నిజమే. అయితే వేమనగారిని దొరగారు ఆథర్ అనీ ఎపిగ్రమటిస్ట్ అనీ పేర్కొన్నారు అంటూ డొంక తిరుగుడుగా వేమనను కవి అని ప్రతిష్ఠించడానికి తంటాలు పడ్డారు. ఇటు రాళ్లపల్లి అటు ఆరుద్రల దృష్టికి రాని పొయిట్ అన్నమాట అదృష్టవశాత్తు ఈ ప్రసంగకర్త దృష్టికివచ్చింది. సి.పి.బ్రౌను తన వెర్సెస్ ఆఫ్ వేమనకు వ్రాసిన ఒక వాక్యం చిత్తగించండి. ఇట్ ఈజ్ పర్‌హాప్స్ ఇంపాజిబుల్ టు మీట్ విత్ ఎ కంప్లీట్ కాపీ ఆఫ్ దిస్ పొయిట్ ఇన్ ఆ మాన్‌స్క్రిప్ట్ ఆఫ్ ఎనీ యాంటిక్విటీ. అనగా ఈ కవిదెంత ప్రాచీన ప్రతి అయినను పూర్తి ప్రతి లభించుట బహుశః అసాధ్యము అని పై బ్రౌన్‌గారి ఆంగ్ల వాక్యానికి అర్థం. కనుక సి.పి.బ్రౌన్ కవి అని పిలిచి గౌరవించారని అంగీకరిస్తారు కదా. అలాగే ప్రొఫెసర్ ఎన్.గోపి, తన పిహెచ్‌డి సిద్ధాంత గ్రంథం ప్రజాకవి వేమనలో రాళ్లపల్లి వారన్నట్లుగా ఇలా అన్నారు. చూడండి. ‘బలమైన హేతువు లభించనంతవరకు ఆటవెలదలుకాని పద్యలు- అంటే కందాలు, చంపకాదులైన వృత్తాలు, పాటలు, వచనాలను వేమన కృతాలుగా నమ్మరాదు’ అని శర్మగారిపై ఇలా నిందవేశారు. ఆటవెలదులు కాని పద్యాలను నమ్మలేనన్న శర్మగారే దీనికి విరుద్ధంగా అనేక కందాది పద్యాలను తమ గ్రంథంలో వాడుకున్నారు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కొలసాని సాంబశివరావు