వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సందర్భంగా సాహిత్యాదర్శాలలో, సంప్రదాయాలలో ఎదురుతిరిగి నవ్యత్వం కోరుతూ -వ్రాసినది నవ్య సాహిత్యం అవుతున్నదని, పాశ్చాత్య సంస్కారం మీద అభిమానంతో కూడిన భాషాతత్వం, చరిత్ర నిర్మాణం, సృష్ట్యాది కాలనిర్ణయం, సంఘ ధర్మాలు, విశ్వాసాలు వీటిని ఏఏ గ్రంథాలు పరామర్శిస్తాయో అదంతా నవ్య సాహిత్యం అవుతుందని విశ్వనాధ నవ్య సాహిత్యాన్ని నిర్వచించారు. అంతేకాదు, నవ్య సాహిత్య భవిష్యత్తు అంతా రాజకీయాలమీద ఆధారపడి వుందన్నారు. స్వాతంత్య్రం రావటం రాకపోవటం, వస్తే రాజ్యాధికారం కాంగ్రెసు వారి చేతుల్లో వుంటుందా, సామ్యవాదుల చేతుల్లో వుంటుందా అనే అంశాలమీద ఆధారపడి నవ్య సాహిత్య భవిష్యత్తు వుంటుందని తీర్మానిస్తూ తీర్పునిస్తూ విశ్వనాథ ఈ ఉపన్యాసం ముగించారు.
చాలాకాలం నుంచీ నవ్య సాహిత్య చరిత్ర వ్రాయాలని అనుకొంటున్న కురుగంటి ఆలోచనలకు బలం చేకూర్చి ఒక నిర్దుష్టమైన ప్రాతిపదికను సమకూర్చిపెట్టింది విశ్వనాధవారి ఈ ఉపన్యాసమే. 1994లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన నవ్యాంధ్ర సాహిత్య వీధులు తృతీయ ముద్రణకు సంపాదకులైన కోవెల సుప్రసన్నాచార్యగారు విశ్వనాధవారి ఈ ఉపన్యాసాన్ని ప్రస్తావిస్తూ, ఈ పునాది మీదనే అత్యంత సుందరమైన మహాసౌధ నిర్మాణం చేశారు కురుగంటి అని పేర్కొన్నారు కూడా.
కురుగంటి సీతారామయ్య నవ్యాంధ్ర సాహిత్యాన్ని మహానగరంగా ఊహించారు. సాహిత్యంలోని భిన్న ప్రక్రియలు, ధోరణులు ఆ నగరంలోని వీధులు, తన కాలపు కవులను, ఉద్యమాలను, పత్రికలను, రచనలను పరిచయం చేస్తూ ఆ వీధులలో మనలను తిప్పుకొస్తారు సీతారామయ్యగారు. అందువల్ల రుూ పుస్తకం చదవటానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.నవ్యాంధ్ర సాహిత్య వీధులులో నాలుగు ప్రధాన రహదారులున్నాయి.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

కాత్యాయనీ విద్మహే