వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండవ భాగంలో నవ్య సాహిత్య ఉద్యమానికి గిడగు రామమూర్తి భాషా సంస్కారవాదం, రాయప్రోలు, గురజాడల ఖండకావ్యం గీతికా రచన, కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్త్వ విచార రచన, సాహితీ సమితి స్థాపన మూల్తంభాలని ప్రతిపాదించిం నిరూపించటం ఈ భాగంలో జరిగాయి. గురజాడ రాయప్రోలులో నవ్యకవిత్వానికి మొదటివాళ్లెవరని ప్రశ్నించి, చర్చించి రాయప్రోలు వైపు కొంత మొగ్గు చూపుతూ పోర్యాపర్యములతో పనిలేదని యిద్దరినీ కూడా నవ్య సాహిత్య పితృ సమానులనటం సమంజసమని తేల్చి చెప్పారు సీతారామయ్య. ఈ సమన్వయ మార్గానికిప్రచారం కల్పించింది నారాయణరెడ్డి గారి సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము- ప్రయోగములు. ఈ భాగంలోనే రామలింగారెడ్డి గారు మొదలైనవారు సుబ్బరాయ అప్పారాయ మార్గానుయాయులు అని సీతారామయ్య చేసిన ప్రతిపాదనతో విభేదిస్తూ డాక్టర్ అనుమాండ్ల భూమయ్య- ఆద్యుడు కట్టమంచి అనే పుస్తకం ప్రచురించారు. ఆ రకంగా ఈ భాగంలోని అంశాలు తరువాతి కాలంలో ఆమోద అభిశంసలకు లోనయ్యాయి.
నవ్యాంధ్ర సాహిత్య వీధులు మూడవ భాగం జాతీయోద్యమ నేపథ్యంలో నవ్య సాహిత్యం విస్తరించిన తీరును వివరించింది. దాదాపు డెబ్భై మంది కవులు, కథకుల రచనలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. నాల్గవ భాగంలో 1940 నుండి 50 వరకు ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక రంగాలలో వచ్చిన పరిణామాలు చర్చకు వచ్చాయి. రాజకీయాలలోను, సాహిత్యంలోను విప్లవ దృష్టి ప్రబలిన కాలంగా రచయిత ఈ కాలాన్ని భావించారు. దాదాపు నూట యాభై మంది కవులు, రచయితలు, పరిశోధకులు చేసిన కృషి ఇందులో పరిచయం చేయబడింది.
విస్తృత సమాచారాన్ని భిన్న మార్గాలలో, భిన్న మూలాలనుండి సేకరించి సమకూర్చినందువలన అభిప్రాయ భేదాన్నో అదనపు సమాచారాన్నో తెలిపే పాద సూచికలను ఇయ్యటంవలన ఈ నవ్యాంధ్ర సాహిత్య వీధులు సాహిత్య చరిత్ర రచనగా ప్రామాణికతను సంతరించుకొన్నది. ప్రధాన రచనలోకానీ, పాద సూచికలలో కానీ ఈయబడిన సమాచారం చూస్తే భిన్న ప్రక్రియలలో పనిచేసి పేరెన్నికగన్న వారితోపాటు ప్రసిద్ధికిరాని వారి పేర్లు, రచనలు కూడా కనబడతాయి. చరిత్ర రచనకు వుండాల్సిన గుణమే అది. అందువల్ల నవ్యాంధ్ర సాహిత్య వీధులు సాహిత్య చరిత్ర రచనగా ఈనాటికీ విలువ కలిగిన గ్రంథమే.
రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..
- సశేషం

కాత్యాయనీ విద్మహే