వినమరుగైన

నవ్యాంధ్రసాహిత్య వీధులు- కురుగంటి సీతారామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1947 నాటికి క్రమంగా సంప్రదాయ మార్గం విశేషాదరాన్ని పొందటాన్ని గురించి పలువురు నవ్యకవులు సంప్రదాయ మార్గానుయాయులు కావటాన్ని గురించి ఉత్సాహంగా ప్రస్తావించారు. ఇవన్నీ సీతారామయ్యగారి సంప్రదాయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
సీతారామయ్యగారి సంప్రదాయ దృక్పథంలో ఏకీభావం కల విమర్శకులకు నవ్యాంధ్ర సాహిత్య వీధులలోని చాలా విషయాలు విలువైనవే.ఈ కారణంగానే నవ్యాంధ్ర సాహిత్య వీధులు మొదటి ముద్రణ వచ్చినకొద్ది కాలానికే (1944 మార్చి) మార్క్సిస్టు సాహిత్య విమర్శకుడైన మద్దుకూరి చంద్రశేఖరరావు సమీక్ష వ్రాస్తూ నవ్య సాహిత్యంలో గురజాడ పంథాను అంచనా వేయటంలో సీతారామయ్య సంకుచిత దృష్టిని కనబరిచారని విమర్శించారు.
రచనా వస్తు శిల్పాలను, సాహిత్య ఉద్యమాలను సామాజిక రాజకీయ వౌలిక సంబంధంలో కార్యకారణ సంబంధంలో అంచనావేసేకొద్దీ ఆ విలువలలో మార్పు రావటం అనివార్యం. నవ్యాంధ్ర సాహిత్య వీధులు అందిస్తున్న సమగ్ర సమాచారం ఆధారంగా ఆ వైపు జరగాల్సిన కృషికి వర్తమాన సందర్భంలో ప్రాధాన్యత వుంది. అందుకు అవసరమైన సామగ్రిని ఒక చోట చేర్చిపెట్టిన కురుగంటి సీతారామయ్యకు, తెలుగు సాహిత్య అధ్యయనపరులు రుణపడి ఉంటారు. నన్నయకు నారాయణభట్టులాగా- సైదోడై నిలిచిన పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావును గుర్తుంచుకొంటారు. తెలంగాణ రాయలసీమ కవులు, రచయితల చరిత్రను, సాహిత్య సాంస్కృతిక ఉద్యమ చరిత్రను కోస్తా తెలుగు కవుల రచయితల చరిత్రతో, సాహిత్య ఉద్యమాలతో కలుపుకొని వంద సంవత్సరాల ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రను చెప్పే మరొక గ్రంథం వచ్చేవరకు తెలుగువాళ్లకు నవ్యాంధ్ర సాహిత్య వీధులు అవసరం వుంటూనే వుంటుంది. ఆ తరువాతకూడా నవ్యాంధ్ర సాహిత్య చరిత్ర రచనకు నాందీ ప్రస్తావనలు చేసిన గ్రంథంగా దాని చారిత్రక ప్రాధాన్యత దానికి వుండనే వుంటుంది.
సంపూర్ణం

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

కాత్యాయనీ విద్మహే