వినమరుగైన

ఆంధ్ర సాహిత్య చరిత్ర పింగళి లక్ష్మీకాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మేలి పువ్వులను ఏర్చి కూర్చెడి నేర్పుగల వారు గూర్చిన దండ వంటిది. ఇతర కీటకములకు సారూప్యమునిచ్చు భ్రమరము వంటిది’’ అని తెలుగు (్భషా) వైశిష్ట్యాన్ని గురించి తమ ఆంధ్ర సాహిత్య చరిత్రలో నిర్వచించిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు, కవిగా, విమర్శకులుగా, సాహితీపరులుగా ఆధునికాంధ్ర సాహితీ లోకానికి సుపరిచితులు. ఆధునిక సాహితీ విమర్శకు ‘కట్టమంచి రామలింగారెడ్డి’గారు నాంది పలికితే, అందులో కృషిచేసి ఆ ప్రక్రియను విస్తృతపరచినవారు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారు. వారివలెనే పింగళివారుకూడా విమర్శను చేపట్టి అత్యుత్తమ విమర్శకులుగా ఆధునికాంధ్ర సాహితీలోకంలో ఒక సమున్నత స్థానాన్ని పొందగలిగారు. అందులకు గీటురాయిగా నిలిచింది వారి ఆంధ్ర సాహిత్య చరిత్ర.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంధ్రాచార్యులుగా, కొన్ని సంవత్సరాలపాటు సాహిత్య చరిత్రను విద్యార్థులకు బోధించి, వారిని అత్యుత్తమ సాహితీపరులుగా తీర్చిదిద్దడంతోపాటు, ఆ సాహిత్య చరిత్రను ఒక చక్కని గ్రంథరూపంగా తీర్చిదిద్దడానికి పింగళివారు నిరంతరం కృషి చేసి అందులో కృతకృత్యులయ్యారు.
ఆంధ్ర సాహిత్య చరిత్రలో ప్రాఙ్నన్నయ యుగం, నన్నయ యుగం, శివకవుల యుగం, తిక్కన యుగం, ఎఱ్ఱన యుగం, శ్రీనాథ యుగం, శ్రీకృష్ణదేవరాయల యుగం అన్న వినాభాగాలున్నాయి. ఒక్కొక్క యుగాన్ని విశే్లషించి, ఆ యుగానికి చెందిన కవులను, వారి కావ్యాలను, అందులోని విశేషాలను చక్కగా విశే్లషించారు పింగళివారు. గ్రంథంలో పేర్కొనదగ్గ మొదటి యుగం ప్రాఙ్నన్నయ యుగం. ఒకటవ శతాబ్దం నుండి పదవ శతాబ్దం వరకు నన్నయకు పూర్వం చెప్పుకోదగ్గ కవులు గాని, కావ్యాలు గాని లేకుండా అంధకార బంధురంగానున్న ఈ యుగాన్ని విశే్లషిస్తూ ప్రాఙ్నన్నయ యుగంలో ప్రశస్తినొందిన కవులుగాని, కావ్యలుగాని లేకపోవడానికి బలమైన కారణం ప్రజాదరణ లేకనో, రాజుల మన్నన లేకనో ప్రస్తుతః వాటిలో జీవము లేకనో, అవి నశించిపోయి యుండును. జీవమున్న గ్రంథం ఎప్పటికీ నశింపదు. గ్రంథ విషయంలో ఉదాత్తతయు, భాషా శైలిలో నిర్దుష్టతయు, గ్రంథకర్త భావములలో గంభీరత లేని రచనలు ఇతరములైన సొగసులేవియున్నను, అవి చిరకాలం నిలిచియుండవు’’ అని పింగళివారు విశదీకరించారు.
ప్రాఙ్నన్నయ యుగం తర్వాత పేర్కొనదగ్గది నన్నయ యుగం. సంస్కృతంలో వ్యాసభగవానుడు రచించిన సంస్కృత మహాభారతాన్ని రాజ రాజ నరేంద్రుని కోరిక మీద ఆంధ్రీకరించడానికి పూనుకొన్న ఆదికవి, వాగమశాసనుడైన నన్నయ భట్టారకుని కవితా వైశిష్ట్యాన్ని నన్నయ యుగంలో విపులీకరించారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు. నన్నయ అనువాద వైఖరిని గురించి ముచ్చటిస్తూ
‘‘నన్నయ కథా సూత్రప్రధానమును, యధోచితానుసరణమును అయిన అనువాదమునే ప్రారంభించెనుగాని, మూల విధేయముగా తెనిగింప పూనుకోలేదు.

రెండు దశాబ్దాల క్రితం విజయవాడ ఆకాశవాణిలో ప్రసారమైన - శత వసంత సాహితీ మంజీరాలు - శీర్షిక నుంచి..

- సశేషం

ధూర్జటి వేంకట బాలాజీ